Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-23 00:45 GMT
Live Updates - Page 2
2020-10-23 15:38 GMT

Hyderabad updates: పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేసిన కేసు సైబర్ క్రైమ్ కు ట్రాన్స్ఫర్ అయ్యింది...

-హైదరాబాద్ జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి..

-139 మంది తనపై అత్యాచారం చేశారని ఆగస్టు 20 న పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేసిన.. కేసు సైబర్ క్రైమ్ కు ట్రాన్స్ఫర్ అయ్యింది.

-ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసు సీసీఎస్ కు బదిలీ అయింది.

-ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న కొంత మందిని ఇప్పటికే విచారించాము.

-ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ శేకర్ అలియాస్ డాలర్ బాయ్ ని అరెస్ట్ చేసాము.

-ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాము.

-ఈ కేసులో ప్రమేయం ఉన్న వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.

-ఈ కేసును మహిళా ఏసీపి స్థాయి అధికారులతో విచారణ జరుపుతున్నాము.. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

-బాధిత మహిళ నుండి ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశాము.

-ఈ కేసును టెక్నికల్ అనాలసిస్ ద్వారా దర్యాప్తు చేశాము.

2020-10-23 15:25 GMT

Siddipet updates: టి ఆర్ ఎస్ వైపే అని ముంఫు గ్రామం నినదించిన ఏటీగడ్డ కిష్టాపూర్..

- సిద్దిపేట జిల్లా:

- సీఎం కేసీఆర్.. టి ఆర్ ఎస్ పార్టీ పై మాకు నమ్మకం విశ్వాసం ఉంది..

- మొన్న పల్లె పహాడ్.. నిన్న వేములఘట్ , నేడు ఎటిగడ్డ కిష్టాపూర్ .

- మంత్రి హరీష్ రావు ని కల్సి టి ఆర్ ఎస్ కె జై కొట్టిన ఏటీగడ్డ కిష్టాపూర్ గ్రామం...

- మాకు సీఎం కేసీఆర్...మంత్రి హరీష్ రావు పై నమ్మకమ్..విశ్వాసం ఉంది.. .

2020-10-23 15:19 GMT

Siddipet updates: బీజేపీ పై విరుచుకుపడ్డ మంత్రి హరీష్ రావు ..

సిద్దిపేట జిల్లా:

- బీజేపీ ఒక బీహార్ రాష్ట్రానికేనా... దేశానికి ప్రభుత్వమా...

- మంత్రి హరీష్ రావు సమక్షంలో బిజెపి నుండి టి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన పలువురు నాయకులు..

2020-10-23 14:55 GMT

Pragathi Bhavan: ప్రగతి భవన్ లో ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష.

 ప్రగతి భవన్...

*మక్కల కొనుగోలు పై నిర్ణయం ప్రకటించిన ప్రభుత్వం.

*మార్కెఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేయలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్.

2020-10-23 14:50 GMT

Telangana updates: పెండింగ్​ నిధులు విడుదల చేసిన కేంద్రం...

#రాష్ట్రానికి 202.3 కోట్లు పెండింగ్​ నిధులు విడుదల.

#రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌ నిధులు విడుదల

#202.3 కోట్లు పెండింగ్‌ నిధులు విడుదల చేసిన కేంద్రం.

#గడ్కరీతో కిషన్‌రెడ్డి భేటీ అనంతరం నిధుల విడుదలకు అంగీకారం.

#రాష్ట్రంలో 8 జాతీయరహదారుల నిర్వహణ, మరమ్మత్తుల కోసం నిధులు 

2020-10-23 12:06 GMT

Telangana updates: ప్రజలందరికీ బతుకమ్మ శుభకాంక్షలు-ఆర్దిక మంత్రి హారీష్ రావు...

*తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని మంత్రి హరిశ్ రావు గారు అన్నారు.

*బతుకమ్మ పండుగా సందర్భంగా .. ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు.

*దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉంది

*మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ

*టి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించింది

*ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వ బతుకమ్మ కానుకగా ఆడపడుచులలు చీరల పంపిణీ చేస్తున్నాము.

*ఈ పండుగను ప్రజలందరు వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

2020-10-23 11:54 GMT

K. T. Rama Rao: వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కు లను శుక్రవారం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి అందజేశారు..

1)తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ , తరుపున ,సంఘము రాష్ట్ర అధ్యక్షులు చేవెళ ఎం.పి డాక్టర్ రంజిత్ రెడ్డి , కోటి రూపాయలు .

2)తెలంగాణ పౌల్ట్రీ పెడరేషన్,తరుపున రాష్ట్ర అధ్యకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కోటి రూపాయలు.

3)స్నేహ పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేటు,లిమిటెడ్ సంస్థ, తరుపున మేనేజింగ్ డైరెక్టర్ రాంరెడ్డి కోటి రూపాయలు

4)GMR-Airport సంస్థలు ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న ,రూ.రెండు కోట్ల యాబై లక్షలు(2.5cr)

2020-10-23 11:49 GMT

Nagarkurnool district updates: నాగర్ కర్నూల్ ఎంపి పి. రాములు కు క‌రోనా పాజిటీవ్...

నాగర్ కర్నూల్ జిల్లా :

*తనకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొన్న ఎంపి.

*ఢిల్లీ పర్యటన కు వెళ్లి వచ్చిన తర్వాత త‌న‌కు పాజిటివ్ వ‌చ్చింది.

*వారం రోజులుగా త‌న‌ను క‌లిసిన‌వారు టెస్టులు చేయించుకోవాల‌ని, వీల‌యితే హోం ఐసోలేష‌న్‌లో ఉండేందుకు ప్రయ‌త్నించాల‌ని కోరిన ఎంపీ రాములు.

2020-10-23 10:33 GMT

Telangana updates: మరికాసేపట్లో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్...

*వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై సమీక్ష.

*వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

*వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై సమీక్షిస్తారు.

*ముఖ్యంగా మక్కల సాగుపై విధాన నిర్ణయం తీసుకునే అవకాశం.

*గత ఏడాది ఎన్ని ఎకరాల్లో మక్కలు వేశారు, వాటికి ఎంత ధర వచ్చింది, తదితర వివరాలను సమావేశానికి తీసుకురావల్సిందిగా అధికారులను సిఎం ఆదేశం.

*యాసంగిలో మక్కల సాగు చేయడం వల్ల లాభమా? నష్టమా? దేశంలో మక్కల మార్కెట్ పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై చర్చించి, నిర్ణయం ప్రకటించే అవకాశం.

2020-10-23 10:29 GMT

Errabelli Dayakar Rao: కరోనా కష్ట కాలంలో వరంగల్ జిల్లా ప్రజలను కాపాడుకోవడంలో ముదున్నాం..

* మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కామెంట్స్

* వరంగల్ నగరాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు గా మననందరి పై ఉంది..

* ఎంజీఎం ఆసుపత్రికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి మరింత అభివృద్ధి చేస్తాం..

* మొన్నటి అకాల వర్షాలకు నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలు వల్ల డ్రైనేజి వ్యవస్థకి ఇబ్బంది ఏర్పడింది..

* నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చేయాలి..

* ఎనిమిదో డివిజిన్ కార్పొరేటర్ దామోదర్ షెడ్డును కూల్చివేసిన అధికారులు ఏ కారణాల వల్ల కూల్చివేశారో తెలియజేయాలి..

* త్వరలో కేటీఆర్ తో చర్చలు జరిపి వరంగల్ నగరానికి ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తాము..

Tags:    

Similar News