Oscar 2025 Winners: ఆస్కార్ 2025 విజేతలు వీరే..ఉత్తమ సహాయ నటుడు ఎవరంటే?

Update: 2025-03-03 02:12 GMT

Oscar 2025 Winners: యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల సంబురం ఘనంగా మొదలైంది. ఏ రియల్ పెయిన్ మూవీలో నటనకగాను కీరన్ కౌల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా ఎమిలియా పెరెజ్ లో నటనకు జోయా సాల్దానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఇక ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా వికెడ్ చిత్రానికి గాను పాల్ తేజ్ వెల్ కు ఆస్కార్ దక్కగా..ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ గా ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్ ఎంపికైంది.

97వ అకెడమీ అవార్డుల కోసం వైవిద్యమైన చిత్రాలు ఎంపిక అయ్యాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతోపాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నటీమణులు ఫ్యాషన్ ప్రపంచానికి సరికొత్త భాష్యం చెబుతూ ట్రెండీ దుస్తుల్లో మెరిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత జోయ్ సల్దానా భావోద్వేగానికి గురైంది. "ఈ గౌరవంతో నేను ఉప్పొంగిపోయాను" అని తన ప్రసంగంలో అన్నారు. ఆమె వేదికపైకి రాగానే, తన తల్లిని గుర్తుచేసుకుంటూ ఏడవడం ప్రారంభించింది. ఆమె తన పాత్ర ఎమిలియా పెరెజ్, మిగిలిన తారాగణం సిబ్బందిని ప్రశంసించింది. ఆమె మాట్లాడుతూ, "నా అమ్మమ్మ 1961లో ఈ దేశానికి వచ్చింది. కలలు, గౌరవం , కష్టపడి పనిచేసే చేతులతో వలస వచ్చిన తల్లిదండ్రులకు నేను గర్వకారణమైన సంతానం, అకాడమీ అవార్డును స్వీకరించిన మొదటి డొమినికన్-అమెరికన్‌ను నేనే. నేను చివరివాడిని కాదని నాకు తెలుసు. స్పానిష్‌లో పాడటానికి, మాట్లాడటానికి వీలు కల్పించే పాత్రకు నేను అవార్డు అందుకుంటున్నానని ఆశిస్తున్నాను. నా అమ్మమ్మ ఇక్కడ ఉంటే, చాలా సంతోషంగా ఉండేది." అంటూ భావోద్వేగానికి లోనైంది.

2025 ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే:

ఉత్తమ సహాయ నటుడు - కరెన్ కులిన్ (ది రియల్ పెయిన్)

ఉత్తమ సహాయ నటి - జోయ్ సల్దానా (ఎమిలియా పెరెజ్)

ఉత్తమ కాస్ట్యూమ్ - పాల్ టేజ్‌వెల్ (వికెడ్)

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - ఫ్లో

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ - షిరిన్ సోహానీ హోస్సేన్ మోలేమి (ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రస్)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: సీన్ బేకర్ (అనోరా)

ఉత్తమ హెయిర్ అండ్ మేకప్ - ది సబ్‌స్టాన్స్

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కాన్క్లేవ్

ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ - అనోరా

Tags:    

Similar News