Pathan Movie: షారుక్ ఖాన్ సినిమాలో కనిపించనున్న సౌత్ స్టార్ హీరోయిన్

Update: 2021-08-25 09:30 GMT

షారుఖ్ చిత్రంలో నటించనున్న నయనతార (ఫైల్ ఫోటో)

Pathan Movie: "హీరో" సినిమా తర్వాత కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తాజాగా ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా చలామణి అవుతున్న అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకొన్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ లో ఈ చిత్రం షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా కనిపించనుందట. యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు బాలీవుడ్ నటుడు అయిన సునీల్ గ్రోవర్ ని కూడా రంగంలోకి దింపారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎస్.ఆర్.కె - అట్లీ సినిమాని చాలా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని, ఈ సినిమా కోసం స్టార్ నటీనటులను తీసుకుంటున్నారని సమాచారం. బాలీవుడ్ నుంచి మాత్రమేకాక సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా పలు నటీనటులను ఈ సినిమాలో కి ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న "పటాన్" సినిమాతో బిజీగా ఉన్నారు. దీపికా పడుకోనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబరు లో పూర్తవుతుంది. అట్లీ తో కూడా సినిమా పూర్తయిన తర్వాత ఎస్ ఆర్ కె స్టార్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తో చేతులు కలుపనున్నారు.

Tags:    

Similar News