Allu Arjun: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌కు భారీ ఊరట..
Allu Arjun Nandyal Case: సినీ నటులు అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో బుధవారం ఊరట లభించింది.
Allu Arjun: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌కు భారీ ఊరట..
Allu Arjun Nandyal Case: సినీ నటులు అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో బుధవారం ఊరట లభించింది. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు బుధవారం తుది ఉత్తర్వులు ఇచ్చింది.
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డి. వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధిగా ఆయన నంద్యాలలో పోటీకి దిగారు. రవికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల నియామావళిని ఉల్లంఘించి ప్రచారం నిర్వహించినందుకు అప్పట్లో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్ తో పాటు, శిల్పా రవిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ గత నెలలో అల్లు అర్జున్, శిల్పా రవిలు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.