Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-18 01:27 GMT

ఈరోజు పంచాంగం

మంగళవారం, 18ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చతుర్దశి(ఉ.09-34 వరకు) తదుపరి అమావాస్య; ఆశ్లేష నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి మఘ నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-28 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 06-05 నుంచి 07-39 వరకు) దుర్ముహూర్తం ( ఉ.08-17 నుంచి 09-17 వరకు తిరిగి రా,10.55 నుంచి 11.04 వరకు) రాహుకాలం (మ. 03-00 నుంచి 04-30 వరకు) సూర్యోదయం ఉ.5-46 సూర్యాస్తమయం సా.6-21

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-18 17:38 GMT

కామారెడ్డి: తెలంగాణ లో మరో ఎమ్మెల్యే కు కరోనా

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ కు కరోనా పాజిటివ్

హైదరాబాద్ లోని ఓ ప్రవైట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే

ఇటీవల రామారెడ్డి మండలం లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణిలో పాల్గొన్న ఎమ్మెల్యే

2020-08-18 16:32 GMT

రాజన్న సిరిసిల్ల జిల్లా : కాళేశ్వరం ప్రాజెక్టు లో మల్లి ఎత్తిపోతలు ప్రారంభం...

తిప్పాపూర్ పంప్ హౌస్ నుండి రెండు పంప్ లతో నీళ్లు ఎత్తిపోస్తున్న అధికారులు

ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి కొనసాగుతున్న ప్రవాహం ...

5660 క్యూసెక్కుల నీటి ఎత్తిపోస్తున్న అధికారులు.

2020-08-18 16:29 GMT

పెద్దపల్లి జిల్లా : కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతి బ్యారేజ్

8.00 pm

👉40 గేట్లు ఎత్తి 46340 క్యూసెక్కుల నీరు దిగువ గోదావరినది లోకి విడుదల.

👉 పూర్తి స్ధాయి నీటి నిల్వ సామర్థ్యం  

8.83 టిఏంసిలు

👉 ప్రస్ధుతం నీటి నిల్వ సామర్ధ్యం 7.24 టిఏంసిలు

👉 వాటర్ లేవల్ +129.0/+130.000 మీటర్లు

👉 ఎల్లంపల్లి ప్రాజెక్ట్ & స్థానిక ప్రవాహంలో ద్వారా వచ్చే ప్రవాహం 46340 క్యూసెక్కులు...

2020-08-18 16:24 GMT

జగిత్యాల జిల్లా:- గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామ శివారులో పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు...

నలుగురు వ్యక్తులు అరెస్టు 48,200ల రూపాయలు స్వాధీనం, నలుగురు వ్యక్తులు అరెస్ట్

2020-08-18 16:22 GMT

సిద్దిపేట జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ

12,13. లను తనిఖీ చేసిన నాబార్డ్ బృందం.....

మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కు రుణం ఇచ్చేందుకు ప్రాతమికంగా సుముఖత......

మల్లన్న సాగర్ పనుల పురోగతి నీ అడిగి తెలుసుకున్న బృంద సభ్యులు......

కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ని అభినందించిన నాబార్డు జనరల్ మేనేజర్ బీ.కే. మిశ్రా.....

2020-08-18 12:20 GMT

వనస్థలిపురం:

- హాకీమాబాద్ కాలనీలోని ఓ పురాతనమైన ఇంట్లో మొహమ్మద్ ఖలేముద్దీన్ అనే వ్యక్తి దారుణ హత్య

- మృతుడు పాత బస్తీకి చెందిన వ్యక్తి గా గుర్తించిన పోలీసులు

2020-08-18 12:19 GMT

జవహర్ నగర్:

- జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కౌకూర్ జనప్రియలో స్వప్న అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఐదవ అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్య .

2020-08-18 12:18 GMT

- ఎనిమిది గెట్లను ఎత్తి వరద నీరు బయటకు వదిలిన అదికారులు

- 43,144క్యూసేక్కుల నీటిని గోదావరిలోకి వదిలిన అదికారులు

- ప్రస్తుతం నీటి నిల్వ 19.0084

- పూర్తి స్థాయి నీటినిల్వ 20.175 TMC

- ఇన్ ప్లో : 51539 c/s

2020-08-18 12:16 GMT

- నాలుగు రోజుల పాటు నలుగురు నిందితులను కస్టడీలోకి కోరిన ఏసీబీ..

- కస్టడీకి అనుమతి ఇవ్వొదంటూ నిందితుల తరపు న్యాయవాది పిటిషన్..

- ఏసీబీ దాఖలు చేసిన కస్టడీ పిటీషన్ పై కౌంటర్ ధాఖలు చేస్తామన్న నిందితుల తరపు న్యాయవాది..

- రేపు కస్టడీ పై కౌంటర్ వేయనున్న నిందితుల తరపు న్యాయవాది..

- ఇరువాదనలు విన్న తరువాత కస్టడీ పిటీషన్ పై క్లారిటీ ఇవ్వనున్న ఏసీబీ కోర్ట్..

- నిందితులు నాగరాజు, శ్రీనాథ్ , ఆంజిరెడ్డి, సాయి రాజ్ లను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్న ఏసీబీ..

- నాగరాజు వచ్చిన తర్వాత ఓపెన్ చేయనున్న బ్యాంక్ లాకర్..

- కోటి 10 లక్షల రూపాయల సంబంధించి ఆదాయ పన్ను శాఖ లేఖ రాయనున్న ఏసీబీ.

2020-08-18 12:14 GMT

నాగర్ కర్నూల్ జిల్లా:

- కల్వకుర్తిలో మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి స్వగృహం వద్ద ఆయన అంత్యక్రియలు ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

- సంతాపం తెలిపిన ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, లక్ష్మారెడ్డి, అంజయ్య యాదవ్, ఎంపీ. రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి.

Tags:    

Similar News