Live Updates:ఈరోజు (ఆగస్ట్-16) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-16 01:13 GMT
Live Updates - Page 2
2020-08-16 07:51 GMT

కడపలో కరోనాకు మందు!

కడప: కరోనాకు మందు కనుగొన్నట్లు ప్రకటించిన కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన డాక్టర్ బాలశివ యోగీంద్ర మహరాజ్

కరోనాకు అనుభవ వైద్యం ద్వారా కొత్త మందు పశుపథం ను కనుగొన్నట్లు ప్రకటించిన యోగీంద్ర మహరాజ్...

ఆయుష్ మంత్రిత్వశాఖ నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేస్తున్నతుట్లు ప్రకటించిన బాల శివ యోగీంద్ర...

కొండ గోగు చెట్టు నుంచి ఈ పశుపథం ఔషధం తయారు చేశానని ప్రకటన...

ఇది వరకు షుగర్, గుండె జబ్బులకు కనుగొన్న మందులకు 1990లో అనుమతి తీసుకున్నట్లు తెలిపిన బాల శివ యోగీంద్ర.  

2020-08-16 07:49 GMT

మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి శతజయంతి వేడుకలు

కడప: వేంపల్లి లో మాజీ సీఎం స్వాతంత్య్ర‌ సమరయోధుడు కోట్ల విజయభాస్కరరెడ్డి శతజయంతి వేడుకలు...

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కామెంట్స్

రైతుగా , క్రీడాకారుడు గా , రాజకీయ నాయకుడిగా , పరిపాలన దక్షునిగా కోట్ల బహుముఖ ప్రజ్ఞాశాలి

నీతికి నిజాయితీకి నిలువటద్దం కోట్ల

అరు సార్లు ఎంపిగా,ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు జడ్పీ చైర్మన్ గా ఎన్నికవ్వడం కోట్లకే చెల్లింది

నేటి తరం రాజకీయ నాయకులు కోట్లను అదర్శంగా తీసుకొవాలి

2020-08-16 07:20 GMT

ప్రకాశం బ్యారేజ్ కి పోటెత్తుతున్న వరద

బ్రేకింగ్: ప్రకాశం బ్యారేజ్ లో గంటగంటకూ పెరుగుతున్న నీటి ప్రవాహం

పరుగులు పెడుతూ దూసుకొస్తున్న కృష్ణమ్మ

ఇన్ ఫ్లో 1 ,20 ,000 క్యూసెక్కులు

అవుట్ ఫ్లో 1 ,12 ,000 క్యూసెక్కులు

ఈ సాయంత్రానికి 1 ,50 ,000 క్యూసెక్కుల వరద రావచ్చని అంచనా

2020-08-16 01:38 GMT

బంగాళాఖాతంలో వాయు గుండం

విశాఖ:

- వెదర్ అప్ డేట్.

- బంగాళాఖాతంలో వాయు గుండం

- ఆదివారం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచిఅతి భారీ వర్షాలు కురిసే అవకాశం...

- ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వాతావరణ శాఖ

2020-08-16 01:37 GMT

పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి మాతృ వియోగం..

అమరావతి:

- పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ (84) ఆదివారం తెల్లవారు జామున కన్ను మూశారు...

- సుమారు గత నెల రోజులుగా ఆనారోగ్యంతో ఉన్న ఆమె విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు...

- ఆమెకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం...

- మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమరుడు కాగా రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు..

- విజయనగరంలోని స్వర్ఘధామంలో ఆమె అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నాం నిర్వహించనున్నారు...

2020-08-16 01:36 GMT

నేటి నుంచి అరసవల్లి సూర్య ఆలయం తాత్కాలిక మూసివేత..

శ్రీకాకుళం జిల్లా:

- ఈనెల 31 వరకు భక్తులకు అనుమతి నిరాకరణ..

- కరోనా తీవ్రత దృష్ట్యా మరో రెండు వారాలు పాటు దేవాలయంలో దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించిన అధికారులు..

- జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్న ఆలయ అధికారులు..

2020-08-16 01:36 GMT

విశాఖ ఏజేన్సీ లో భారీ వర్షాలు..

విశాఖ:

- సీలేరు జలాశయం కు భారీగా వరద నీరు.

- రైవాడ రిజ్వాయర్ నుండి 6 వేల క్యూసెక్కుల నీరు విడుదల ..

- దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

2020-08-16 01:35 GMT

జిల్లాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ..

శ్రీకాకుళం జిల్లా:

- జిల్లాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ..

- ఇప్పటి వరకు 14,006 కరోనా కేసులు నమోదు..

- ప్రస్తుతం జిల్లాలో 4,988 ఆక్టీవ్ కేసులు..161 మరణాలు..

2020-08-16 01:35 GMT

గోదావరికి పోటెత్తుతోన్న వరద నీరు..

తూర్పుగోదావరి :

- గోదావరికి పోటెత్తుతోన్న వరద నీరు.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగుతోన్న రెండవ ప్రమాద హెచ్చరిక..

- బ్యారేజ్ వద్ద 14.40 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం..

- ధవలేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల ద్వారా 13 లక్షల 78 క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తోన్న ఇరిగేషన్ అధికారులు..

- ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద..

- కోనసీమలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఉపనదులు గౌతమీ, వృధ్ధ గౌతమీ, వశిష్ట, వైనతేయ..

- జలదిగ్భంధంలో దేవిపట్నం లంక గ్రామాలు, సహాయ పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు..

- దేవిపట్నం మండలంలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపిన అధికారులు..

- వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకాధికారులను నియమించిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి..

2020-08-16 01:34 GMT

ఏజన్సీ ని ముంచెత్తుతోన్న వరద నీరు..

తూర్పుగోదావరి:

- చింతూరు మండలంలో 30 వ నెంబర్ జాతీయ రహదారి పై భారీగా చేరిన వరద నీరు.

- ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు నిలిచిపోయిన రాకపోకలు..

- వరద పోటెత్తడం తో చింతూరు మండలం కుయుగురు, కల్లేరు, సోకిలేరు, చట్టి, ఒడ్డు, నర్సింహపురం, గ్రామాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు..

- కూనవరం, వి.ఆర్.పురం మండలాల్లో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న శబరి, గోదావరి నదులు..

- లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.

- కూనవరం ని చుట్టుముట్టిన శబరి గోదావరి నదులు..

- జలదిగ్బంధంలో టేకులబోరు, కొండరాజుపేట, శబరికొత్తగూడెం, పోలిపాక, మురుమురు, దూగుట్ట గ్రామాలు.

- కూనవరం పోలీస్ గ్రౌండ్, ఉదయభాస్కర కాలనీ, గిన్నెల బజారుని ముంచెత్తిన వరద నీరు..

- అర్ధరాత్రి నుంచి సహాయక చర్యలు చేపట్టిన, పోలీస్, రెవెన్యూ యంత్రాంగం..

- 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న నదులు..

Tags:    

Similar News