Ramatheertham Incident Live updates: రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తతలు!

Ramatheertham Incident Live updates: విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముని విగ్రహం ద్వంసం ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈరోజు (05-0102021) ఉదయం నుంచి రామతీర్థంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆ వివరాలు లైవ్ అప్డేట్స్ గా ఎప్పటికప్పుడు మీకోసం..

Update: 2021-01-05 07:39 GMT

Ramatheertham Incident (file images)

Ramatheertham Incident Live updates: ఆంధ్రప్రదేశ్ విజయనగరం జెల్లా రామతీర్థంలో రాముని విగ్రహాన్ని ద్వంసం చేసిన అంశం ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. ఈరోజు (05-01-2021) భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రామతీర్థం ఘటనపై చేపట్టిన ఆందోళన నేపధ్యంలో రామతీర్థంలో తీవ్రమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. 

రామతీర్థంలో నెలకొన్న పరిస్థితుల పై లైవ్ అప్ డేట్స్ 

Live Updates
2021-01-05 08:19 GMT

ఏపీలో హిందువులకు గడ్డుకాలం నడుస్తోందని అన్నారు రాష్ట్ర సాధు పరిషత్‌ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. పవిత్రమైన రామతీర్థం ప్రాంతాన్ని.. రాజకీయ తీర్థంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులపై సీఎం జగన్ వెంటనే స్పందించి.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

2021-01-05 07:49 GMT

రామతీర్థంలో హై టెన్షన్‌ కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును అరెస్ట్ చేశారు పోలీసులు. వన్‌టౌన్‌ పీఎస్‌కు సోము వీర్రాజు తరలించారు. అలాగే.. ఎమ్మెల్సీ మాధవ్‌, బీజేవైఎం అధ్యక్షులు సురేంద్రను కూడా అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మరోవైపు ధర్మయాత్రలో పాల్గొనేందుకు బీజేపీ, జనసేన కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. 

2021-01-05 07:44 GMT

రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రామతీర్థంలోని శ్రీరాముడి ఆలయాన్ని సందర్శించేందుకు బయల్దేరిన బీజేపీ, జనసేన నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. ర్యాలీలకు అనుమతిలేదంటూ పలువురిని అరెస్ట్ చేశారు. దీంతో రామతీర్థం కాస్తా.. రణరంగంలా మారిపోయింది.

2021-01-05 07:41 GMT

విజయనగరం రామతీర్థం సంఘటనను పరిశీలించడానికి వెళ్లకుండా బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. రామతీర్థం వెళ్తున్న ఎంపీ సీఎం రమేష్‌ను పోలీసులు విశాఖ బీజేపీ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. జరిగిన సంఘటనను పరిశీలించటానికి వెళ్తున్న తమని అడ్డుకోవడం సమంజసం కాదని సీఎం రమేష్ అన్నారు.

Tags:    

Similar News