Bhola Shankar Review: ‘భోళా శంకర్‌’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Bhola Shankar Review: ‘భోళా శంకర్‌’ మూవీ రివ్యూ.. టాక్‌ ఎలా ఉందంటే..?

Update: 2023-08-11 07:19 GMT

Bhola Shankar Review: ‘భోళా శంకర్‌’ మూవీ రివ్యూ.. టాక్‌ ఎలా ఉందంటే..?

చిత్రం: భోళా శంకర్‌.

నటీనటులు: చిరంజీవి, కీర్తి సురేష్‌, తమన్నా, సుశాంత్‌, తరుణ్‌ అరోడా, మురళీ శర్మ, షాయాజీ షిండే, రవి శంకర్‌, వెన్నెల కిషోర్‌, శ్రీముఖి తదితరులు.

సంగీతం: మహతి స్వర సాగర్‌.

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌.

సినిమాటోగ్రఫీ: డడ్లీ.

నిర్మాత: రామబ్రహ్మం సుంకర, కె.ఎస్‌.రామారావు.

రచన: శివ, ఆది నారాయణ.

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్‌ రమేశ్‌.

విడుదల తేదీ: 11-08-2023

Bhola Shankar Review: మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అందరికీ క్రేజే. ఇక ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా ఫస్ట్ రోజు చూడనిదే నిద్రపోరు. సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' గా అలరించిన మెగాస్టార్ ఫాన్స్ కు పూనకాలు తెపించాడు. ఇక చిరంజీవి నటించిన లేటేస్టు మూవీ ‘భోళా శంకర్’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ గురించి తమ అభిప్రాయాలను చాలా మంది ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. మరి సినిమా ఫాన్స్ ను, ప్రేక్షకులను అలరించిందో లేదో చూద్దాం.

స్టోరీ

మహాలక్ష్మి (కీర్తీ సురేష్) పెయింటర్. కలకత్తాలో మంచి ఆర్ట్స్ కాలేజ్ ఉందని, ఆమెను అందులో చేర్పించడానికి అన్నయ్య శంకర్ (చిరంజీవి) కలకత్తా షిఫ్ట్ అవుతాడు. క్యాబ్ డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరి జీవిస్తుంటాడు. అప్పటికి కలకత్తాలో వరుసగా అమ్మాయిల కిడ్నాప్ అవుతూ ఉంటారు. అనుమానితుల ఫోటోలను ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చిన పోలీసులు... వాళ్లలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వమని చెబుతారు. శంకర్ ఇచ్చిన సమాచారంతో కొంత మంది అమ్మాయిలను పోలీసులు రక్షిస్తారు. విమెన్ ట్రాఫికింగ్ చేసే అలెక్స్ (తరుణ్ అరోరా) మనుషులకు శంకర్ సమాచారం ఇచ్చాడని తెలుస్తుంది. దాంతో శంకర్ చెల్లెలిని టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? హైదరాబాద్ సిటీలో భోళా భాయ్ అని అందరూ పిలిచే వ్యక్తి, కలకత్తాలో శంకర్ అవతారం ఎందుకు ఎత్తారు? అనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

తమిళంలో తెరకెక్కిన వేదాళం చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కించారు. కానీ తెలుగు నేటివిటీకి అక్కడక్కడ కొంచం మార్పులు చేసి ఫాన్స్ కు తెలుగు ప్రేక్షకులకు నచ్చే విదంగా తెరకెక్కించడంలో దర్శకుడు కొంతమేరకు సక్సెస్ అందుకున్నాడు. దర్శకుడిగా మెహర్ రమేష్ స్టైలిష్ యాక్షన్ వరకూ పర్లేదు కానీ.. కామెడీ కానీ, ఎమోషన్ కానీ సరిగా హ్యాండిల్ చేయలేడు అనే విషయం మరోసారి స్పష్టమైంది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ సీన్స్ కి ఎంతో స్కోప్ ఉన్న కథను అటు ఎలివేషన్ కి వాడుకోలేక, ఇటు ఎమోషనల్ గా అలరించలేక చాలా ఇబ్బందిపడి.. ఆడియన్స్ ను కూడా అక్కడక్కడ ఇబ్బందిపెట్టాడు.

ఎవరెలా చేశారంటే?

కామెడీ, డ్యాన్స్, యాక్షన్, రొమాన్స్, యాక్టింగ్.. చిరు ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అని చెప్పచ్చు. ఇందులోకూడా తన నటనతో చిరు చెలరేగిపోయాడు.. ఇక చెల్లి పాత్రకు కీర్తి సురేష్ ప్రాణం పోశారు. సుశాంత్ కూడా బాగానే నటించాడు. తమన్నా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక ఇతర నటీనటులు వారి వారి పరిధిమేర నటించి పాత్రలకు న్యాయం చేసారు.

నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో దర్శకుడు చాలా స్లోగా కథను నడిపాడు. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ అందించిన సంగీతం పర్వాలేదు. సెకెండ్ హాఫ్ లో పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా.. కొన్ని చోట్ల మెలో డ్రామాలా అనిపిస్తోంది. మాస్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మాత్రం తప్పక నచ్చుతుంది.

Tags:    

Similar News