ఈ పిల్లలను గుర్తుపట్టారా..?

Update: 2019-10-31 14:50 GMT

ఈ చిచ్చర పిడుగులు ఎవరో గుర్తుపట్టారా..? ఆయన్, అర్హా స్టార్ హిరో అల్లు అర్జున్ పిల్లలు.. విచిత్ర వేషాలు వేశారు ఏంటి అని చూస్తున్నారా.. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు జరుపుకుని పండుగను ఈ చిన్నారులు జరుపుకుంటున్నారు. మెగా కుటుంబం కొన్ని సంవత్సరాల నుంచి హాలోవీన్ వేడుకలు జరుపుకుంటుంది. అందులో భాగంగా ఈ చిన్నారులు కూడా హాలోవీన్ వేషధారణ వేశారు. పిల్లలు హాలోవీన్ వేషధారణలో ఉన్న చిత్రాలను అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.  అల్లు అయాన్ తన హాలోవీన్ దుస్తులలో గ్రీన్ కలర్ స్కిల్ అవతార్‌ను ఆడుతుండగా.., అల్లు అర్హా ప్రకాశవంతమైన మంత్రగత్తుల్లా ఉండే దుస్తువులు ధరించింది . ఓ చిత్రంలో పాటకు మెగాస్టార్ చిరంజీవి హాలోవీన్ గెటప్ వేశారు కూడా.

హాలోవీన్ అంటే దయ్యాల పండుగ అని అర్ధం ఇది 1846లో ఐర్లాండు పట్టింది. కరువు కారణంగా ఉత్తర అమెరికాకు వలస వెళ్లిన ఔ ప్రజలు ఈ కొత్త సంప్రదాయాన్ని పరిచయం చేశారు. అప్పటి నుంచి ప్రజలు దీనిని జరుపుకుంటున్నారు. ఈ పండగను సాంహైన్ పండుగ అని కూడా పిలుస్తుంటారు. ప్రజలు వేసిన పంటలు ముగింపు కాలం సందర్భంగా ఈ వేడుక ప్రపంచమంతా పాకింది. ఆల్ హలో ఈవెనింగ్ అనే పదం నుంచి ఈ హాలోవిన్ పుట్టిందని అంటారు. ట్రిక్ ఆర్ ట్రీట్ ఆటను పిల్లలు ఆడతారు. హాలోవీన్ పండుగ వస్తే చాలు పిల్లల్లో చెప్పలేని ఆనందం ఉంటుంది.



Tags:    

Similar News