Live Updates:ఈరోజు (జూలై-06) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-07-06 01:47 GMT
Live Updates - Page 3
2020-07-06 02:01 GMT

లబ్దిదారులకు పారదర్శకంగా ఇళ్ళపట్టాల ఎంపిక

నరసరావుపేట: పట్టణంలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఇళ్ల పట్టాలకై నమోదు చేసుకున్న లబ్ధిదారులకు స్థలాలు కేటాయింపులో ముందు వెనుక అనే

తారతమ్యం లేకుండా లాటరీ ద్వారా ఎంపిక చేసి ఇళ్లను, ఇంటి స్థలాన్ని కేటాయించటం పారదర్శక పరిపాలనకు నిదర్శనం అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.

- ఈ సందర్భంగా నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్ లో లాటరీ ద్వారా ఎంపిక కార్యక్రమాన్ని నరసరావుపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.

- ఎమ్మెల్యే గోపి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు.

- ఈ కార్యక్రమంలో ఆర్డీవో మొగిలి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు, తహాసీల్దార్ రమణ నాయక్, హౌసింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.




2020-07-06 02:00 GMT

నాలుగు రోజుల పాటు వర్షాలు!

రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం వల్ల ఏర్పడ్డ అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు. 

2020-07-06 01:57 GMT

అక్రమ మద్యం స్వాదీనం

రామకుప్పం: చిత్తూరు జిల్లా రామకుప్పం లోని వైయ్యస్సార్ సర్కిల్ లో వాహనాలను తనికీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 380 టెట్రా ప్యాకెట్ల కర్నాటక మద్యంతో పాటు ఒక టివియస్ వాహనాన్ని సీజ్ చేసి

ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు యస్సై కృష్ణయ్య తెలిపారు.

- కర్నాటక నుండి మండలంలోకి అక్రమంగా మద్యం తరలిస్తే కేసులు నమోదు చేస్తామని యస్సై కృష్ణయ్య హెచ్చరించారు.



Tags:    

Similar News