Live Updates:ఈరోజు (జూలై-31) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-07-31 01:55 GMT
Live Updates - Page 3
2020-07-31 03:18 GMT

సాగర్ కు కొనసాగుతున్న వరద

నల్గొండ :

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.

ప్రస్తుత నీటిమట్టం : 546.60 అడుగులు.

ఇన్ ఫ్లో : 40,259 క్యూసెక్కులు.

అవుట్ ఫ్లో : 1650 క్యూసెక్కులు.

పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు.

ప్రస్తుత నీటి నిల్వ : 201.4858 టీఎంసీలు.

2020-07-31 03:12 GMT

రోడ్డిప్రమాదంలో ఒకరి మృతి

నిజామాబాద్

ఇందల్వాయి మండలం మాక్లూర్ తాండ వద్ద తెల్లవారు జూమున రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారిపై టాటాఏస్ వాహనాన్ని ఢీకొన్న లారీ

ప్రమాదంలో టాటాఏస్ వాహనం డ్రైవర్ మృతి

ఆటోలో ఉన్న 14 మందికి గాయాలు...జిల్లా ఆస్పత్రికి తరలింపు

వ్యవసాయ పనుల కోసం నల్గొండ నుంచి వచ్చిన కూలీలు తిరిగి వెళ్తుండగా ప్రమాదం

2020-07-31 03:10 GMT

పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం వేడుకలు

తిరుపతి

నేడు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం వేడుకలు

మొదటి సారిగా ఆన్ లైన్ వర్చువల్ విధానంలో భక్తులు పూజలో పాల్గొని వీక్షించే అవకాశం కల్పించిన టిటిడి

ఆన్ లైన్ సేవకు విశేష స్పందన

2020-07-31 03:09 GMT

నూతన విద్యా విధానంపై పవన్ కల్యాణ్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు సమస్యలపై స్పందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే 2019లో ప్రస్తుతం విద్యార్థులకు నూతన విద్యా విధానం అవసరమని, వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇస్తే వారు జీవితంలో జీవనోపాధి పెంచుకునే విధంగా తోడ్పాటునందిస్తుందని పేర్కొన్నారు. ఇదే వీడియోను కేంద్ర మంత్రి తిరిగి ట్టిట్టర్ లో పోస్టుచేసి, పవన్ ఆలోచనల మేరకు నూతన విద్యా విధానం రూపుదిద్దుకుందని చెప్పుకొచ్చారు.

- పూర్తి వివరాలు 

2020-07-31 03:09 GMT

శానిటైజర్ తాగిన ఘటనలో పెరిగిన మృతులు

ఏడుకు చేరుకున్న మృతుల సంఖ్య.

శానిటైజర్ సేవించిన మెత్తం ఏడు మంది బిక్షాటకులు.

రాత్రి ఇద్దరు మృతి.

చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి.

2020-07-31 02:07 GMT

శంషాబాద్ విమానాశ్రయంలో గంధపు చెక్కలు ‌ కలకలం

- అక్రమంగా తరలిస్తున్న 114 కిలోల గంధపు చెక్కలు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు...

- శంషాబాద్ నుంచి మస్కట్, మస్కట్ టూ ఖర్టూమ్ కు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నం...

- అరెస్ట్ అయిన వ్యక్తి సూడాన్ కు చెందినవాడిగా గుర్తింపు...

- విచారిస్తున్న ఎయిర్ పోర్టు పోలీసులు...

2020-07-31 02:07 GMT

శ్రీశైల మహాక్షేత్రంలో వరలక్ష్మీ వ్రతాలు

కర్నూలు జిల్లా

- శ్రీశైల మహా క్షేత్రంలో ఉదయం 9 గంటలకు వరలక్ష్మి వ్రతలా నిర్వహణ

- కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే అన్ లైన్ సేవగా వరలక్ష్మీ వ్రతాలు

- ఇప్పటికే 200 టికెట్లు దాటినా ఆన్లైన్ వరలక్ష్మి వ్రతాల రిజిస్ట్రేషన్

- భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జిత సేవలను పరోక్షంగా జరుపుకునేందుకు వీలు కలిగించాము

- వరలక్ష్మి వ్రతాన్ని శ్రీశైలం టీవీ మరియు యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్న శ్రీశైల దేవస్థానం

- వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునే భక్తులు 1,116/- ను సేవ రుసుముగా www.srisailamonline.com ద్వారా చెల్లించే వీలు, క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి వాటితో చెల్లించే వెసులుబాటు కల్పించిన దేవస్థానం.

2020-07-31 02:03 GMT

వరలక్ష్మీ దేవి అలంకారంలో విజయవాడ దుర్గమ్మ

విజయవాడ

- నేడు శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున ఇంద్రకీలాద్రి పై వరలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ

- నేటి ఉదయం 8 గంటలకు దేవస్ధానం వారిచే వరలక్ష్మీ దేవి వ్రతం

- కోవిడ్ ద్రుష్ట్యా ప్రతీ ఏడాది నిర్వహించే సామూహిక, ఉచిత వరలక్ష్మీ దేవి వ్రతాలు, ఆర్జిత సేవలు రద్దు...భక్తులకు పూజలకు అనుమతి నిరాకరణ

- వరలక్ష్మీ దేవి వ్రతంలో భక్తులకు పరోక్ష పూజల ద్వారా గోత్రనామాలతో జరిపేందుకు అవకాశం కల్పించిన దుర్గగుడి అధికారులు

2020-07-31 02:01 GMT

శానిటైజర్ తాగిన భిక్షాటకులు

ప్రకాశం జిల్లా ,

- కురిచేడు ఎంపిడిఓ కార్యాలయం సమీపంలో శానిటైజర్ తాగిన ఇద్దరు భిక్షాటకులు.

- ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమం.

- సమీపంలోని వైద్యశాలకు తరలింపు.

- మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో రోజు నీటిలో శానిటైజర్ కలుపుకొని తాగీన బిక్షాటకులు.

- ఈరోజు మెతాదు ఎక్కువగా కలుపుకొని తాగడంతో చోటుచేసుకున్న సంఘటన.

2020-07-31 02:00 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఎన్. రమేష్ కుమార్ పునర్నియామకం

అమరావతి:

- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఎన్. రమేష్ కుమార్ ను పునర్నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

- హైకోర్టు ఉత్తర్వుల మేరకు రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమిస్తున్నట్టు గవర్నర్ బిశ్వాభూషన్ హరిచందన్ పేరిట నోటిఫికేషన్ జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది

- సుప్రీంకోర్టు లో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో వచ్చే తుది తీర్పు నకు లోబడి ఈ పునర్నియామక నోటిఫికేషన్ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం                                                                                                                                                 - పూర్తి వివరాలు 

Tags:    

Similar News