Rangamarthanda Review: 'రంగమార్తాండ' రివ్యూ.. కృష్ణవంశీ మేకింగ్ కి ఫిదా అయిన ప్రేక్షకులు

Rangamarthanda Review: ‘రంగమార్తాండ’ రివ్యూ.. కృష్ణవంశీ మేకింగ్ కి ఫిదా అయిన ప్రేక్షకులు

Update: 2023-03-22 07:36 GMT

Rangamarthanda Review: ‘రంగమార్తాండ’ రివ్యూ.. కృష్ణవంశీ మేకింగ్ కి ఫిదా అయిన ప్రేక్షకులు

టైటిల్‌: రంగమార్తాండ

నటీనటులు: ప్రకాశ్‌ రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక, అనసూయ, రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు

నిర్మాత‌లు : కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి

ద‌ర్శక‌త్వం : కృష్ణవంశీ

సంగీతం: ఇళయరాజా

సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె.నల్లి

విడుదల తేది: మార్చి 22, 2023

ప్రకాశ్ రాజ్ తో డైరెక్టర్ కృష్ణ వంశీ చేసిన కొత్త ప్రయోగం రంగమార్తాండ. మరాఠా మూవీ నటసామ్రాట్ తెలుగు రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. నానా పటేకర్ పాత్రలో ప్రకాశ్ రాజ్ సాహసం చేస్తే, ఇప్పుడా మూవీ వెండితెర మీద వెలుగుతోంది. మరి చాలా కాలం తర్వాత కృష్ణ వంశీ మేకింగ్ లో వచ్చిన ఇలాంటి ప్రయోగం మీద ఫైనల్ టాక్ తో ఏం తేలింది?

పెర్ఫామెన్స్ లో పీక్స్ చూపించే గొప్ప నటుడు ప్రకాశ్ రాజ్. ఎమోషన్స్ ని పీక్స్ లోకి తీసుకెళ్లే దర్శకుడు కృష్ణ వంశీ. వీళ్ల కాంబినేషన్ అంటేనే అంతపురం నుంచే సెన్సేషన్.. అలాంటి వీళ్లు కాంబినేషన్ లో వచ్చింది రంగమార్తాండ మూవీ.

రంగమార్తాండ కథ విషయానికొస్తే, ఓ రంగస్థల నటుడిగా రంగమార్తాండ బిరుదుని సొంతం చేసుకున్న ఓ నటుడు, నిజజీవితంతో నటుడిగా ఓడిపోతే ఎలా ఉంటుంది? అసలైన రంగస్థలం అంటే సంసార సాగరమే అనే పాయింట్ తోవచ్చింది రంగమార్తాండ మూవీ.

రంగమార్తాండ బిరుదుతో ఎంతో ఎత్తుకెదిగిన ఓ నటుడు, నిజ జీవితంలో ఎంత అమాయకంగా ఉంటాడు? జీవితం అనే అసలైన ఈ రంగస్థలంలో ఎలాంటి నటుడైనా ఓడాల్సిందే అనేలా సాగే కథలో, పాత్రకు ప్రాణం పోశాడు ప్రకాశ్ రాజ్. తను నటవిశ్వరూపానికి ఇదో ఎగ్జాంపుల్ గా మారింది. ఇక అంతకంటే ఊహాతీతమైన నటవిశ్వరూపాన్ని చూపించాడు మెగా కమెడియన్ బ్రహ్మానందం. నవ్వించే తనను ఒక్కసారిగా మరో కోణం లోచూస్తే ఎవరి కళ్లైన చెమర్చాల్సిందే.

ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ వీళ్ల నట విశ్వరూపాన్ని రంగమార్తాండలో చూడొచ్చు. కృష్ణ వంశీ మళ్లీ తన స్టైలాఫ్ మేకింగ్ లో పీక్స్ చూపించాడనొచ్చు. ఇది అంతటా వినిపిస్తున్న టాక్. ఇళయరాజ తన వారసుడు యువన్ శంకర్ రాజాతో కలిసి ఈ సినిమాకు మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తే సిరివెన్నెల ఆఖరి పాటలు, ప్రతీ మనసుకు తూటాల్లా తాకి గాయం చేస్తాయి.

నటసామ్రాట్ కథని మాత్రమే తీసుకుని, వ్యధని కొత్తగా యాడ్ చేసి కృష్ణ వంశీ చేసిన ప్రయోగం రంగమార్తాండకి హిట్ టాక్ వస్తోంది. చాలా కాలం తర్వాత నవరసాలతో వచ్చిన మూవీ అవటం వల్ల, ఫుల్ మీల్స్ అనేంతగా అన్ని క్రాఫ్ట్స్ నుంచి క్వాలిటీ ఔట్ పుట్ వచ్చిందనే మాటే వినిపిస్తోంది.

Tags:    

Similar News