Live Updates:ఈరోజు (జూలై-10) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-07-10 01:44 GMT

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు శుక్రవారం, 10 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, కృష్ణపక్షం, పంచమి (ఉ.11:37 వరకు), పూర్వాభాద్ర నక్షత్రం (తె.05:33 వరకు) సూర్యోదయం 5:48am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-07-10 14:22 GMT

కృష్ణాజిల్లా: పామర్రు నియోజకవర్గం మొవ్వ మండల పరిధిలోని ముగ్గురు రైతులకు పాముకాటు...

- తోట్లవల్లూరు మండలానికి చెందిన గోళ్ళ. చింతయ్య(35), మరియమ్మ, చింతయ్యలు వారి పొలాల్లో పనిచేస్తుండగా కాటు వేసిన రక్త పింజరి పాము...

- దగ్గరలోని నాటు వైద్యుని ఆశ్రయించిన భాదితులు...

- పరిస్థితి విషమించడంతో మొవ్వ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి న గ్రామస్థులు...

- వైద్యులు శొంఠి.శివరామకృష్ణ సరైన వైద్యం అందించడంతో తప్పిన ప్రమాదం...

2020-07-10 11:47 GMT

విశాఖపట్నం: వైద్య విద్య చివరి సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్​లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ తెలిపింది.

- పరీక్షల కోసం విద్యార్థులు సిద్ధం కావాలని విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సి​పల్ డాక్టర్ పీవీ సుధాకర్ సూచించారు.

- ఇవి అన్​లైన్​లో కాకుండా పేపర్లతోనే ఉంటాయన్నారు. ఒక పరీక్ష హాల్లో కేవలం 20 మందికి మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.



2020-07-10 11:44 GMT

విశాఖపట్నం: నాన్ బల్క్ కార్గోపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన రైల్వే రాయితీలు ఇస్తోంది.

- ఈ రంగంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా బిజినెస్ మోడల్ అభివృద్ధి చేస్తోంది.

- ఇందుకోసం వ్యాపార వర్గాలు, వివిధ అసోసియేషన్ సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరింది.

- ఆపరేషన్స్ మేనేజర్ పేరిట డివిజన్ స్థాయిలో ఇందుకోసం ప్రత్యేకంగా అధికార యంత్రాంగానికి బాధ్యత అప్పగించింది.

- వాల్తేరు డివిజన్​లో ఈ రకమైన వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ ఏర్పాటు చేశారు.

2020-07-10 11:29 GMT

కోరుకొండ: మండల కేంద్రమైన కోరుకొండ గ్రామం ఫ్రీ జోన్ అయ్యింది.

- కోరుకొండలో గత నెల 26వ తేదీన కరోనా కేసు నమోదు కావడంతో పోలీస్ స్టేషన్ వెనుక భాగాన కంటోన్మెంట్ జోన్ గా గుర్తించి ఆ ప్రాంతాన్ని ఎవరు సందర్శించకుండా చర్యలు తీసుకున్నారు.

- కరోనా సోకిన వ్యక్తికి వ్యాధి తగ్గి నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఈ ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా వెల్లడించినట్లు మండల వైద్యాధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రవిచంద్ర తెలియజేశారు.

- దీంతో ఆ ప్రాంతానికి అడ్డుగా వేసిన కంచెను తొలగించి యధావిధిగా స్థానికులు తిరిగేందుకు వీలు కల్పించారు.


2020-07-10 11:20 GMT

తుని: ఆదివాసీల ఆరాధ్య దేవతగా తుని పట్టణ శివారు గేడ్లబీడు ప్రాంతంలో విరాజిల్లుతున్న శ్రీ ధరాల్లమ్మ తల్లి అమ్మవారు ఆషాడమాస శుక్రవారం సందర్భంగా శాఖాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

- ఆలయ ధర్మకర్త రంగోలి సత్తిబాబు రాజేశ్వరి దంపతులు అమ్మవారిని పలు రకాల కూరగాయలతో అందంగా అలంకరించారు.

- ఆపై అర్చకులు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి హారతులు అందజేశారు.

- భక్తులు సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు.



2020-07-10 11:16 GMT

కడప: నగరంలో ఉన్న ఆటో యూనియన్లకు ట్రాఫిక్ సీఐ శ్రీధర్ నాయుడు కోవిడ్19 పరంగా తగు జాగ్రత్తలను సూచిస్తూ సమావేశం ఏర్పాటు చేశారు.

- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో తిరుగు త్రీ వీల్ ఆటో నందు ఇద్దరు, పెద్ద ఆటో నందు నలుగురు మించి ఉండరాదని, అలాగే ప్రతిఒక్కరు మాస్క్ దరించాలని తెలిపారు.

- పాటించని వారిమీద జిల్లా ఎస్పీ ఉత్తర్యుల మేరకు భారీ జరిమానాలు మరియు ఆటో సీజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

2020-07-10 11:14 GMT

కడప: నగరంలోని ప్రెస్ క్లబ్ నందు గోవింద మాల గురు స్వామి శివరామి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

- 2004లో రాజశేఖర్ రెడ్డి టీటీడీ ఈ దర్శన్ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని,నేడు జగన్ మోహన్ రెడ్డి ఈ దర్శన్ కౌంటర్ లను రద్దు చేయడం చాలా దారుణమని పేర్కొన్నారు.

- ఎన్నికల ప్రచారంలో తండ్రి పెట్టిన మంచి పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారుని, మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తిగా ఈ దర్శన్ కౌంటర్లను కొనసాగిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు.

- జిల్లాలో 4 ఈ దర్శన్ కౌంటర్ల ఉన్నాయని,ఈ నాలుగు కౌంటర్లను పునరుద్ధరించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూదాలని తెలిపారు.

- అంతేకాకుండా ఈ దర్శన్ కౌంటర్ లో పని చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, కుల, మత, బేధాభిప్రాయాలు లేని మీ పాలనలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదని ఆశిస్తున్నామని తెలిపారు.



2020-07-10 11:12 GMT

కడప : నగరంలో విధులు నిర్వహిస్తున్న ఎఅర్ పొలీస్ హెడ్ కానిస్టేబుల్ కారోనా తో మృతి చెందారు.

- మూడు రొజుల క్రితం అనారోగ్యానికి గురవ్వడంతొ తిరుపతి పద్మావతి అసుపత్రికి తరలించారు.

- పరిస్దితి విషమించి ఈరోజు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

- జిల్లా పోలీస్ శాఖ కో-అపరేటివ్ సొసైటిలొ విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

- ఈ సంఘటన పై జిల్లా పోలీసు అదికారుల సంఘం సంతాపం తెలిపారు.

2020-07-10 11:08 GMT

నగరి: అందరి సహకారంతోనే కరోనా వైరస్ నియంత్రణ చేయగలమని ఏపీఐఐసి చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు.

- పార్టీ కార్యాలయంలో రిలయన్స్ స్వచ్ఛంద సంస్థ తిరుపతి వారు నిర్వహించిన ఉచిత జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

- ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రస్తుతం పరిస్థితుల్లో ఎనర్జీ డ్రింక్ అందించడానికి ముందుకు వచ్చిన రిలయన్స్ స్వచ్ఛంద సంస్థకు ప్రశంసలు అందజేశారు.

- 10 వేల జూస్ ప్యాకెట్లను వారు అందజేశారని వాటిని ఫ్రంట్లైన్ కార్మికులు పారిశుద్ధ్య సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది, పోలీసులకు అందిస్తామన్నారు. 



2020-07-10 10:44 GMT

అనంతపురం: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లోని కోవిడ్ ఐసియు వార్డును జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు.

- అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్యతో కలిసి కోవిడ్ ఐ సి యు వార్డులో కరోనా బాధితులకు వైద్య చికిత్సలు అందించడానికి ఏర్పాటుచేసిన లెవెల్ 1,2,3 వార్డులలోని బెడ్ లను పరిశీలించారు.

- ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ వ్యాధి తీవ్రతను బట్టి లెవెల్ 1,2,3 వార్డులను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ కు తెలిపారు.

- లెవెల్ 1 నందు ఐ సి యు సౌకర్యంతో తొమ్మిది బెడ్ ను ఏర్పాటు చేశామన్నారు.

- ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, ఇతర వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.




Tags:    

Similar News