Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-14 01:43 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 14 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం దశమి(ఉ. 10-29 వరకు) తదుపరి ఏకాదశి ; మృగశిర నక్షత్రం (తె. 04-27 వరకు) తదుపరి ఆర్ద్ర నక్షత్రం, అమృత ఘడియలు (రా.07-09 నుంచి 08-50 వరకు), వర్జ్యం (ఉ.0 9-00 నుంచి 10-42 వరకు) దుర్ముహూర్తం (ఉ. 08-17 నుంచి 09-08 వరకు తిరిగి మ. 12-30 నుంచి 01-20 వరకు) రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-24

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-14 16:42 GMT

అంతకంతకూ పెరుగుతున్న వరద నీటిమట్టం

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద

10.10 అడుగులకు చేరిన వరద నీటి మట్టం

రేపు ఉదయానికి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద

బ్యారేజ్ నుంచి 175 గేట్ల ద్వారా 8 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి విడుదల

వరద భయంలో కోనసీమలోని లంక గ్రామాలు

జలదిగ్భంధంలో దేవీపట్నం మండలం

38 గ్రామాలు జలదిగ్బంధం, నిలిచిపోయిన రాకపోకలు.

వరద సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం.

జిల్లా అంతటా భారీ వర్షాలు

2020-08-14 16:34 GMT

తూర్పు గోదావరి: పిఠాపురం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ కు చెందిన సముద్రంలో గల్లంతైన బోట్ ఆచూకీ లభ్యం..

బంగాళాఖాతంలో గల్లంతయిన మత్స్యకారులు క్షేమం..

అల్పపీడనం కారణంగా గాలి వాటానికి విశాఖ తీరానికి చేరుకున్న బోటు.

సెల్ ఫోన్ ద్వారా తమ బంధువులకు సమాచారం ఇచ్చిన మత్స్యకారులు.

 మరి కాసేపట్లో విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చేరనున్న మత్య్సకారులు 

ఈ నెల 11న వేటకు వెళ్లి గల్లంతు అయిన నలుగురు మత్య్సకారులు 

వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టిన  అధికారులు

ఎట్టకేలకు మత్స్యకారుల ఆచూకీ లభ్యం కావడంతో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం. 

మత్స్యకారుల క్షేమ సంచారం తో ఊపిరి పీల్చుకున్న వారి బంధువులు.

గాలింపు చర్యలలో సహకరించిన అధికారులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన పెండెం దొరబాబు శాసన సభ్యులు , పిఠాపురం

2020-08-14 16:03 GMT

- చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలసుబ్రమణ్యం ఫోటో ని ట్విట్టర్ లో పెట్టిన సినీ నటుడు మనోబాల

- ఐసీయూ కి వెళ్లిన తర్వాత లేటెస్ట్ ఫోటోని పోస్ట్ చేసిన మనోబాల

- ఆక్సిజన్ మాస్క్ తో కనిపిస్తున్న బాలు

- తాను బాగానే ఉన్నట్టుగా అభిమానులకు చేయి చూపుతూ సంకేతాన్ని చూపుతున్న బాలు

- బాలు పరిస్థితి ఆందోళనకరమని ఎంజీఎం ఆసుపత్రి బులెటిన్ రిలీజ్ చేయడంతో ఆందోళనతో ఉన్న బాలు అభిమానులు


2020-08-14 12:34 GMT

తూర్పుగోదావరి:

- అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెం లో ఇంటి గోడ కూలి ఐదేళ్ల బాలిక మృతి

2020-08-14 12:33 GMT

గుంటూరు:

- రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన పాలెం లో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య,

- పొలంలోనే చెట్టుకు ఉపివేసుకున్న రైతు సగిలి కోటిరెడ్డి.

2020-08-14 12:33 GMT

విజయవాడ:

- ఈకేసుకు నాకూ ఎటువంటి సంబంధం లేదు

- విచారణలో పోలీసులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు

- 6 గంలట పాటు కొనసాగిన సుధీర్ఘ విచారణ

2020-08-14 12:32 GMT

జాతీయం:

- కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కరోనా నెగిటివ్

- త్వరలోనే హాస్పటల్ నుండి డిశ్ఛార్జ్

2020-08-14 11:48 GMT

విజయవాడ:

- రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాద ఘటనపై డా.మమతను 6గంటలుగా విచారిస్తున్న పోలీసుల

- మృతుల బంధువుల ఆరోపణల నేపథ్యంలో అధిక ఫీజుల వసూలుపై డా.మమతను ప్రశ్నిస్తున్న పోలీసులు

- కోవిడ్ కేర్ సెంటర్ ఫీజ్ స్ట్రక్చర్ పై కొనసాగుతున్న సుదీర్ఘ విచారణ

2020-08-14 11:47 GMT

అమరావతి:

Mlc గా ప్రమాణ స్వీకారం చేసిన పండు ల రవీంద్ర బాబు

◆ గవర్నర్ కోటలో ఎంఎల్సీ గా ఎనికైయ్యాను..

◆ నాకు ఎంఎల్సీ గా అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నా తరుపున, నా కుటుంభం సభ్యుల తరుపున ,నా నియోజకవర్గ ప్రజల తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు..

◆ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే, మాట తప్పరు..

◆ నాకు ఎంఎల్సీ గా అవకాశం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం క్రితం మాట ఇచ్చారు...

◆ జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకొరని ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేశారు..

◆ కానీ గవర్నర్ కోటాలో ఎంఎల్సీ గా ఉన్నత విద్యావంతుడనైన నాకు అవకాశం కల్పించారు...

◆ ఎంఎల్సీ గా అవకాశం కల్పించినందుకు నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాను...

◆ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నామీద పెట్టిన నమ్మకాన్ని శాసనమండలి లో లోపల, అదేవిదంగా బయట నిలబెట్టుకుంటాను.

2020-08-14 11:15 GMT

గుంటూరు:

- పొందుగల పాత బ్రిడ్జి మీద యాక్సిడెంట్స్

- తెలంగాణ వాడపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి

Tags:    

Similar News