యదార్థ కథకు.. యాక్షన్ కథనం.. గుణ 369

Update: 2019-08-02 08:44 GMT

సిక్స్ ప్యాక్ హీరో కార్తికేయ.. తొలిసినిమా ఆర్‌ఎక్స్‌ 100తో హిట్ అందుకున్నాడు. తరువాత చేసిన హిప్పీ నిలబడలేకపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ యాక్షన్ సినిమాగా రూపుదిద్దుకున్న గుణ 369 ఈరోజు(ఆగస్టు 2) విడుదలైంది. బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల ఈ సినిమా దర్శకుడు. వాస్తవ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నాట్టు ప్రమోషన్లో చెప్పారు. మరి సినిమా ఎలా ఉందో తెల్సుకున్దామా?

ఇదీ కథ..

ఒక సాధారణ యువకుడు గుణ (కార్తికేయ). తండ్రి కోరిక ప్రకారం బీటెక్ పాసవ్వాలన్నదే అతని లక్ష్యం. కాలనీలో అందరికీ సహాయం చేస్తూ మంచి కుర్రాడిగా పేరు తెచ్చుకుంటాడు. కాలనీకి కొత్తగా వచ్చిన గీత (అనఘ)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమకథ సాగుతుండగా గుణ అనుకోకుండా ఓ చిక్కులో ఇరుక్కుంటాడు. రాధ(ఆదిత్య) అనే రౌడీ షీటర్ హత్యకు గుణ కారణమని అరెస్టు చేస్తారు. అక్కడ నుంచి గుణ జీవితం చిక్కుల్లో పడుతుంది. ఈ సమస్యల నుంచి గుణ ఎలా బయటపడ్డాడు? రాధ ని ఎవరు చంపారు అనేదే మిగిలిన కథ.

ఎవరేలాచేశారు?

కార్తికేయ చక్కగానే చేశాడు. లవర్ బాయ్ గా.. యాక్షన్ హీరోగా మాస్ లుక్స్ లోనూ రెండు షేడ్స్ బ్యాలెన్స్ చేస్తూ నటించాడు. హీరోయిన్ అనఘ లుక్స్ బావున్నాయి. గ్లామరస్ గా వుంది. నటన పరంగానూ తొలిసినిమా అయినా బాగానే చేసింది. ఇక గుణ తండ్రి పాత్రలో నరేష్, మరో కీలక పాత్రలో మహేష్ చక్కగా ఒదిగిపోయారు. రాధ గా ఆదిత్య తా పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

ఇలా వుంది..

బోయపాటి మార్క్ యాక్షన్ బాగా కనిపించింది. యదార్థ సంఘటన నేపధ్యంలో కథను తీసుకుని దానిని బాగానే హ్యాండిల్ చేశాడు. మొదటి భాగంలో కొద్దిపాటి తత్తరపాటు కనపడ్డా రెండో భాగంలో యాక్షన్ సన్నివేశాలు మాసివ్ గా చేశాడు. సమాజంలో అమ్మాయిలకు ఎదురవుతున్న ఇబ్బందులు సహజంగా చూపించే ప్రయతనం ఆకట్టుకుంది. ఇక మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో బోయపాటి మార్క్ స్పష్టంగా కనిపించినా.. చక్కగా కుదిరింది. చైతన భరద్వాజ సంగీతం బావుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. ఫోటోగ్రఫీ బావుంది.

మొత్తమ్మీద యదార్థ కథకు యాక్షన్ అద్దిన మాస్ సినిమాగా నిలబడే అవకాశం ఉన్న సినిమా


Tags:    

Similar News