Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-06-25 00:52 GMT

ఈరోజు గురువారం, 25 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, చవితి (ఉ.08:47 వరకు), ఆశ్లేష నక్షత్రం (మ.12:20వరకు) సూర్యోదయం 5:43am,సూర్యాస్తమయం 6:53 pm

ఈరోజు తాజా వార్తలు


Live Updates
2020-06-25 16:18 GMT

- తెలంగాణ లో ఎంసెట్ గతంలో ప్రకటించిన తేదీ ల్లోనే జరుగుతాయని ప్రకటించిన కన్వీనర్

- జులై 6 నుంచి 9 వరకు జరగనున్న టీఎస్ ఎంసెట్

- ఎగ్జామ్ సెంటర్ లు మార్చుకోవాలనే విద్యార్థులు రేపటి లోగా ఆన్లైన్ లో మార్చుకోవాలని ప్రకటన

2020-06-25 16:17 GMT



- మంత్రి పువ్వాడ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ బాలసాని

- తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ శుక్రవారం భద్రాచలం నియోజకవర్గ0 లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ బాలసాని మంత్రి పర్యటన ఏర్పాట్లను దెగ్గరవుండి పరిశీలించారు.

2020-06-25 16:03 GMT

 @అసోం


- ఈశాన్య రాష్ట్రం అసోంలో వ‌రుణుడు బీభ‌త్సం సృష్టిస్తున్నాడు.

- గ‌త 24 గంట‌లుగా ఎడ‌తెర‌పిలేని వాన‌లు కురుస్తుండ‌టంతో రాష్ట్రంలో వ‌ర‌ద‌లు పోటెత్తాయి.

- ముఖ్యంగా టిన్‌సుకియాలోని డ‌మ్‌డ‌మ్ ఏరియాను భారీ వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప‌లుచోట్ల రోడ్ల‌పై భారీగా వ‌ర‌ద‌నీరు నిలిచింది.

- టిన్‌సుకియాలోని వాగులు, వంక‌లు ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి.

- దీంతో ఆయా ప‌రిస‌రాల్లోని గ్రామాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకున్నాయి.

- వీధుల్లో న‌డుములోతు నీరు నిలువ‌డంతో ఇండ్లు నీట మునిగాయి.    

2020-06-25 14:58 GMT

>> అమరావతి

- వైద్య, ఆరోగ్యశాఖ రీట్వీట్

- కరోనా టెస్ట్ ల విషయంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

- RT PCR టెస్ట్ లో' కచ్చితత్వం శాతం 67 శాతం మాత్రమే.

- అంటే సంబంధిత వ్యక్తిలో 33 శాతం వైరస్ ఉనికి ఉన్నప్పటికీ టెస్ట్ ఫలితాలు నెగటివ్ అనే చూపుతాయి

- ఆ వ్యక్తిలో కోవిడ్ వైరస్ 100 శాతం కచ్చితంగా వుంటే ఫలితాలు పాజిటివ్ అని నిర్ధారిస్తాయి.

- అంటే ఆ వ్యక్తిలో కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా వుందని అర్థం.

- పేషెంట్ రికవరి దశలో వున్నప్పుడు (అంటే వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన కొద్ది రోజుల తరువాత) టెస్ట్ ఫలితాలు నెగటివ్ అని చూపుతాయి.

[- దీపక్ రెడ్డి విషయంలో తొలి టెస్ట్ ఫలితాలు పాజిటివ్ అని చూపాయంటే, ఆయన నూరుశాతం వైరల్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారని అర్ధం.

- రెండో టెస్ట్ నెగటివ్ అని చూపిందంటే అందుకు రెండు కారణాలుంటాయి

- ఆయనలో వైరల్ ఇన్ఫెక్షన్ స్థాయి 33 శాతం మాత్రమే వుండటం లేదా ఆయన రికవరీ దశలో వుండటం

- ఈ దశలో కరోనా టెస్ట్ ఫలితాలు నెగటివ్ అన్న ఫలితాలనే చూపుతాయి

- సాంకేతికపరమైన ఈ అంశాలపై స్పందించటానికి ముందు సంబంధిత వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎపి వైద్య ఆరోగ్య శాఖ కోరుతోంది

- ఆయా వ్యక్తులు బాధ్యతా రహితంగా చేసే ఇటువంటి వ్యాఖ్యలు ల్యాబ్స్ లో పనిచేస్తున్న సంబంధిత సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి

- ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజల దృష్టిలో అనుమానాలు రేకెత్తించటం ఎవరికీ మంచిది కాదనే విషయాన్ని వారు గ్రహించాల్సిన అవసరం ఉంది

@ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

2020-06-25 14:56 GMT

@ అమరావతి


>> కన్నా లక్ష్మీనారాయణ .రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ

- రేపు ఆంధ్రప్రదేశ్ భాజపా ఆధ్వర్యంలో కోస్తాంధ్ర పార్లమెంట్ జిల్లాల మూడవ వర్చువల్ ర్యాలీ.

- ముఖ్య అతిధి మరియు వక్తగా కేంద్ర ఆర్ధికమంత్రి, శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు

- విజయవాడలో వెన్యూ కన్వెన్షన్ హాల్ వేదికగా రేపు సాయంత్రం 4 గంటలకు

2020-06-25 14:53 GMT

@ పశ్చిమ గోదావరి

- అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడమే దుర్మార్గమైతే ..

- చికిత్స దశలో అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు మరింత దుర్మార్గం.

- టిడిపి నాయకులను ఇప్పటివరకు కేసులతో వేధించారు

- అరెస్టులతో బెదిరించారు, ఇప్పుడు ఏకంగా హతమార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.

- అచ్చెన్నాయుడుకు ప్రాణహాని తలపెడితే ప్రభుత్వం తలకిందులు అవుతుంది..

- YCP కి పుట్టగతులు ఉండవు...

- సర్జరీ చేయించుకొన్న వ్యక్తిపై మానవత్వం చూపలేదు..

- అమానుషంగా ప్రవర్తించడం ప్రభుత్వ ఫ్యాక్షన్ స్వభావాన్ని చూపిస్తుంది.

- పాలకొల్లు టిది ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు 

2020-06-25 14:49 GMT

@ అమరావతి

- ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి...

- మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లు, టిడ్కో అదికారులతో వీడియో కాన్ఫరెన్సు

- జూలై 8 వ తేదీన పంపిణీ చేయదలచిన ఇళ్లు, ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని విధాలుగా సన్నద్దం కావాలని పురపాలక శాఖ  మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.

- ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలన్నారు.

- ఇళ్ల పట్టణాలు, ఇళ్లు కేటాయింపు ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని మున్సిపల్ కమిషనర్లు, పట్టణ టిడ్కో అధికారులకు ఆయన స్పష్టం చేశారు.

2020-06-25 14:48 GMT

- ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ లో అయిదుగురు వైద్యులకు కరోనా పాజిటివ్....

- గత కొద్ది రోజులుగా ఎర్రగడ్డ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కరోన టెస్టులకు క్యాంప్ గా ఏర్పాటు...

2020-06-25 14:48 GMT



@ రేవంత్ రెడ్డి ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

- వీకే సింగ్ వీఆర్ఎస్ ప్రాధాన్యత కలిగిన అంశం

- ఈ ప్రభుత్వంలో కొనసాగలేనని ఆయన కేంద్రానికి లేఖ రాశారు.

- పోలీసు వ్యవస్థలో ప్రైవేటు సైన్యంగా పని చేసేవారికి, సొంత సామాజికవర్గం వారికి మాత్రమే పెద్దపీట వేస్తారా?

- ఫోన్ ట్యాపింగ్ లు, ప్రత్యర్థులను వేధించేవారికి మాత్రమే పోస్టింగులా!

- ప్రభాకర్ రావు (ఐజీ-ఎస్ఐబి), వెంకటేశ్వరరావు (డిఐజీ), రాధాకిషన్ రావు (డీఎస్పీ-టాస్క్ ఫోర్స్) ఈ ముగ్గురూ నెలాఖరుకు రిటైరవుతున్నారు.

- ఈ ముగ్గురినీ తిరిగి కొనసాగించడానికి ఫైల్ సిద్ధం చేశారు.

- వీకే సింగ్ ప్రమోషన్ పై సీఎస్ కు లేఖ రాస్తే ఉలుకుపలుకు లేదు.

- హైదరాబాద్ పరిధిలోని కమిషనరేట్లలో పూర్తిగా కేసీఆర్ ప్రైవేటు సైన్యం పని చేస్తోంది

- డీజీపీ ఉత్సవ విగ్రహం గా మాత్రమే ఉన్నారు.

- 15 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ అయినా సొంత సామాజికవర్గం వాళ్లను తీసుకువచ్చి కేసీఆర్ కీలక పోస్టుల్లో పెట్టాడు.

- పోలీసు శాఖలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజికవర్గాలకు చెందిన సమర్థవంతమైన అధికారులు లేరా?

- కేసీఆర్ సామాజికవర్గం వారికి పెద్దపీఠ వేసి... మిగతా వారికి అన్యాయం చేస్తారా?

- రిటైరవుతోన్న ముగ్గురు అధికారులకు కొనసాగింపు ఇస్తే కోర్టులో కేసు వేస్తాను

2020-06-25 14:44 GMT



@ బండి సంజయ్,తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

- ఎమెర్జెన్సీ పోరాట యోధుల

- స్ఫూర్తితో ప్రజాస్వామిక తెలంగాణకై పోరాడుదాం

- కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే భారతీయ జనతా పార్టీ ఎజెండా

- ఎమెర్జెన్సీ పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజాస్వామిక తెలంగాణకై పోరాడుదాం

- కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం చేయడమే భారతీయ జనతా పార్టీ ఎజెండా

- నాడు ఇందిరాగాంధీ ఎమెర్జెన్సీ అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట యోధుల స్ఫూర్తిగా నేడు నయా నిజాం తెలంగాణ ముఖ్యమంత్రి     కె.చంద్రశేఖర్ రావుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది

Tags:    

Similar News