సీనియర్ నటులు రాళ్ళపల్లి ఇకలేరు

Update: 2019-05-17 15:00 GMT

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ నటులు, డ్యాన్స్ డైరెక్టర్ రాళ్లపల్లి ఇకలేరు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ ఇవాళా తుదిశ్వాస విడిచారు. సుమారు 850పైగా చిత్రాల్లో నటించారు. రాళ్లపల్లి పూర్తిపేరు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు. సినీ పరిశ్రమలో ఎన్నో అవార్డులు అందుకొన్నారు. రాష్ట్ర నంది పురస్కారాన్ని మూడుసార్లు అందుకొన్నారు. 1976లో ఊరుమ్మడి బతుకులు చిత్రంలో నటనకు గాను ఉత్తమ కామెడీ నటుడిగా జాతీయ అవార్డును అందుకొన్నారు.

గణపతి అనే సీరియల్‌లో ఉత్తమ సహయనటుడిగా నంది అవార్డును పొందారు. కాగా హైదరాబాద్‌లోని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని తన నివాసానికి తరలించారు. రాళ్ళపల్లి మృతిపట్ల పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పించారు. 

Similar News