Live Updates: ఈరోజు (12 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-12 01:15 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 12 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | దశమి ఉ.11-15 వరకు తదుపరి ఏకాదశి | ఆశ్లేష నక్షత్రం రా.08-43 వరకు తదుపరి మఘ | వర్జ్యం: ఉ.09-41నుంచి 11-15 వరకు | అమృత ఘడియలు రా.07-08 నుంచి 09-25 వరకు | దుర్ముహూర్తం: ఉ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ.02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-12 16:01 GMT

విజయనగరం జిల్లా...

-బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌...

-భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉండ‌టంతో, అన్ని ర‌కాల‌ ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశాలు..

-ప‌శ్చిమ వాయువ్య దిశ‌లో క‌దులుతూ 13వ తేదీ ఉద‌యం కాకినాడ వ‌ద్ద‌ తీరాన్ని తాకే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ నుంచి హెచ్చ‌రిక‌లు అందాయి..

-మ‌త్స్య‌కారులు స‌ముద్రంలో చేప‌ల‌వేట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేయటం జరిగింది..

-మ‌త్స్య‌కార గ్రామాల్లో దండోరా వేయించ‌డంతోపాటు, స‌చివాల‌య సిబ్బందిని కూడా అప్ర‌మ‌త్తం చేశాం..

pతీర‌ప్రాంత మండ‌లాలైన భోగాపురంలో కంట్రోల్ రూము(8074400947), పూస‌పాటిరేగ‌లో (7036763036) కంట్రోలు రూముల‌ను ఏర్పాటు చేయడం జరిగింది..

2020-10-12 15:54 GMT

విశాఖ..

-మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కామెంట్స్

-రైతు సంక్షేమ కోరుతున్నాము అన్న జగన్ ప్రభుత్వం రాజధాని రైతులకు చేస్తున్నది అన్యాయం కాదా.?

-మహిళా రైతులను బూటు కాళ్లు తో తన్నటం ఇది ఎక్కడి నాయ్యం

-ఇప్పటికి రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అటున్న బొత్స కు కనీసం విజ్ఞత ఉందా

-విశాఖ ఎంపీ కి రాజీనామ చేయండి అమరావతి రాజధానా? విశాఖ రాజధానా? అని ఎన్నికలకు వెళ్దాం.

-మీరు గెలిస్తే విశాఖ రాజధాని..మేము గెలిస్తే అమరావతి రాజధాని అని సవాల్ చేసిన అయ్యన్న

2020-10-12 15:45 GMT

తూ. గో.జిల్లా*

పెద్దాపురం*

-భారీ వర్షాలకు పెద్దాపురం మెయిన్ రోడ్ లో కుప్పకూలిన పాత మున్సిపల్ కాంప్లెక్స్ లో రెండు షాప్ లు

-మున్సిపల్ అధికారులు నోటీస్లు ఇచ్చినప్పటికీ ఖాళీ చేయని 16 షాప్ ల యజమానులు

-పెద్దాపురం సోమవారం సెలవు కావడంతో అన్ని షాప్ లు మూసివేసి ఉండటంతో తప్పిన ప్రమాదం

-సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ , అగ్నిమాక సిబ్బంది

2020-10-12 03:44 GMT

విశాఖ జిల్లా...

-గాజువాక మండలం ములగాడ గణపతినగరం లో విషాదం

-భారి వర్షానికి రిటైనింగ్ వాల్ విరిగిపడి ఇంటి గోడలు కూలిపోయాయి

-ఇంటిలో నివాసముంటున్న రామలక్ష్మి అనే గర్బిణి మృతి

-నిద్రపోతున్న కుమారుడు జ్ఞానేశ్వర్( 3)మృతి మృతురాలి తల్లికి ,భర్తకు గాయాలు. హాస్పిటల్ కు తరలింపు

-నిన్న కురిసి బారి వర్షానికీ గణపతినగరం లో ఇంటిగోడ కూలి గర్భిణీ స్రి తో పాటు బిడ్డ అక్కడిఅక్కడె మృతి చెందరు ..

2020-10-12 03:42 GMT

తూర్పుగోదావరి..

-వాయుగుండం ప్రభావంతో కాకినాడ‌ యాంకరేజ్ పోర్టుకు వచ్చిన 13 అంతర్జాతీయ నౌకల నుంచి ఎగమతులు, దిగుమతులు నిలిపివేత..

-తుపాన్ సమయంలో సురక్షితంగా ఉండేందుకు

-13 అంతర్జాతీయ వెసెల్స్ ను యాంకరేజ్ పోర్ట్ నుంచి సముద్రంలోకి తీసుకెళ్లాలని సూచించిన పోర్ట్ అధికారులు..

2020-10-12 03:35 GMT

అమరావతి...

-రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ప్రజలు చేస్తోన్న  ఉద్యమానికి 300 రోజులు.

-ఉద్యమంలో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యారు.

-అయినా సరే ప్రభుత్వం నుంచి భూములిచ్చిన రైతులకు ఊరట కలిగించే ఒక్కమాట రాలేదు. పాలకుల అహంకారం

-ఆస్థాయిలో ఉండటం దారుణం (1/2) 

#300DaysForOneCapital

-రాజధాని అమరావతిని కాపాడుకునేంత వరకు తెలుగుదేశం రైతులకు అండగా ఉంటుంది.

-సోమవారం ఉద్యమానికి 300 రోజులు అయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిర్వహించే నిరసన కార్యక్రమాలలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొని మద్దతుగా   నిలవండి.

-ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినదించండి(2/2)

2020-10-12 03:32 GMT

తిరుమల...

-తెలుగు అకాడమీకి తిరుపతిలో టీటీడీ భవనాన్ని మంజూరు చేసింది.

-తెలుగు, సంస్క్రత అకాడమీల బాధ్యతలు నాకు అప్పగించడం చాలా సంతోషం.

-జగన్ పరిపాలనపై పేద వర్గాలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

-సీఎం జగన్ చుట్టూ కమ్ముకున్న అన్యాయ వ్యవస్థల నుండి ఆయనకు రక్షణ కల్పించాలని శ్రీవారిని ప్రార్థించా

-లక్ష్మీ పార్వతి, తెలుగు అకాడమీ చైర్ పర్సన్

2020-10-12 02:10 GMT

విశాఖ...

-పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి విశాఖపట్నం కు ఆగ్నేయ దిశగా 330 km, కాకినాడ కు తూర్పు ఆగ్నేయ దిశగా 370 km, నర్సాపూర్ కు తూర్పు ఆగ్నేయ     దిశగా 400 km దూరంలో కేంద్రీకృతం

-రాగల 24 గంటలలో ఇది తీవ్ర వాయుగుండముగా మారే అవకాశం

-ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి నర్సాపూర్ మరియు విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం

Tags:    

Similar News