Nidhhi Agerwal : జోరు పెంచేసిన నిధి అగర్వాల్.. ముగ్గురు హీరోలతో..

* పాన్ ఇండియా హీరోయిన్ గా మారనున్న ఫ్లాప్ హీరోయిన్

Update: 2023-03-17 07:52 GMT

ముగ్గురు హీరోలతో రొమాన్స్ చేయనున్న అఖిల్ హీరోయిన్ 

Nidhhi Agerwal: గత కొద్దిరోజులుగా సినిమాలలో కనిపించని నిధి అగర్వాల్ తాజాగా ఇప్పుడు బిజీ హీరోయిన్గా మారిపోయింది. చేతిలో బోలెడు సినిమాలతో స్టార్ హీరోయిన్గా అడుగులు వేస్తోంది ఈ భామ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న "హరిహర వీరమల్లు" సినిమా షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన మారుతీ దర్శకత్వంలో "రాజా డీలక్స్" సినిమా చేస్తోంది ఈ భామ. ఈ రెండు సినిమాలు తోనూ నిధి ప్రేక్షకులు బాగానే ఆకర్షించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

అఖిల్ "మిస్టర్ మజ్ను" సినిమాలో ఆఖరి సారిగా కనిపించిన నిధి అగర్వాల్ గత కొంతకాలంగా సోషల్ మీడియాకి కూడా దూరంగానే ఉంటుంది. కానీ ఈమె చేతిలో మాత్రం బోలెడు సినిమాలు వచ్చి పడ్డాయి. ఒక బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న ఈమె తన తదుపరి సినిమాలపైనే ఆశలన్నీ పెట్టుకుంది. తాజాగా నిధి అగర్వాల్ కి సంబంధించిన మరొక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ మారుతుంది.

నిధి అగర్వాల్ తో రొమాన్స్ చేయడానికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ హీరోలు ఎవరు మరియు ఆ సినిమాలకి సంబంధించిన వివరాలు ఇంకా తెలియనున్నాయి. ఈ నేపధ్యంలోనే ఈ మధ్య నిధి అగర్వాల్ మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది. వరుసగా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. త్వరలోనే నిధి అగర్వాల్ ప్యాన్ ఇండియా హీరోయిన్ గా కూడా మారుతుందేమో అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News