Sushant Singh Rajput's Dil Bechara movie review: చివరి సినిమాతోనూ ఏడిపించిన సుశాంత్ !

Sushant Singh Rajput's Dil Bechara movie review: అతి తక్కువ సమయంలో హీరోగా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు బాలీవుడ్ యువ సంచలనం సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్

Update: 2020-07-25 07:59 GMT
Dil Bechara (File Photo)

Sushant Singh Rajput's Dil Bechara movie review: అతి తక్కువ సమయంలో హీరోగా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు బాలీవుడ్ యువ సంచలనం సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌.. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో సుశాంత్‌ మరణించడం అందరిని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఏది ఏమైనప్పటికీ ఓ యువ నటుడుని చిత్ర పరిశ్రమ కోల్పోవడం నిజంగా బాధాకరం.. ఇక ఇది ఇలా ఉంటే సుశాంత్‌ నటించిన చిత్రం 'దిల్‌ బెచరా' చిత్రాన్ని మేకర్స్ నిన్న ( జూలై24) న ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేశారు మేకర్స్.. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ చివరి చిత్రం కావడంతో అభిమానులకి సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మన రివ్యూలో చూద్దాం!

జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు.. ఎప్పుడు పుడతామో,ఎప్పుడు చనిపోతామో ఎవరికీ తెలియదు. కానీ కొందరి జీవితంలో మాత్రం మరణించే క్షణాలు ముందుగానే తెలుస్తాయి. ఇలాంటి తరహ కథలు భారతీయ చలన చిత్ర రంగంలో చాలానే వచ్చాయి. ఇప్పుడు అదే తరహా కథతో తెరకెక్కింది దిల్‌ బెచరా చిత్రం.. జాన్‌ గ్రీన్‌ 'ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌ అనే నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.

ఇక కథ విషయానికి వచ్చేసరికి కిజి బసు(సంజనా సంఘీ) థైరాయిడ్‌ క్యాన్సర్స్‌తో బాధపడుతూ ఉంటుంది. త్వరలో చనిపోతాను అని తెలుసుకున్న ఆమె చుట్టుపక్కల ఎవరు చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తుంటుంది. వారి బాధను పంచుకుంటుంది. తన బాధను వారితో చెప్పుకుంటుంది. ఈ సమయంలో ఆమెకు ఇమ్మాన్యుయేల్‌ రాజ్‌ కుమార్‌ జూనియర్ అలియాస్‌ మ్యానీ ‌(సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ముందుగా మ్యానీని పెద్దగా పట్టించుకోని బసు అతని అభిరుచులు నచ్చి అతడికి దగ్గరవుతుంది. అలా వారి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో తానూ చనిపోయేలోపు పారిస్‌ నగరాన్ని ఒక్కసారైనా చూడాలని మ్యానీని కోరుతుంది బసు.. అలా కిజి, మ్యానీలు కలిసి ప్యారిస్ కి వెళ్లి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారన్నది మిగిలిన కథ..

ఎలా ఉందంటే ?

తెలిసిన కథ అయినప్పటికీ ఆకట్టుకునే విధంగా తీస్తే సక్సెస్ కావడం అనేది పెద్ద విషయం కాదు.. జాన్‌ గ్రీన్‌ 'ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌ అనే నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు అందులోని అత్మను తీసుకొని యువతకి తగ్గట్టుగా సన్నివేశాలను తెరకెక్కించే ప్రయత్నం చేయలేదు, నవలలో ఉన్న ఉన్నట్లే తెరకెక్కించాడు. సినిమా మొదటి భాగంలో కిజి, మ్యానీలు మధ్య పరిచయం, స్నేహం, పేమ మొదలగు సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. ఇక ఇద్దరి మధ్య ప్రేమ కుదిరాక తన చివరి కోరికలను కిజి, చెప్పడం, అవి నెరవేర్చడానికి మ్యానీ చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా చివర్లో వచ్చే భావోద్వేగమైన సన్నివేశాలు ప్రతి ఒక్కరి చేత కన్నీళ్ళు పెట్టిస్తుంది.

నటీనటులు:

ఈ సినిమాని ప్రతి ఒక్కరూ సుశాంత్‌ కోసమే చూస్తారు. నవలలో ఉన్న పాత్రకి సుశాంత్‌ వందకి వంద శాతం న్యాయం చేశాడు. ఇక సంజనా సంఘీకి ఇదే తొలి చిత్రం అయినప్పటికీ భావోద్వేగమైన సన్నివేశాలలో అద్భుతమైన నటనను కనబరిచింది. ఇక సైఫ్‌ అలీ ఖాన్‌ పోషించిన అతిధి పాత్ర సినిమాకి మరింత బలం చేకూరింది. మిగతా వారు తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :

ఏఆర్‌ రెహమాన్‌ అందించిన పాటలు పర్వాలేదు అనిపిస్తుంది. సేతు అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ హైలెట్ గా చెప్పుకోవచ్చు.

Tags:    

Similar News