స్క్రిప్టు దశలోనే అప్పట్లో సెన్సారింగ్!

పాత మల్లీశ్వరి సినిమా తెలియని వాళ్ళు చాల తక్కువ మందే వుంటారు, అయితే ఆ సినిమా దర్శకులు ఎవరో మీకు తెలుసా!

Update: 2019-01-23 12:25 GMT

పాత మల్లీశ్వరి సినిమా తెలియని వాళ్ళు చాల తక్కువ మందే వుంటారు, అయితే ఆ సినిమా దర్శకులు ఎవరో మీకు తెలుసా! ఆ సినిమా దర్శకులు శ్రీ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి) ప్రముఖ సినీ దర్శక నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. ఆయన సృష్టించిన మల్లీశ్వరి బహుళ ప్రజాదరణ పొందిన చిత్రం. బి.ఎన్.రెడ్డి తెలుగు సినిమాదర్శకుడు మరియు నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. ఆయనలోని మరో ప్రత్యేకత తన సినిమాలకు స్క్రిప్టు దశలో నే ఆయన చేసే సెన్సారింగ్. ఆయన తీసిన చివరి సినిమా బంగారుపంజరం (1969) స్క్రిప్ట్ లో హీరో తలుపు తట్టుతూ, అది తెరుచుకోవడం ఆలస్యమైతే "ఏం చేస్తున్నావ్?" అని అడిగే దృశ్యముంది. అప్పుడు అవతల్నించి హీరోయిన్ గొంతు "బట్టలు మార్చుకుంటున్నాను" అని వినిపించాలి. అయితే ఆ మాటలు విన్న ప్రేక్షకులు ఏం ఊహించుకుంటారోనని ఆ దృశ్యాన్ని తొలగించారాయన. అదీ, విలువల పట్ల ఆయనకున్న నిబద్ధత! ఇప్పుడు మాత్రం సెన్సారు వారితో గొడవపడే దర్శకులే ఎక్కువయ్యారు. శ్రీ.కో.  

Similar News