Live Updates: ఈరోజు (16 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-16 01:05 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 16 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | అమావాస్య రా.01-56 వరకు తదుపరి పాడ్యమి | హస్త నక్షత్రం సా.04-01 వరకు తదుపరి చిత్త | వర్జ్యం: రా.11-28 నుంచి 12-57 వరకు | అమృత ఘడియలు ఉ.10-24 నుంచి 11-35 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: మ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-16 06:13 GMT

 దుబ్బాక మండలం రామక్క పేట లో అభ్యర్థి సోలిపేట సుజాత ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు

 మంత్రి హరీశ్ రావు కామెంట్స్: ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేయని పార్టీ కాంగ్రెస్

- బీజేపీకి ఉన్నదే ఒక్క ఎమ్మెల్యే. ఆ పార్టీతో ఏమవుతుంది.

- ప్రతీ ఇంటికీ తాగు నీరు, ప్రతీ ఇంటికి సాగు నీరు ఇస్తాం.

- తెలంగాణలో నీటి గోస తీర్చింది తెరాస,కేసీఆర్, కారు గుర్తే.

- ఏడాదిలోగా ప్రతీ ఎకరానికి సాగు నీరు ఇస్తుంది.

- బీజేపీది సోషల్ మీడియాకు ఎక్కువ....పనికి తక్కువ.

- కాంగ్రెస్, బీజేపీలు ఎక్కడైనా పెన్షన్ 2 వేలు ఇస్తున్నారా, పేదింటి ఆడపిల్లకు పది వేలయినా ఇచ్చారా.?

- ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీలు అర చేతిలోవైకుంఠం చూపిస్తున్నారు.

2020-10-16 06:05 GMT

బ్రేకింగ్...

- కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు మృతి పై కస్తోడియల్ డెత్ గా కేస్ నమోదు చేసిన డబీర్ పురా పోలీసులు..

- రెండు నెలల నుండి చంచల్గుడా జైల్ లో రిమాండ్ ఖైదీ గా ఉండి జైల్ లో నే మృతి చెందటంతో 176 సీఆర్పిసి కింద కేసు నమోదు చేసిన డబీర్ పురా పోలీసులు..

- ఆత్మహత్య కు పాల్పడే ముందు రోజు నాగరాజు ప్రవర్తన పై మిగతా ఖైదీల నుండి వివరాలు సేకరించిన పోలీసులు..

- జైల్ అధికారుల స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేయనున్న పోలీసులు... ని 

- ఇప్పటికే ఎఫ్ ఎస్ ఎల్ కు నాగరాజు నమూనాలు...

- ఫోరెన్సిక్ నివేదిక రాగానే హైదరాబాద్ కలెక్టర్ తో పాటు ఎన్ హెచ్ అర్శి కి కస్తొడియల్ డెత్ పై నివేదిక అందించనున్న అధికారులు...

2020-10-16 05:58 GMT

బ్రేకింగ్...

హైదరాబాద్: ఖమ్మం మైనర్ బాలిక ఘటనలో పోలీసుల ఓవర్ యాక్షన్..

- కుటుంబ సభ్యులు లేకుండానే ఇంత పోస్టుమార్టం పూర్తి చేసి హుటాహుటిన ఉస్మానియా మార్చి నుంచి నుంచి బాలిక మృతదేహం తరలింపు..

- హుటాహుటిన పోస్ట్ మార్టం పూర్తి చేసిన వైద్యులు..

- బంధువులు లేకుండానే పోస్ట్ మార్టం చేసి, టైం కి సంతకం పెట్టించి పంపిచేసిన పోలీసులు..

- మీడియా అడిగితే లోపల పోస్ట్ మార్టం నడుస్తుంది అని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన పోలీసులు..

- పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు..

- ఖమ్మం జిల్లాలో మైనర్ బాలిక అంత్యక్రియలు..

2020-10-16 05:55 GMT

నల్గొండ :

- 20క్రస్టుగేట్లు 25 ఫీట్ల మేర ఎత్తివేత

- ఇన్ ఫ్లో :7,22,504 క్యూసెక్కులు.

- అవుట్ ఫ్లో :7,22,504 క్యూసెక్కులు.

- పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

- ప్రస్తుత నీటి నిల్వ : 310.5510 టీఎంసీలు.

- పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.

- ప్రస్తుత నీటిమట్టం: 589.50అడుగులు

2020-10-16 05:48 GMT

హైదరాబాద్...

- వనస్థలిపురం లో కాలనీ వాసుల మధ్య చిచ్చు పెట్టిన వరద నీరు...

- అర్ధరాత్రి హరిహరపురం కాలనీ లో ఉన్న నీటిని వెళ్లడానికి జేసీబీ లతో కాలువలకు గండి కొట్టేందుకు ప్రయత్నించిన కాలనీ వాసులు

- తమకు నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని అడ్డుకునే ప్రయత్నం చేసిన గాంధీ నగర్ ,స్నేహమయి నగర్ కాలనీ వాసులు

- అడ్డుకుంటున్నారనే కోపంతో కర్రలతో దాడి చేసిన హరిహారపురం వాసులు..

- ఇద్దరికి తీవ్రమైన గాయాలు హాస్పిటల్ కు తరలింపు...

- హరిహారపురం కాలనీ ప్రేసిడెంట్ హనుమంత రెడ్డి తో పాటు నలుగురి పై కేసు నమోదు...

Tags:    

Similar News