Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-27 03:22 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 27 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ఏకాదశి మ.12-03 వరకు తదుపరి ద్వాదశి | శతభిష నక్షత్రం ఉ.8-54 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: మ.3-46 నుంచి 5-29 వరకు | అమృత ఘడియలు రా.2-04 నుంచి 3-47 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-03 వరకు తిరిగి రా.10-29 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-౩౧

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-27 16:27 GMT

అమరావతి:

-విపత్తు నిర్వహణ కింద కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపదమిత్ర పథకంలో శిక్షణకు కృష్ణా జిల్లా ఎంపిక

-వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సాయం అందించేందుకు దేశ వ్యాప్తంగా ఆరు వేల మంది కమ్యూనిటీ వలంటీర్లను సిద్దం చేస్తున్న కేంద్రం.

-దేశవ్యాప్తంగా తీరప్రాంతాల్లోని 30 జిల్లాల్లో రెండు వందల చొప్పున కమ్యూనిటీ వాలంటీర్లను సిద్ధం చేయాలని నిర్ణయం

-వరదల్లో ప్రజలకు సాయం అందించేలా కమ్యూనిటీ వలంటీర్లకు ఆపద మిత్ర పథకం కింద శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం.

-కృష్ణా జిల్లాలోని 200 మంది కమ్యూనిటీ వలంటీర్లను గుర్తించి శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం

-ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ద్వారా కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమం

-రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో అత్యవసర పరిస్థితులు, వరద సమయాల్లో అత్యవసరంగా స్పందించేందుకు 9 జిల్లాల్లో హ్యామ్ రేడియో వ్యవస్థను ఏర్పాటు చేసిన విపత్తు నిర్వహణ సంస్థ

2020-10-27 16:26 GMT

   నెల్లూరు :--

-- సర్వేపల్లిలో ధాన్యం కొనుగోలులో టీడీపీ కార్యకర్తే అక్రమాలకు పాల్పడ్డాడు.. దానిపై విచారణకు ఆదేశించాము.. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం..

-- సోమిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు.. ప్రజలు గమనిస్తున్నారు.

-- ఇక జీవితంలో సోమిరెడ్డి ఎమ్మెల్యే కాలేడు..ఆ ఆందోళనతో ఇష్టమొచ్చిట్లు మాట్లాడుతున్నారు.

-- ఇప్పటి కీ సోమిరెడ్డి అధికారంలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు..

-- ఎన్నడూ లేని విదంగా ఈసారి ఎడకారులో అధిక మొత్తంలో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసాము.

2020-10-27 16:17 GMT

తిరుమల

-- శ్రీవారి ఆలయంలో నిర్వ‌హించే ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, డోలోత్స‌వం, స‌హ‌స్ర‌ దీపాలంకార‌ సేవ‌ల‌ను కోవిడ్ - 19 నేప‌థ్యంలో భ‌క్తుల కోరిక మేర‌కు ఆన్‌లైన్లో వర్చ్యువల్ విధానంలో న‌వంబ‌రు నెలలో నిర్వ‌హించాల‌ని టీటీడీ నిర్ణయం.

-- లాక్‌డౌన్ త‌రువాత శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌ల‌ను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తుంది.

-- వర్చ్యువల్ ఆర్జిత సేవ‌ల పాల్గొన్న భ‌క్తులకు దర్శనం లేదు.

-- సాయంకాలం నిర్వ‌హించే స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ను భక్తుల విజ్ఞప్తి మేరకు ఆల‌యం వెలుపల సహస్రదీపాలంకార సేవా మండపంలో ప్రయోగాత్మకంగా       నిర్వహణ

-- ఇకపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు నాలుగు మాడ వీధుల‌లో విహరించి ఆల‌యానికి చేరుకుంటారు.

-- ఈ సేవలను గృహస్థ భక్తులు సాంప్ర‌దాయ దుస్తులు ధరించాలి వీక్షించాలి.

-- సేవల్లో పాల్గొనే గృహ‌స్తుల గోత్ర నామాల పట్టికను శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు.

2020-10-27 16:11 GMT

నెల్లూరు :--

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్.

-- ఒక పక్క రాష్ట్రంలో అకాల వర్షాలు , పంట నష్టాలు జరిగిన నేపథ్యంలో రైతు భరోసా కింద ఇచ్చిన ఆర్థిక సహాయం రైతులకు కొంత ఊరట కలిగించింది.

-- నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎడగారులో 3 లక్షల టన్నుల ధాన్యం సేకరించడం ఓ రికార్డు.

-- అధికార యంత్రాంగం కదిలి రాజకీయ నాయకత్వం మొత్తం ముందుండి నడిపి ఏ విపత్తు వచ్చినా మేమున్నామ౦టూ భరోసా ఇచ్చింది.

-- ఇప్పుడు కూడా టీడీపీ మాపై బురద చల్లేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తోంది..

-- రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేస్తే.. గత ప్రభుత్వం ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తినా పట్టించుకోలేదు..

-- సీఎం జగన్మోహన్రెడ్డి ఏ విధంగా రైతులకు అండగా నిలబడుతున్నారో రైతులకు , రాష్ట్ర ప్రజలకు తెలుసు..

-- జిల్లాలో ఏ చిన్న సమస్య తలెత్తినా మేమున్నామంటూ నాయకులంతా వస్తున్నారు..

-- చిన్న చిన్న లోటు పాట్లు ఉన్న సరిదిద్దుకునే౦దుకు వాటిపై కూడా దృష్టి పెడుతున్నాం

-- భవిష్యత్తులో మరింత సమన్వయంతో పనిచేసి జగన్మోహన్రెడ్డి ఆశయాల మేరకు ప్రజల జీవితాల్లో అట్టడుగు స్థాయి వరకు మార్పు తీసుకుని వచ్చేందుకు       కృషి చేస్తా౦..

2020-10-27 15:25 GMT

-ఎన్నికల నిర్వహణ పై బోండా ఉమ

-బీహార్ లో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి

-కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది

-ఎపి లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహింవచ్చు

2020-10-27 15:11 GMT

విజయవాడ

-బోండా ఉమ మాజీ mla

-315రోజులుగా రైతులు, మహిళల లు ఆందోళన చేస్తున్నా జగన్ స్పందించక పోవడం దారుణం

-ఎప్పుడూ బయటకు రాని మహిళలు ఆవేదన‌ వ్యక్తం చేస్తుంటే‌.. పోలీసులు తో కొట్టించా

-అనేక అక్రమ కేసులు పెట్టినా .. భయపడకుండా ఉద్యమం ‌కొనసాగిస్తున్నారు

-ఇప్పటికే అనేక మంది రైతులను జైలుకు పంపారు

-అమరావతి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా కార్యక్రమం చేపడి మళ్లీ కేసులు పెట్టారు

-ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడమే కాక, తీవ్రవాదులు కు తరహాలో రైతులకు సంకెళ్లు‌ వేయడం నీచమైన చర్య

-అన్నదాతలను ఏవిధంగాఈ ప్రభుత్వం చూస్తుందో ఆలోచించండి

-అమరావతి అనుకూలంగా ఉద్యమం చేసిన‌వారిని అణచివేయాలని జగన్ చూస్తున్నా

-ఎపి లో పోలీసులు రాజ్యం నడుస్తుంది... వారిని అడ్డం పెట్టుకొని జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు

-ఈ ఘటనల పై జాతీయ మానవుల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం

-ఫిర్యాదు వెనక్కి తీసుకుంటామన్న కూఢా.. పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం‌ సరి కాదు

-న్యాయ పరంగా కూడా పోలీసులు, ప్రభుత్వం పై పిటీషన్ వేస్తాం

-జిఒ నెంబర్ 21 ప్రకారం ప్రజలపై ఫైన్ల భారం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది

-ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు ప్రజల నుంచి చిన్న తప్పులకే భారీ జరిమానాలు వేస్తారా

-దీని వల్ల అవినీతి మరింత పెరిగే అవకాశం ఉంది

-సాక్షి పత్రిక లో ఇష్టం వచ్చినట్లు గా యాడ్ ల రూపంలో ప్రభుత్వ సొమ్మును కూడ పెడుతున్నారు

-ప్రజలు నిబంధనలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి

-అంతేకానీ తప్పులు దొరికాయని ప్రజల నుంచి వేలకు‌ వేలు బాధేయడం దుర్మార్గం

-భరత్ అను నేను సినిమా ప్రభావం తో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారేమో

-ఈ 21జిఒ వల్ల... కొంతమంది అధికారులు వసూళ్ల కూడా మొదలు పెట్టారు

-ఈ జిఒ రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నిరసన కార్యక్రమాలు చేపడుతుంది

-ఇటువంటి తుగ్లక్ జిఒలు, తుగ్లక్ నిర్ణయాలను ఉపసంహరించు కోవాల

2020-10-27 15:04 GMT

అమరావతి

-యస్.విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

-భారతీయ జనతా పార్టీ రేపు జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషన్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని పార్టీనిర్ణయించడం జరిగింది.

-పార్టీ ప్రతినిధిగా సీనియర్ నాయకులు పాక సత్యనారాయణ హాజరు కావాలని రాష్ట్ర బిజెపి నిర్ణయించడం జరిగింది.

-పార్టీ ప్రతినిధిగా ఆయన రేపు సమావేశంలో పాల్గొని పార్టీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు.

2020-10-27 14:48 GMT

విజయనగరం..

-అతి తక్కవ భక్తులతో నిరాడంబరంగా జరిగిన సిరిమానోత్సవం

-సిరిమానోత్సవాన్ని తిలకించిన మంత్రి బొత్స సత్యనారాయణ, శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య

-సిరిమానోత్సవాన్ని ఎల్సీడి స్క్రీన్ల ద్వారా వీక్షించిన భక్తులు

2020-10-27 14:38 GMT

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి

-పరిపాలన ప్రతి ఇంటి గుమ్మం ముందుకు వెళ్ళింది

-అమలవుతున్న సంక్షేమ ఫలాలు వీటి ద్వారా అందుబాటులోకి వచ్చాయి

-ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా కొనియాడుతున్నారు

-కాళీలు 16208 కు నోటిఫికేషన్ ఇచెప్పుడు ఉన్నాయి

-18048 కాళీలు ప్రస్తుతం ఉన్నాయి...మెరిట్ లిస్ట్ నుంచి కేటగిరీ ఆధారంగా ఎంపిక

-7.68 మంది క్వాలిఫై అయ్యారు....

-ఈ ఏడాది కట్ ఆఫ్ లేదు...మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది

-చాలా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాం

-గత ఏడాది, ఈ ఏడాది చూసినా ఇంత పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు

2020-10-27 14:07 GMT

అమరావతి

*పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, ఉన్నతాధికారులు

*వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలు గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

*సమన్వయంతో పనిచేయాలని వివిధ డిపార్ట్మెంట్ లకు ఆదేశం

*కొనుగోలు విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా 155251 నంబర్ కు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచన

Tags:    

Similar News