Live Updates:ఈరోజు (జూన్-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-03 00:46 GMT
Live Updates - Page 3
2020-06-03 04:35 GMT

ఎక్సైజ్ అధికారులపై గ్రామస్తుల దాడి...

◆ఎక్సైజ్ అధికారులపై గ్రామస్తులు దాడి చేసిన సంఘటన మాచర్ల మండలం హస్నాబాద్ తండాలో మంగళవారం చోటుచేసుకుంది.

◆విజయపురి సౌత్ ఎస్ ఐ పాల్ రవీందర్ కథనం ప్రకారం హస్నాబాద్ తండాలో నాటుసారా అక్రమంగా తయారు చేస్తున్న బట్టి లపై దాడి చేసి 20 లీటర్ ల నాటుసారా స్వాధీన పరచుకున్నారు.

◆ దీంతో స్థానికులు అధికారులపై దాడులు చేశారు 

2020-06-03 04:33 GMT

నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం సి.గుడిపాడు డొంక రోడ్ లో అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ రాష్ట్రం 480 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని,రెండు బైకులు సీజ్ చేసి, ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేసిన ఎస్ఐ శివ నారాయణ

2020-06-03 04:32 GMT

- నిసర్గ తుపాను విరుచుకు పడనున్న వేళ ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

- ఇప్పటికే తాల్, ఆలీబాగ్, రాయగర్ ప్రాంతాలలో ఉన్న 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు నేషనల్ దిసాస్తర్ రెస్పాన్స్ ఫోర్స్ తెలిపింది. 




 



2020-06-03 04:29 GMT

- నిసర్గ తుపాను వేగంగా తీరం వైపు కదులుతోంది.

- మహారాష్ట్ర పై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది.

- ఇప్పటికే అక్కడ తీరప్రాంతాలలో ఈదురుగాలుల బీభత్సం మొదలైంది.




2020-06-03 04:24 GMT

- కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో కరోనా కలకలం.

- పెనమలూరు నియోజకవర్గంలో కరోనాతో మృతి చెందిన వృద్ధుడు పమిడిముక్కల మండల పరిధిలోని మూడు గ్రామాల్లో పర్యటన.

- గోపువానిపాలెం, హనుమంతపురం, అగినపర్రు గ్రామాల్లో బంధువులను కలిసిన మృతుడు.

- అప్రమత్తమైన అధికారులు. బంధువుల వివరాలు సేకరణ.

- గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్న అధికారులు.

2020-06-03 02:29 GMT

నేటి నుంచి ఉత్తరాంధ్ర ఏజెన్సీలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని పర్యటన..

- ఇవాళ పాడేరు, అనకాపల్లిలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని..

- ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు స్థలం పరిశీలించనున్న ఆళ్లనాని..

-  ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలపై..

- వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించనున్న ఆళ్లనాని..



2020-06-03 02:26 GMT

- ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం..

- ప్రధాని నివాసంలో భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం..

- దేశంలో పెరిగిపోతున్న కరోనా వైరస్ వ్యాప్తి, ఆర్థిక పరిస్థితి పై చర్చించే అవకాశం 

2020-06-03 02:25 GMT

-  ప్రపంచవ్యాప్తంగా 64.73 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు..

-  ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 3.81 లక్షల మంది మృతి..

-  ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 29.86 లక్షల మంది..

2020-06-03 01:23 GMT

హైదరాబాద్ ను ఆవరించిన క్యుములోనింబస్ మేఘాలు

- మరి రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం 

- క్యుములోనింబస్ మేఘాలకు నైరుతీ రుతుపవనాలు జతకలిసే అవకాశాలు 

- దీంతో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం 

- అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ్ ప్రభావమూ తెలంగాణా మీద ఉండే అవకాశం 

- తుఫాను తీరం దాటిన తరువాత తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

-  వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు 



 



2020-06-03 01:16 GMT

భారత్ లో కరోనా ఉధృతి!

- రెండులక్షలు దాటినా కరోనా బాధితులు 

- మంగళవారం ఒక్కరోజే 200 మంది మృతి 

- మొత్తం మృతుల సంఖ్య 5,600 

- ప్రపంచంలో కేసుల సంఖ్యలో 7 వ స్థానంలో భారత్ 

Tags:    

Similar News