Viral Video: పెద్ద కొండపై నుంచి కిందకు దూకిన హీరోయిన్.. షాకింగ్ వీడియో వైరల్

‘దంగల్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్.

Update: 2026-01-06 11:26 GMT

Viral Video: పెద్ద కొండపై నుంచి కిందకు దూకిన హీరోయిన్.. షాకింగ్ వీడియో వైరల్

‘దంగల్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. ఆమిర్ ఖాన్ కూతురిగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ, సినిమాల పరంగా ఆశించిన స్థాయి విజయాలు అందుకోకపోయినా వరుస అవకాశాలతో బిజీగానే కొనసాగుతోంది.

ఇటీవల ‘మెట్రో ఇన్ దినో’, ‘ఆప్ జైసా కోయి’ వంటి చిత్రాల్లో నటించిన ఫాతిమా, అవి పెద్దగా సక్సెస్ కాకపోయినా తన క్రేజ్ మాత్రం తగ్గనివ్వడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె యాక్టివిటీ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది.

తాజాగా ఫాతిమా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. స్విమ్‌సూట్‌లో కనిపించిన ఆమె, ఏకంగా ఓ భారీ కొండపై నుంచి నేరుగా నీటిలోకి జంప్ చేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. సాధారణంగా అలాంటి ప్రమాదకర ప్రదేశాల్లో ఈత కొట్టడమే కష్టం. అలాంటిది అంత ఎత్తునుంచి దూకడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ వీడియోకు ఫాతిమా భావోద్వేగంగా స్పందిస్తూ,

“ఆ క్షణంలో నేను చాలా టెన్షన్ పడ్డాను. అయినా జంప్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ కొండపై నిలబడి దూకడానికి నాకు దాదాపు 20 నిమిషాలు పట్టింది. ధైర్యం తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. చివరకు చాలా ఆలోచించిన తర్వాత జంప్ చేశాను.

గాలిలో ఉన్న ఆ క్షణం, నీటిని తాకేలోపు సమయం చాలా పొడవుగా అనిపించింది. అది చాలా విచిత్రమైన అనుభూతి. జంప్ ముందు ఉన్న భయాలన్నీ, దూకిన తర్వాత మాయమయ్యాయి. ఏదో గొప్ప పని చేసిన సంతృప్తి కలిగింది” అని రాసుకొచ్చింది.


సాధారణంగా స్విమ్మింగ్ పూల్‌లో దూకడానికే భయపడే హీరోయిన్స్ మధ్య, ఫాతిమా ఇంతటి సాహసం చేయడం చూసి అభిమానులు ఆమెను తెగ ప్రశంసిస్తున్నారు. వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Tags:    

Similar News