Live Updates:ఈరోజు (జూలై-07) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-07-07 01:37 GMT

ఈరోజు మంగళవారం, 07 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, కృష్ణపక్షం, విదియ్ (ఉ.09:02రకు), శ్రవణ నక్షత్రం (రా.11:56వరకు) సూర్యోదయం 5:47am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-07-07 16:22 GMT

తూ.గో.జిల్లా: రాజవోమ్మంగి మండలం బోయిపాడు జుంక్షన్ వద్ద సుమారు రెండు లక్షల విలువగల 110 కిలోల గంజాయిని వ్యాన్లు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు,

- ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ ,

- వ్యాన్ సీజ్.

2020-07-07 16:22 GMT

తూర్పు గోదావరి జిల్లా: కోరుకొండ మండలం గాదరాడ లో పురుగుల మందు తాగి తల్లి కొడుకు మృతి.

- దెగపాటి నవరత్నమ్మ (83),దెగపాటి ప్రకాశం(45)

- ఇద్దరూ పురుగుల మందు తాగి మృతి.

- కేసు నమోదు చేసి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కోరుకొండ పోలీసులు.

- మానసిక ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

2020-07-07 16:01 GMT

LG పాలిమర్స్ లీకేజి ఘటన లో CEO తో సహా 12 మంది ముఖ్య అధికారులను అరెస్ట్.

- పూర్తి వివరాలు 

2020-07-07 14:20 GMT

తుని: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తుని పట్టణంలో వ్యాపారాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించాలని ముందు తీర్మానించారు.

- అయితే వ్యాపారస్తులు అభ్యంతరం మేరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు చాంబర్ అనుమతిచ్చింది.

- చిన్నపాటి వ్యాపారస్తుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని సమయం పొడిగించామన్నారు. 



2020-07-07 13:05 GMT

నర్సీపట్నం: డివిజన్ లో పోడు భూముల వివరాలను తక్షణమే సేకరించాలని రెవెన్యూ డివిజినల్ అధికారి లక్ష్మీ శివజ్యోతి ఆదేశించారు.

- విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో అటవీ, రెవెన్యూ తదితర శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

- ప్రభుత్వ ఆదేశాల మేరకు డివిజన్లో భూములను తక్షణమే గుర్తించి వాటి వివరాలను అందజేయాలని ఆమె ఆదేశించారు.

- ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికి వాటి నివేదికలు పంపాలని పేర్కొన్నారు.



2020-07-07 09:33 GMT

కృష్ణా : ఆర్టీసీ బస్సులో అక్రమ మద్యం రవాణా ..

- తిరువూరు డిపో బస్సులో ఇద్దరు వ్యక్తులు రెండు బ్యాగుల్లో మద్యం తీసుకెళ్తున్నారన్న సమాచారం..

- బైపాస్ లో బస్సును నిలిపి తనిఖీ చేపట్టిన ఎస్సై సుబ్రహ్మణ్యం..

- పది మద్యం ఫుల్ బాటిళ్లు మాన్షన్ హౌస్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు..

- గుంపులో గోవిందా అని ఆ అక్రమ రవాణా దారులు తప్పించుకున్న వైనం..

- వారు రిజర్వేషన్ ద్వారా బస్సు ఎక్కరా, లేకా టికెట్ తీసుకుని రవాణా చేస్తున్నారా అని క్షుణ్ణంగా ఆరా తీస్తున్న పోలీసులు..

- వారు ఎప్పటినుండి ఈ అక్రమ రవాణా ను కొనసాగిస్తున్నారు..అనే విషయంపై బస్టాండ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది

2020-07-07 03:17 GMT

అక్రమంగా మద్యం అమ్మినా, పక్క రాష్ట్రాల నుండి తరలించినా Ap exize act: 17 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు, 8 సంవత్సరాల జైలు శిక్ష !!



2020-07-07 03:15 GMT

హైకోర్టు తీర్పుతో తెలంగాణ సచివాలయ కొత్త భవన నిర్మాణానికి మార్గం సుగమమైన నేపథ్యంలో పాత భవనం కూల్చివేత పనుల ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజాము నుంచే భారీ యంత్రాలతో భవనం కూల్చివేత పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ వైపుగా వాహనాలు రాకుండా రోడ్లను మూసివేశారు.

2020-07-07 03:07 GMT

గురుకుల పాఠశాల 5వ తరగతి ప్రవేశం కోసం 4/07/2020న నోటిఫికేషన్ విడుదల 

అప్లికేషన్ లాస్ట్ డేట్. 20/07/2020

కావలసిన పత్రాలు.

1) స్టడీ సర్టిఫికేట్.

2)క్యాస్ట్(కులం) సర్టిఫికెట్

3)ఆదాయం సర్టిఫికెట్.

4)ఆధార్

5)స్పెషల్ కేటగిరి (ఫిజికల్,అంధ, చెవుడు,ex. man సర్వీస్. మొదలైనవి)

👉ఆన్లైన్ ద్వారా 50/- ఫీజ్ కట్టాలి.

👉తల్లిదండ్రుల సంవత్సరం ఆదాయం 1,00,000 *లక్ష కంటే తక్కువ ఉండాలి.

👉27/07/2020 న లాటరీ పద్దతి ద్వారా ఎన్నుకుంటారు..

👉28/07/2020 కాల్,లెటర్ ద్వారా సమాచారం ఇస్తారు.

👉 31/07/2020 ఎన్నుకోబడిన పాఠశాలకు రిపోర్ట్ చేయాలి

2020-07-07 02:37 GMT

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జీతాలకు లైన్ క్లియర్

- నేటి నుంచి ప్రభుత్వ ఉద్యుగుల ఖాతాల్లో జమ కానున్న జీతాలు

- జూన్ నెల జీతాలు, పెన్షన్లు మంజూరు నేటి రాత్రి నుండి మొదలై రేపటి లోపు వారి ఖాతాల్లో జమ

Tags:    

Similar News