విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మలగా!

మహిళలలు అన్ని రంగాలలో విజయాలు సాధిస్తున్నారు, అయితే సినిమా ఫీల్డ్లో ఎన్నో తనదంటూ ఒక మార్క్ సృష్టించుకున్న నటి విజయనిర్మల

Update: 2019-01-03 10:36 GMT

మహిళలలు అన్ని రంగాలలో విజయాలు సాధిస్తున్నారు, అయితే సినిమా ఫీల్డ్లో ఎన్నో తనదంటూ ఒక మార్క్ సృష్టించుకున్న నటి విజయనిర్మల గారు, దర్శకురాలు మరియు ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ గారి భార్య. ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము. మరో ప్రముఖ సినిమా నటి జయసుధకు ఈమె పిన్నమ్మ. 2002 లో ప్రపంచములోనే అతిఎక్కువ సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ ప్రపంచ రికార్డులు లోకెక్కినది. నటి అయిన ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించింది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు కృష్ణ కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు.విజయనిర్మల పుట్టిల్లు నరసరావుపేట.రఘుపతి వెంకయ్య పురస్కారానికి ఎంపికయ్యారు. విజయనిర్మల తల్లి శకుంతల .అన్నలు వసంతరావు, సంజీవరావు పాతూరులో వీరి కుటుంబాలన్నీ ఉండేవి. విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది.తదనంతర కాలంలో విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి మద్రాస్‌ వెళ్లిపోయారు. పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి కథానాయకిగా ఉన్నతస్థానానికి చేరారు. తరువాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిసుబుక్‌లో ఎక్కారు.శ్రీ.కో.

Similar News