Live Updates: ఈరోజు (సెప్టెంబర్-25) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-25 01:31 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 25 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | నవమి: రా.10-31వరకు తదుపరి దశమి | పూర్వాషాఢ నక్షత్రం రా.11-06 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: ఉ.9-00 నుంచి 10-34 వరకు | అమృత ఘడియలు: సా.6-24 నుంచి 7-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి మ.12-16 నుంచి 1-04 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-53

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-25 13:00 GMT

#ప్రముఖ సినీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటులు  శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి విచారకరం.

#సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు, లక్షలాది వారి అభిమానులకు తీరని లోటు. ఆలపించిన ఎన్నో వేల పాటల ద్వారా వారు ప్రజల మనసుల్లో సుస్థిరంగా    నిలుస్తారు.

#వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సంతాపం తెలియజేసిన మంత్రి.

2020-09-25 12:02 GMT

-గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం చనిపోయాడు అని తెలిసి చాలా బాధగా ఉంది.

-ఆయన సంగీత సాహిత్య లోకానికి మారుపేరు. చిన్న వయసులోనే ఆయన సంగీత ప్రపంచానికి వచ్చాడు.

-తుది శ్వాస వరకు కళామతల్లికి సేవ చేస్తూనే ఉన్నాడు. నగరి హైస్కూల్లో ఆయన కొంతకాలం చదివాడు.

-ఆయనతో నాకు చిన్నప్పటినుంచి పరిచయం ఉండడం వలన ఆయనంటే ప్రత్యేక అభిమానం.

-ఆయన వలన కొన్ని వేల మంది గాయకులు, సంగీత కళాకారులు తయారయ్యారు. గొప్ప సేవలు చేసినటువంటి వ్యక్తి కొవిడ్ బారినపడి మరణించడం   దురదృష్టకరం.

-డాక్టర్లు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు అయినా సరే ఆయన మరణం సంగీత లోకానికి తీరని లోటు.

-ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన సంగీత సాహిత్యం ఈ భూమి ఉన్నంత వరకు అజరామరం. ఘంటసాల తర్వాత బాలు గారే సంగీత గానములో     ప్రసిద్ధిగాంచారు.

-ఆయన సేవలు గుర్తించుకుంటూ జ్ఞాపకార్థం ప్రభుత్వం నిర్మిస్తే బాగుంటుంది.

-కమ్యూనిస్టు పార్టీ తరఫున ఆయనకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.

2020-09-25 11:46 GMT

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ని కలిసిన కాంగ్రెస్ నేతలు..

-మర్రి శశిధర్ రెడ్డి ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్

-బ్యాలెట్ విధానం, evm విధానంలో ఏ విధానం ద్వారా జరిపితే బాగుంటుందో ఎన్నికల సంఘం చెప్పలేదు

-వారు రాజకీయ పార్టీలను అభిప్రాయం కోరడం సబబు కాదు

-బ్యాలెట్ బాక్స్ లు సిద్ధం చేయడాన్ని ఆక్షేపిస్తున్నాము

-బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్స్ సిద్ధం చేయడానికి ప్రత్యేకంగా అధికారులని నియమించారు

-కాంగ్రెస్ పార్టీ కి అనుమానాలు కలుగుతున్నాయి

-ప్రజల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి

-డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు

-గతంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు

-న్యాయ బద్దంగా ఎన్నికలు జరపాలి

-ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన జరపాలి

2020-09-25 11:16 GMT

నాగర్ కర్నూలు జిల్లా :

-కొల్లాపూర్ పట్టణానికి కరోనా నుండి కోలుకున్న తర్వాత మొదటిసారిగా వచ్చినందుకు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కు ఘనంగా స్వాగతం పలికిన కార్యకర్తలు.

-రెవిన్యూ బిల్లుకు ఆమోదం పొందినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు.

2020-09-25 11:05 GMT

-గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి     సరఫరా  శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

-గాయకుడు ఎస్పీ బాలు గారి మరణం అత్యంత బాధాకరం

-పాటల ప్రపంచంలో ఆయన గాన గాంధర్వుడు

-వారి మరణం యావత్తు దేశానికి,పాటల ప్రియులకు తీరని లోటు

-వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..

2020-09-25 10:54 GMT

ఎల్ .రమణ టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు..

-సుప్రసిద్ధ గాయకుడు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది.

-సంగీత దర్శకుడిగా, గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా చిత్రసీమకు ఎనలేని సేవలందించారు.

-హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో వేలాది పాటలకు తన స్వరంతో ప్రాణం పోసిన గాన గంధర్వుడు.

-తెలుగు జాతికి లభించిన అద్భుత వరం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. అటువంటి గొప్ప గాయకుడిని కరోనా రూపంలో మృత్యువు కబలించడం బాధాకరం.

-ఆయన మ‌ర‌ణం యావ‌త్ సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.

-కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

2020-09-25 08:37 GMT

చాడ వెంకట్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి...

-రెండు తెలుగు రాష్ట్రాలనేకాక ప్రపంచ దేశాల ప్రజలను తన గానంతో అలరించి మన్ననలు పొందాడు..

-ఎస్పీ. చలన చిత్ర పరిశ్రమతో పాటు యావత్ సమాజానికి తీరని లోటు. ఆయనకు సంతాపం...

-వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను..

2020-09-25 07:53 GMT

Hmtv తో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు..

-చందానగర్ తారానగర్ లో అవంతి రెడ్డి, హేమంత్ కుమార్ లు ఉండేవారు..

-అవంతి రెడ్డి బీటెక్ చదవగా, హేమంత్ డిగ్రీ కంప్లీట్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు...

-ఇద్దరూ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు..

-కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు లో మ్యారేజ్ చేసుకున్నారు..

-నిన్న మీతో మాట్లాడలంటు గచ్చిబౌలి లోని హేమంత్ నివాసానికి వచ్చిన అవంతిక కుంటుంబ సభ్యులు...

-చందానగర్ కీ వెల్లాలని వారిని కారులో తీసుకేళ్లుతుండగా అనుమానం రావడంతో తప్పించుకునెందుకు ప్రయత్నంచిన అవంతిక, హేమంత్...

-కారులో నుంచి తప్పించుకుని అత్తమామలకు ఫోన్ చేసిన అవంతిక...

-మరో కారులో హేమంత్ తీసుకుని పోయిన అవంతిక మేనమామ యుగంధర్ రెడ్డి, మరికొందరు...

-హేమంత్ తల్లిదండ్రులు చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తం అయిన గచ్చిబౌలి పోలీసులు...

2020-09-25 07:48 GMT

ఆదిలాబాద్ ..

తెలంగాణ మావోయిస్టు పార్టీ అదికార ప్రతినిధి: జగన్..

-ఎన్ కౌంటర్ల పై హైకోర్టు న్యాయ విచారణ చేయాలి..

-మావోయిస్టులను కదంబ అడవులలో పట్టుకోని కాల్చి చంపారు...

-బాస్కర్ పేరిట. పోలీసులే లేఖను విడుదల చేశారు..

-ఎన్ కౌంటర్లకు నిరసనగా ఈ నెల 28న తెలంగాణ బంద్ కు పిలుపునిస్తున్నాం జగన్

2020-09-25 07:14 GMT

మంచిర్యాల జిల్లా..

-అదుపు తప్పి బోల్తా పడిన ట్రాక్టర్..

-నలుగురు కార్యకర్తలకు స్వల్ప గాయాలు..

-కొత్త రెవిన్యూ చట్టం స్వాగతిస్తూ ర్యాలీ నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ‌‌.

Tags:    

Similar News