Akhanda 2: అఫీషియల్‌గా వాయిదా… పోటీ నుంచి తప్పుకున్న బాలయ్య, ఇక ఓజీ సొంత రాజ్యం!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అఖండ 2. ఈ కాంబినేషన్‌కి ఇప్పటికే మూడు బ్లాక్‌బస్టర్‌ హిట్లు ఉండటంతో, ఈసారి కూడా అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Update: 2025-08-28 13:45 GMT

Akhanda 2: అఫీషియల్‌గా వాయిదా… పోటీ నుంచి తప్పుకున్న బాలయ్య, ఇక ఓజీ సొంత రాజ్యం!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అఖండ 2. ఈ కాంబినేషన్‌కి ఇప్పటికే మూడు బ్లాక్‌బస్టర్‌ హిట్లు ఉండటంతో, ఈసారి కూడా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సెప్టెంబర్‌ 25న రిలీజ్‌ అవుతుందని ముందుగా ప్రకటించినప్పటికీ, తాజాగా యూనిట్‌ అధికారికంగా సినిమా వాయిదా పడిందని ప్రకటించింది.

ఎందుకు వాయిదా?

టీజర్‌తోనే పాన్‌ ఇండియా స్థాయిలో అద్భుతమైన హైప్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం, రికార్డింగ్‌, VFX, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు సమయాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాయి. అందుకే సినిమా నాణ్యతపై రాజీపడకుండా, మరింత గ్రాండ్‌గా ప్రేక్షకులకు అందించడానికి అదనపు సమయం తీసుకుంటున్నట్టు టీమ్‌ తెలిపింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

ఒంటరిగా ఓజీ!

అఖండ 2 పోస్ట్‌పోన్‌ కావడంతో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న ఓజీ కి పోటీ లేదు. ఇది ఓజీ టీమ్‌కు పెద్ద అదనపు బూస్ట్‌గా మారింది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌ వద్ద వర్కౌట్‌ అయితే అద్భుతమైన కలెక్షన్లు సాధించడం ఖాయం.

అఖండ 2 వాయిదా పెట్టడంతో, ఓజీకి సొంతంగా బాక్స్ ఆఫీస్‌ రేసు లభించింది అని అభిమానులు అంటున్నారు.

Tags:    

Similar News