Live Blog: ఈరోజు (మే-27-బుధవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-05-27 00:41 GMT
Live Updates - Page 2
2020-05-27 02:22 GMT

స్కూల్స్ తెరవడానికి కేంద్రం అనుమతించలేదు

- దేశంలో పాఠశాలలు, కళాశా లలు, ఇతర విద్యాసంస్థలు తెరిచేందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదని కేంద్ర హోం శాఖ తెలిపింది.

- వీటిని ఎప్పటి నుంచి తెర వాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేసింది.

- పా ఠశాలలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారంటూ వదం తులు వస్తున్న నేపథ్యంలో హోం శాఖ అధి కార ప్రతినిధి మంగళవారం రాత్రి ఆ మేరకు ట్విట్టర్‌లో వెల్లడించా రు.


2020-05-27 02:19 GMT

రేవంత్ రెడ్డి నిర్మల్ పర్యటన రద్దు

నిర్మల్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి నిర్మల్ పర్యటన రద్దు.

* లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదంటూ హైదరాబాద్ లో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.

* మే 31 వరకు నిర్మల్ జిల్లాలో లాక్ డౌన్ అమల్లో ఉన్నందున ఇతర ప్రాంత నాయకులు రావద్దంటూ నోటీసులు జారీ చేసిన పోలీసులు.

* మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకున్న కాంగ్రెస్ నాయకులు.



 



2020-05-27 02:15 GMT

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తేటగుంట ఆర్.టి.ఏ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం.

- బొలెరో వాహనాన్ని డీ కొన్న బైక్

- ఒకరు మృతి

- ఇద్దరికి తీవ్ర గాయాలు

- క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలింపు

2020-05-27 01:53 GMT

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం రాఘవ రాజపురం వద్ద ప్రమాదం .

- సైకిల్ ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం.

- వ్యక్తి మృతి

- కడప జిల్లా రాజుపాలెం మండలంకు చెందిన వల్లి గా గుర్తింపు.

2020-05-27 01:15 GMT

ఇండియా పై జపాన్ ట్రావెల్ బ్యాన్

- భారత్ లో కరోనా ఉధృతి పెరిగిపోతుండడంతో అంతర్జాతీయంగా సమస్యలు మోఅలయ్యాయి.

- జపాన్ భారత దేశంపై ట్రావెల్ బ్యాన్ విధించింది.

- ఇండియా తో పాటు మరో పది దేశాలపైనా ఈ బ్యాన్ విధించింది.

- ఈ బ్యాన్ తో ఆయాదేశాల నుంచి ఎవరినీ తమ దేశంలోకి అడుగు పెట్టనీయకుండా చర్యలు తీసుకుంటోంది జపాన్ 

- ఇప్పటికే జపాన్ 101 దేశాలపై నిషేధాన్ని విధించింది. తాజా నిష్దాలతో కలిపి మొత్తం 111 దేశాల వారిపై ఈ ట్రావెల్ బ్యాన్ విధించినట్టు అయింది.





Tags:    

Similar News