Allu Arjun: రేవతి కుటుంబానికి క్షమాపణలు

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మరణించిన రేవతికుటుంబానికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారు.

Update: 2024-12-14 06:46 GMT

Allu Arjun: రేవతి కుటుంబానికి క్షమాపణలు

Allu Arjun: సంధ్య థియేటర్ (Sandhya theatre) తొక్కిసలాటలో మరణించిన రేవతి (Revathi ) కుటుంబానికి అల్లు అర్జున్ (allu arjun) క్షమాపణలు చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి థియేటర్ లో సినిమా చూస్తున్న సమయంలో బయట ఈ ఘటన జరిగిందని ఆయన అన్నారు. తొక్కిసలాటకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందని ఆయన తెలిపారు. తన అరెస్ట్ సమయంలో తనకు అండగా నిలిచినవారికి, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 20 ఏళ్లుగా తాను సంధ్య థియేటర్ లో సినిమా చూస్తున్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని ఆయన అన్నారు.

Tags:    

Similar News