Live Updates: ఈరోజు (22 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-22 03:23 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 22 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | అష్టమి - 22:53:39 వరకు తదుపరి నవమి | ధనిశ్ఠ - 11:09:53 వరకు తదుపరి శతభిష | వర్జ్యం 14:50:57 నుండి 16:15:16 | అమృత ఘడియలు 11:39:51 నుండి 12:24:49 | దుర్ముహూర్తం 16:09:39 నుండి 16:54:37 | రాహుకాలం 16:15:16 నుండి 17:39:34 | సూర్యోదయం: ఉ.06-24 | సూర్యాస్తమయం: సా.05-39

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-11-22 14:46 GMT

- అరవింద్ కుమార్ గౌడ్ టీడీపీ జిహెచ్ఎంసి సమన్వయ కమిటీ కన్వీనర్..

- జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఉపసంహరణ గిఫ్దువు ముగిసిన తరువాత 105 స్థానాల్లో టీటీడీపీ అభ్యర్థులు భరిలో ఉన్నారు...

- 80 శాతం కు పైగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారున్నారు...

- హైదరాబాద్ దాహార్తిని తీర్చిదిద్దడానికి కృష్ణానది జలాలను తీసుకొచ్చింది టీడీపీ..

- హైటెక్ సిటీని నిర్మించి మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ కంపనిలను నగరానికి తీసుకువచ్చింది...

- నగర ట్రాఫిక్ ను తగ్గించడానికి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు టీడీపీ అంకురార్పణ చేసింది..

- నిత్యం మతఘర్షణలు ,కర్ఫ్యూ లు ఉండే శాంతి భద్రతలకు పరిరక్షించింది టీడీపీ..

2020-11-22 14:06 GMT

  సంగారెడ్డి జిల్లా:

- బీజేపీ ఆఫీసులో కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయ్.

- అంగీలు....లాగులు చినుగుతున్నాయ్.

- మీలో‌ సయోధ్య లేదు..ప్రజలకేం చేస్తారు.. ?

- పఠాన్ చెరు శ్రీనివాస్ నగర్ , వడ్డెర బస్తీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారం.

2020-11-22 13:47 GMT

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..

- ఓ ఛానెల్ లోగో తో బండి సంజయ్ ప్రచారం నుండి తప్పించారని అధికార పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు..

- హైదరాబాద్ లో ఎగిరిది కాషాయ జెండానే..

- 2023 తెలంగాణ లో బీజేపీ జెండా ఎగురవేస్తున్నాం..

- కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీ రావడం వల్ల అయోధ్య లో రామమందిరం నిర్మాణం చేపట్టింది..

2020-11-22 13:36 GMT

 విజయశాంతి

-ఈ రోజు టీఆరెస్ ప్రభుత్వాన్ని దింపుతామన్న ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యలు పూర్తిగా టీఆరెస్ - ఎంఐఎంల మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఓటర్లను దోఖా చేసే కుట్ర.

-ఎంఐఎం ఏడుగురి ఎమ్మెల్ల్యేలతో ప్రభుత్వానికి అవసరం లేదు... పడదు. అంటే ఎంఐఎం మతకలహాలు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోస్తామని   చెబుతున్నట్టా...?

-జీహెచ్ఎంసీ ఎన్నికలయ్యాక టీఆరెస్-ఎంఐఎంలు అవసరమైతే పొత్తు పెట్టుకు తీరుతాయి.

-అవసరం లేకున్నా కలిసే ఉంటాయి. ఆ రెండూ పార్టీలూ వీడదీయలేని సయామీ ట్విన్స్*

-బీహార్‌లో టీఆరెస్-ఎంఐఎం కలసి బలమైన ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిని ఓడగొడితే దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీలు ఇక కాంగ్రెస్ గెలవదు అన్న అభిప్రాయానికి వస్తారు.

-తద్వారా అనేక రాష్ట్రాలలో పట్టు ఏర్పరుచుకుని, పొత్తుల ద్వారా దేశమంతా వ్యాప్తి చెందాలనే ప్రయత్నం చేశారు.

-అందుకు అవసరమైన పెద్ద ఎత్తు నిధులను కూడా టీఆరెస్ అందించినట్లు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.

-అయితే ఆ ఫలితాల వల్ల తెలంగాణలోని మొత్తం మైనార్టీలు టీఆరెస్ - ఎంఐఎంలకు కూడా దూరమయ్యే దిశగా చర్చ జరుగుతుంది.

-ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు టీఆరెస్ అధినేత ఎంఐఎంతో కలసి చర్చించి, తిరిగి మైనార్టీల నమ్మకం పొందగలిగే ఎత్తుగడలో భాగంగా దేశవ్యాప్త   నేతలతో సమావేశాలు, మోడీపై యుద్ధం లాంటి నిష్ఫలమైన ప్రసంగాలు చేస్తున్నారు.

-గతంలో వీరి ఫెడరల్ ఫ్రంట్ విన్యాసాలు అందరూ చూసినవే.

2020-11-22 13:05 GMT

- పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ @గాంధీ భవన్

- ఇప్పటికి ప్రభుత్వ హోర్డింగ్స్ తొలగించలేదు..

- అవి తొలగించడానికి ఎందుకు ఆదేశాలు ఇవ్వటం లేదు..

- మీరు చేయకుంటే మేము మా కార్యకర్తలు తో తొలగిస్తాం..

- మేమేది శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించము

2020-11-22 13:03 GMT

-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి @ గాంధీ భవన్..

-స్వతహాగా నేను హైదరాబాద్ వాడిని..

-హైదరాబాద్ నగరానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే..

-ఫార్మా ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయిలో ఉందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే..

-మెట్రో రైల్,పివి హైవే ,కృష్ణా, గోదావరి జలాలు హైదరాబాద్ లో ఉన్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే..

-అసమర్థత, అవినీతికి మారుపేరు టీఆరెస్..

-వరదల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే 550 కోట్లు వరద సహాయం పేరుతో టీఆరెస్ నాయకుల జేబులోకి వెళ్లాయి..

-కరోన తో హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌజ్ లో పడుకున్నారు..

-కరోన ని ఆరోగ్యశ్రీ లో పెట్టమని చెప్తే ఇంతవరకు సమాధానం చెప్పలేదు..

-టీఆరెస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు..

-7 ఏళ్లలో నరేంద్రమోదీ ప్రభుత్వం హైదరాబాద్ కి ఎం చేసిందని ఓట్లు అడుగుతున్నారు...

-ఐటిఎం ఆర్ ప్రాజెక్టు రద్దైతే కిషన్ రెడ్డి స్పందించరు..

-అర్ధరాత్రి ఇతర పార్టీల ఇళ్లలోకి చొరబడి ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేరమని చెప్తున్నారు..

-రాష్ట్రపతి ,ఉపరాష్ట్రపతి , డిమనిటైజేషన్ కు సపోర్ట్ గా ఓటేయలేదా...?

-కాశ్మీర్ నుండి 370 రద్దు చేసినప్పుడు పార్లమెంట్ లో మద్దతు పలకలేదా...?

-ఇదే టీఆరెస్ ,బీజేపీ లాలూచీ..

-బీహార్ లో 70 సీట్లలో పోటీ చేసిన ఎంఐఎం హైదరాబాద్ లో 150 కి 40 చోట్లే ఎందుకు పోటీ చేస్తున్నారు...?

-ఆసుదుద్దీన్ ఒవైసీ అమిత్ షా ని కలిసింది వాస్తవమా కదా..?

-4 కార్పొరేట్ సీట్ల కోసం హైదరాబాద్ ప్రజల్లో మత చిచ్చు రగిల్చడం సరైంది కాదు..

-మెట్రోలో సెమి గోవర్నమెంట్ సంస్థ..మెట్రో పిల్లర్ల మీద ఒక పార్టీకి సంబంధించిన ప్రకటనలు ఎలా వేస్తారు..

-ఆర్టీసి బస్సులు,పబ్లిక్ టాయిలెట్లలో ,హోర్డింగులతో నింపేశారు..

-కుత్బుల్లాపూర్ కేటీఆర్ మీటింగ్ లో ఎల్ఈడి వ్యాన్స్ ఉపయోగించారు..

జిహెచ్ఎంసి కమిషనర్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి..

-హైదరాబాద్ లో అన్ని మతాల వారు కుటుంబ సభ్యుల వాలే కలిసి ఉంటారు..

-మతతత్వ బీజేపీని ,టీఆరెస్ ని తిరస్కరించండి..

-జిహెచ్ఎంసి ఎన్నికల కోసం సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ కోసం కన్వీనర్ గా గూడూరి నారాయణ రెడ్డి సలహాదారు గా వంశీ చంద్ రెడ్డి ఉంటారు..

2020-11-22 12:59 GMT

- రఘునందన్ రావు,దుబ్బాక ఎమ్మెల్యే

- గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ప్రారంభంకాగానే తనకు తానే ముఖ్యమంత్రిగా కేటీఆర్ కేంద్రంపై విమర్శలు చేస్తున్నాడు

- 62వేల కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి కావు ప్రజలవి

- కేంద్రం ఏమీ ఇచ్చింది అంటున్న కేటీఆర్ హైదరాబాద్ కు మీరేమి ఇచ్చిండ్లు

- చింతమడకకు లక్ష యాభై వేలు కేసీఆర్ ఇస్తే.. కేంద్రం ఎనిమిది లక్షలు ఇచ్చింది

- దేవాలయాల గురించి మాట్లాడే నైతికహక్కు తండ్రి, కొడుకులకు కాదు

- సెక్యులర్ అనే పదానికి కేటీఆర్ కు అర్ధం తెలుసా

- ఇది సిరిసిల్ల కాదు కేటీఆర్ హైదరాబాద్

- హైదరాబాద్ కు రూపాయి ఇచ్చారా...భూములు అమ్మితే వచ్చాయా

- కేసీఆర్ పాలనలో మత ఘర్షణలయ్యాయా... మోదీ పాలనలో దేశంలో మత ఘర్షణలయ్యాయి

- అరాచకం అంటేనే కేసీఆర్ కుటుంబం

- యుద్ధం అంటే ఫామ్ హౌజ్ లో సాయంత్రం గ్లాసుల చప్పుడు అనుకుంటున్నావా

- ఆరేళ్ళ నుంచి జనంలోకి రాని కేసీఆర్ యుద్ధం చేస్తాడా

- తెరాస యాక్షన్ బట్టే... బీజేపీ రియాక్షన్ ఉంటుంది

- జీహెచ్ఎంసీ ఎన్నికలను హిందూ, ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించవద్దు 

2020-11-22 12:51 GMT

డీకే అరుణ.

-దుబ్బాక లో బీజేపీ గెలిచినప్పటి నుండి కేసీఆర్ బీజేపీ అంటే బయపడుతున్నాడు...

-5 ఏండ్ల లలో జిహెచ్ఎంసి లో ఏమి చేశావని ఓట్లు అడుగుతున్నావు...

-లక్ష డబుల్ బెడ్ రూమ్ లలో జూబ్లీహిల్స్ లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ లు కట్టావో చెప్పు కేసీఆర్...

-100 రోజుల ప్రణాళిక ఏమైంది కేటీఆర్ 65 వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే రోడ్ల మీదికి ఇండ్ల లోకి నీళ్లు ఎందుకు వచ్చాయి...

-కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్ లు తప్ప ఏమీ అభివృద్ధి జరగలేదు ..

-దుబ్బాక అభివృద్ధి కావాలని బీజేపీ ని అక్కడి ప్రజలు దుబ్బాకలో బీజేపీని గెలిపించారు.

-హైదరాబాద్ ప్రజలు కూడా హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే హైదరాబాద్ లో బీజేపీ ని గెలిపించాలి...

-బీజేపీ కార్యకర్తలు అలెర్ట్ గా ఉండాలి దొంగ ఓట్లను గుర్తించాలి..

2020-11-22 12:33 GMT

  సీఎం..కేసీఆర్..

* కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

* హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు.

* ఈ నెల 23న కోర్టు విచారణ ఉన్నందున, 25 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

* రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఏ ఆస్తికి ఎంత విలువ అనేది అధికారులు నిర్ధారించారని, దాన్ని మార్చే విచక్షాణాధికారం ఎవరికీ లేదాన్నారు.

2020-11-22 11:17 GMT

 హైదరాబాద్... 

* నామినేషన్ తిరస్కరణ పై స్టే ఇచ్చిన కోర్ట్..

* కొద్దిసేపట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తో భేటీ కానున్న ఎంపీ రేవంత్ రెడ్డి .

* తీర్పు కాపీ ని కమిషనర్ కు అందజేసి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని కొనసాగెలా చర్యలు తీసుకోవాలని కొరనున్న రేవంత్

Tags:    

Similar News