Akhanda 2: 10 రోజుల్లో అఖండ 2… హైప్ సరిపోతుందా?
ఇంకా కేవలం పది రోజుల్లో ‘అఖండ 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి నిర్మాతల టార్గెట్ మొత్తం నార్త్ మార్కెట్.
Akhanda 2: 10 రోజుల్లో అఖండ 2… హైప్ సరిపోతుందా?
ఇంకా కేవలం పది రోజుల్లో ‘అఖండ 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి నిర్మాతల టార్గెట్ మొత్తం నార్త్ మార్కెట్. అందుకే ప్రమోషన్లను భారీ స్థాయిలో ప్రారంభించారు. ముంబైలో సాంగ్ లాంచ్‌తో మొదలుపెట్టి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు వరుస ఈవెంట్లు ప్లాన్ చేశారు.
ఈ శుక్రవారం జరగనున్న ప్రీ–రిసీజ్ ఈవెంట్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని టాక్. బాలయ్యతో ఆయనకు ఉన్న మంచి స్నేహం, గతంలో టిడిపితో సంబంధాలు ఉండటం వల్ల ఈ కలయిక సాధ్యమైందని టీమ్ చెబుతోంది. అయితే, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
హైప్ సంగతి?
‘అఖండ’ మొదటి భాగం ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. కరోనా తర్వాత థియేటర్లకు జనాన్ని భారీగా రప్పించిన చిత్రాల్లో అఖండ టాప్‌లో నిలిచింది. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే హైప్ ఆకాశమే హద్దు కావాలి.
కానీ
తమన్ ఇచ్చిన రెండు పాటలు మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి
ట్రైలర్‌లో యాక్షన్ ఎక్కువైంది అని కొందరు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు
అయినా ఇవన్నీ పక్కనపెడితే, థియేటర్ బిజినెస్ మాత్రం భారీ క్రేజ్‌తోనే ముగిసింది. ఈసారి టార్గెట్ ₹200 కోట్ల వరకూ ఉండొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.
ప్రీమియర్ల రెడీ…
‘అఖండ 2’ విడుదలకు ముందురోజు సాయంత్రం ప్రత్యేక ప్రీమియర్ల ప్లాన్ రెడీ. అనుమతులు వచ్చిన వెంటనే అనౌన్స్‌మెంట్ ఇస్తారు. అదనపు టికెట్ రేట్లు ఉంటాయని, కానీ ప్రేక్షకులకు బేరీజు అయ్యే ధరల్లోనే ఉంచుతామని నిర్మాతలు చెబుతున్నారు.
ఏపీ కోసం రేట్ల పెంపుకు సంబంధించిన జీఓపై కూడా అంతా దృష్టి పెట్టింది.
క్లాష్ పరిస్థితి
తెలుగులో ‘అఖండ 2’ సోలో రిలీజ్
హిందీలో మాత్రమే రణ్వీర్ సింగ్ ‘దురంధర్’ తో పోటీ
అందుకే హిందీ బాక్సాఫీస్‌లో మాత్రం కాస్త టఫ్ ఫైట్ ఉండొచ్చు.
టీమ్ నమ్మకం
అంచనాలు ఎలా ఉన్నా, టీమ్ మాత్రం గట్టి నమ్మకంతో ఉంది
‘అఖండ 2’ ప్రేక్షకులను 100 కాదు… 200 శాతం సంతృప్తి పరుస్తుంది!