Aaradhya Bachchan: ఐశ్వర్య కూతురి బాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌ అయినట్లేనా.?

Aaradhya Bachchan: ఇండస్ట్రీకి మరో స్టార్‌ కిడ్‌ ఎంట్రీ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.

Update: 2025-04-16 13:18 GMT

Aaradhya Bachchan: ఐశ్వర్య కూతురి బాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌ అయినట్లేనా.?

Aaradhya Bachchan: ఇండస్ట్రీకి మరో స్టార్‌ కిడ్‌ ఎంట్రీ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఐశ్వర్య రాయ్‌, అభిషేక్ బచ్చన్‌ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ సినిమాల్లోకి రానుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు కుటుంబ వేడుకలు, పబ్లిక్ ఈవెంట్స్‌లోనే కనిపించిన ఆరాధ్య... ఇప్పుడు సినీ ఎంట్రీకి సిద్ధమవుతోందా? అన్న చర్చ జోరుగా నడుస్తోంది.

ఈ ఊహాగానాలకు కారణం ఆమె ఇటీవల స్కూల్ ఈవెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తళుక్కుమనడం. తన స్కూల్‌లో అత్యుత్తమ విద్యార్థిగా పేరొందిన ఆరాధ్య, విద్యతోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ఇటీవల షారుక్ ఖాన్ కుమారుడు అబ్రామ్‌తో కలిసి ఒక నాటకంలో చేసిన నటన చూసినవారు ఆరధ్య స్టార్‌ మెటీరియల్‌ అని అభిప్రాయపడుతున్నారు. ఆ పర్ఫార్మెన్స్‌ చూసిన తర్వాత ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు.

ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా ఆరాధ్య భవిష్యత్తు వెలుగులోనే ఉన్నట్లు చెబుతున్నారు. టారో కార్డ్ రీడర్ గీతాంజలి సక్సేనా అంచనా ప్రకారం – ఆమె స్వతంత్రమైన, డామినేటింగ్ పర్సనాలిటీ కలిగిన వ్యక్తి అని అన్నారు. బాలీవుడ్‌లో ఆమె స్టెప్ వేస్తే స్టార్‌గా ఎదగడం ఖాయమని చెప్పారు. అయితే, న్యూమరాలజీ ప్రకారం ఆమె 7, 4 కాంబినేషన్‌ వల్ల కొన్ని సవాళ్లు ఎదురవుతాయని.. అయినా వాటిని దాటి విజయం సాధించగలదని అభిప్రాయపడ్డారు.

గీతాంజలి ప్రకారం ఆరాధ్య నటిగా కాకపోయినా, ఫిల్మ్ ప్రొడక్షన్ టీంలో సభ్యురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అవకాశమూ ఉందట. ఏదైనా ఆమె తల్లిదండ్రుల పేరుకు తగ్గట్టే టాలెంట్, కమిట్‌మెంట్‌తో ముందుకు వస్తే, మరో బచ్చన్‌ తారగా వెండితెరపై మెరవడం ఖాయం అని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.



Tags:    

Similar News