Mahesh Babu New Movie: భారీ బడ్జెట్ తో ఇంటి సెట్ నిర్మిస్తున్న చిత్ర బృందం

* ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు

Update: 2021-09-24 07:15 GMT

మహేష్ బాబు (ఫోటో- ది హన్స్ ఇండియా)

Mahesh Babu New Movie: ఈ మధ్యనే "సరిలేరు నీకెవ్వరు" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం దర్శకనిర్మాతలు ఒక పెద్ద ఇంటి సెట్ ని రెడీ చేస్తున్నారట. ఆర్ట్ డైరెక్టర్ ఎస్ ప్రకాష్ దాదాపు అయిదు కోట్ల బడ్జెట్ తో ఈ ఇంటి సెట్ ని సైతం రెడీ చేస్తున్నారట. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. మధీ ఛాయాగ్రహణం వహిస్తున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. "మహర్షి" సినిమా తర్వాత మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న రెండవ సినిమా ఇది.

Tags:    

Similar News