ఏ దివిలో విరిసిన పారిజాతమో...ఈ నాటికీ

Update: 2019-02-26 09:48 GMT

ఒక పాట ఒక తరాన్ని మొత్తం పాడుకునే విధంగా చేయగలదా అంటే...అవును అని చెప్పేవిధంగా ఏ దివిలో విరిసిన పారిజాతమో అనే పాట నిలుస్తుంది.

ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఏ కవిలో మెదిలిన ప్రేమ గీతమో

నా మదిలో నీవై నిలచిపోయేనే ( ఏ దివిలో )

నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్య తారలై

నా కన్నుల వెన్నెల కాచి నిలిచేనే .....

పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే

నీలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే

కాలి అందియలు ఘల్లు ఘల్లుమన రాజహంమ్స లా రావే ....( ఏ దివి)

నిదుర మబ్బులను మెరుపు తీగవై కళలు రేపినది నీవే

బ్రతుకు వీణ పై ప్రణయ రాగములు ఆలపించినది నీవే

పదము పదము పై మధువు పారుతూ కావ్య కన్యలా రావే.....( ఏ దివి)శ్రీ.కో

Similar News