sobhita: శోభితకు బడా సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్‌.. ఓకే చెబుతుందా

అయితే శోభిత ఈ సాంగ్‌కు ఓకే చెబుతుందా.? లేదా అన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అసలే నాగ చైతన్యతో పెళ్లికి సిద్ధమైన శోభిత ఐటెం సాంగ్‌లో నటిండనాకిఇ అంగీకరిస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది

Update: 2024-08-22 17:00 GMT

Sobhita Dhulipala

అక్కినేని వారి ఇంటి కోడలిగా అడుగుపెట్టబోతోంది శోభిత ధూళిపాళ. నాగచైతన్యతో గతకొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 8వ తేదీన ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరగగా, ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.

అంతేకాకుండా ఈ జంట డెస్టినేషన్‌ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పారిస్‌లో చై, శోభితల వివాహం జరగబోతోందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రసత్ఉతం అటూ చై, ఇటు శోభిత తమ సినిమాల్లో బిజీగా ఉన్నారు. వీరిద్దరి ప్రాజెక్టులు పూర్తికాగానే పెళ్లి తంతు ప్రారంభంకానుందని వార్తలు వస్తున్నాయి.

కాగా తాజాగా ఓ బడా ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ మూవీలో ఐటెం సాంగ్‌ కోసం మేకర్స్‌ శోభతను అప్రోప్‌ అయ్యారని సమచారం. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటిస్తున్న డాన్‌ 3లో శోభితతో ఐటెం సాంగ్ చేయించాలని మేకర్స్‌ భావిస్తున్నారంట. ఇందులో భాగంగానే ఇప్పటికే శోభతతో ఈ విషయమై సంప్రదింపులు కూడా జరిగాయని తెలుస్తోంది.

అయితే శోభిత ఈ సాంగ్‌కు ఓకే చెబుతుందా.? లేదా అన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అసలే నాగ చైతన్యతో పెళ్లికి సిద్ధమైన శోభిత ఐటెం సాంగ్‌లో నటిండనాకిఇ అంగీకరిస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ డాన్‌ 3లో శోభిత నిజంగానే నటించనుందా.? లేదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News