Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-19 01:07 GMT
Live Updates - Page 2
2020-06-19 10:27 GMT

నూజివీడు మండలం లీలానగర్ వద్ద జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అర్ధరాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకుని 335 మధ్యం సీసాలు స్వాధీనం చేసుకున్న రూరల్ పోలీసులు.

ఆటో కి పైలెట్ గా ముందు వెళ్తున్న బైక్ ని,ఆటోని సీజ్ చేసి నలుగురిని కోర్టులో హాజరు పరచనున్నట్లు డిఎస్పి బి.శ్రీనివాసులు తెలిపారు.

2020-06-19 10:25 GMT

డిప్యూటీ కలెక్టర్ గా కిడాంబి శ్రీకాంత్

డిప్యూటీ కలెక్టర్ గా షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు

కిడాంబి శ్రీకాంత్ ను ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీలో డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

డిప్యూటీ కలెక్టర్ గా కిడాంబి శ్రీకాంత్ శిక్షణ పూర్తి చేసుకోవటంతో ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు

వచ్చే ఒలంపిక్స్ క్రీడలకు శిక్షణ పొందేందుకు గానూ ఆయనకు ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సాధారరణ పరిపాలనశాఖ



 


2020-06-19 10:23 GMT

కృష్ణా జిల్లా అవనిగడ్డ

నియోజకవర్గ పరిధిలో కోడూరు మండలం నక్క వాని దారి గ్రామంలో మట్ట వీరమ్మ (65) వృద్ధురాలు అనుమానాస్పద మృతి...

రత్న కోడు దగ్గరపొలాల మధ్య ఉన్న పొదలో వృద్ధురాలి ఆచూకీ.. గత నాలుగు రోజులు క్రితమే చనిపోయినట్లు భావిస్తున్న పోలీసులు....

సంఘటనా స్థలానికి చేరిన సర్కిల్ ఇన్స్పెక్టర్ B. భీమేశ్వర రవికుమార్ స్థానిక ఎస్ఐ P. రమేష్...

పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది....

2020-06-19 08:18 GMT

- కృష్ణాజిల్లా గన్నవరం మండలం గూడవల్లి లో చెలరేగిపోయిన బ్లేడ్ బ్యాచ్.

- గంజాయి తాగిన మత్తులో తిరుపతి కి చెందిన వ్యక్తి పై కత్తితో దాడి.

- గాయపడిన వ్యక్తి కొత్తపల్లి గోవిందరాజులు( 46 )సం లు s/o ఆర్ముగం( sc మాల ) గాంధీపురం తిరుపతి. కి చెందిన వ్యక్తి గా గుర్తింపు.

- నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు.

2020-06-19 07:24 GMT

» కృష్ణాజిల్లా



- గన్నవరం మండలం సూరంపల్లి లో విషాదం..

- కరెంట్ షాక్ తో ఎలక్ట్రిషన్ మృతి..

- ట్రాన్స్ఫార్మర్ పై పనిచేస్తూ తీగలు తగిలి దేవరపల్లి కిషోర్(36) ప్రైవేటు ఎలక్ట్రిషన్ మృతి..

- దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

2020-06-19 07:20 GMT

» అమరావతి:

- ఈఎస్ఐ స్కాంలో కొత్త ట్విస్ట్

- పెరుగుతున్న సచివాలయ ఉద్యోగుల సంఖ్య..

- 8 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ

- పరారీలో సచివాలయ ఉద్యోగులు

- మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయిన సచివాలయ ఉద్యోగులు

- కాల్ డేటా, సిగ్నలింగ్ ద్వారా ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో ఆరా తీస్తున్న ఏసీబీ.

2020-06-19 06:03 GMT



- రాజ్యసభ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి వైైఎస్ జగన్

2020-06-19 06:00 GMT



» రాజ్యసభ ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం మాదే.... అర్ధరాత్రి దాకా వ్యూహాలు పన్నిన ముఖ్య నేతలు.... జిల్లా ఎమ్మెల్యేల ఓటును ఏ అభ్యర్థి కి వేయాలి.. ..ఎలా వినియోగించాలి .. అన్న అంశంపై వివరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి.... .. ఈరోజు ఎన్నికల్లో స్వయంగా పార్టీ ప్రతినిధిగా కౌంటింగ్ హాల్లో కూర్చున్నా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయ్ సాయి రెడ్డి

2020-06-19 05:58 GMT

» కృష్ణా: ఆర్జియుకేటికి యూజీసీ గుర్తింపు...

👉రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వ విధ్యాలయంకు యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ నుండి 12బి గుర్తింపు పొందినట్టుగా తెలిపిన ఛాన్సలర్ ఆచార్య కేసి.రెడ్డి.

👉2008లో స్థాపించిన ట్రిపుల్ ఐటిలకు 12ఏళ్ళ తరువాత యూజీసీ గుర్తింపు.

👉యూజీసీ గుర్తింపు ద్వారా ట్రిపుల్ ఐటిలకు చేకూరనున్న ఆర్ధిక సహకారం.

👉గ్రామీణ ప్రాంత పేద విధ్యార్ధులకు నాణ్యమైన విధ్య తో పాటుగా అందనున్న మరిన్ని సదుపాయాలు.

2020-06-19 05:07 GMT

»తూర్పు గోదావరి జిల్లా.....

- మలికిపురం (మం) శంకరగుప్తములో కోడిపందాల స్థావరం పై పోలీసులు దాడి

- 7 గురిని అదుపులోనికి తీసుకుని 21,500 నగదు, రెండు కోళ్లు స్వాధీనం.

Tags:    

Similar News