Live Updates: ఈరోజు (సెప్టెంబర్-08) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-08 01:11 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 08 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | షష్ఠి (రా. 8-01 వరకు) తదుపరి సప్తమి | భరణి (ఉ. 6-18 వరకు) తదుపరి కృత్తిక | అమృత ఘడియలు లేవు | వర్జ్యం (రాత్రి 7-26 నుంచి 9-11 వరకు) | దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-06 వరకు తిరిగి రాత్రి 10-48 నుంచి 11-35 వరకు) | రాహుకాలం (సా. 3-00 నుంచి 4-30 వరకు) | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-07

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-08 16:08 GMT

హైదరాబాద్ లో రెండవ రోజు మెట్రో రైల్ సేవలు

నాగోల్ రాయదుర్గ్ కారిడార్ లో ప్రారంభం అయిన మెట్రో రైళ్లు

మెట్రోరైలు లో ప్రయాణం చేసిన 27 వేల మంది ప్రయాణికులు

రేపటి నుంచి అన్ని రూట్లలో ప్రారంభం కానున్న మెట్రో రైలు సేవలు

2020-09-08 15:17 GMT

అమరావతి

- ఏపీలో ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ

- బాపట్ల హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్‌ జనరల్‌గా జేఎస్వీ ప్రసాద్

- గిరిజాశంకర్‌కు ఎండోమెంట్‌ అదనపు బాధ్యతలు

- నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా ఎంఎన్‌.హరేంద్రియ ప్రసాద్

- నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌గా కె.దినేష్‌ కుమార్

- తెనాలి సబ్‌ కలెక్టర్‌గా మయూర్ అశోక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

2020-09-08 15:16 GMT

కర్నూలు జిల్లా:

- ఈ రాగి రేకు పై తామ్ర శాసనం పై దేవ నాగరి లిపి చెక్కబడి ఉందని తెలిపిన ఈ వో రామారావు

- నిన్న జరిగిన పునర్నిర్మాణ పనుల్లో ఇప్పటికే బయటపడిన 28 రాగిరేకులు

- పురావస్తు శాఖలో ఇదివరకు డైరెక్టర్ గా పనిచేసిన స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ డీన్ ప్రొఫెసర్ చెన్నారెడ్డితో రాగి రేకు పరిశీలన

- రేపు గంటా మఠం పునర్నిర్మాణం పనులలో ఇప్పటివరకు బయటపడిన 29 రాగిరేకుల పై పరిశీలించనున్న పురావస్తు శాఖ నిపుణులు

2020-09-08 15:15 GMT

కర్నూలు జిల్లా:

- ఈ రాగి రేకు పై తామ్ర శాసనం పై దేవ నాగరి లిపి చెక్కబడి ఉందని తెలిపిన ఈ వో రామారావు

- నిన్న జరిగిన పునర్నిర్మాణ పనుల్లో ఇప్పటికే బయటపడిన 28 రాగిరేకులు

- పురావస్తు శాఖలో ఇదివరకు డైరెక్టర్ గా పనిచేసిన స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ డీన్ ప్రొఫెసర్ చెన్నారెడ్డితో రాగి రేకు పరిశీలన

- రేపు గంటా మఠం పునర్నిర్మాణం పనులలో ఇప్పటివరకు బయటపడిన 29 రాగిరేకుల పై పరిశీలించనున్న పురావస్తు శాఖ నిపుణులు

2020-09-08 12:30 GMT

-రాజ్ గోపాల్ రెడ్డి.... కాంగ్రెస్ ఎమ్మెల్యే.

-మాజీ ప్రధాని పీవీ గురించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే అధికార పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.

-సీఎల్పీ నేతకు 6 నిమిశాలు మాత్రమే మాట్లాడే అవకాశం ఇవ్వడం ఏమిటీ...?

-ప్రతిపక్షాల మాట్లాడకుండా అడ్డుకొని ప్రభుత్వం గొంతునొక్కే ప్రయత్నం చేస్తోంది.

-ఎమ్మెల్యేలకు ప్రజాసమస్యల పై చరించించడానికిసీఎం బయట కలువడు..అసెంబ్లీ లో మాట్లానివ్వడు.

-అసెంబ్లీ ని కూడా ... ఫేమ్ హౌస్ లో పెట్టుకోండి.

2020-09-08 11:40 GMT

-సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోవడం పై అసంతృప్తి

-పీవీ పై కాంగ్రెస్ నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

-స్పీకర్ లేకపోవడంతో వెనుదిరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

2020-09-08 11:37 GMT

తెలంగాణ శాసన మండలిలో మంత్రి నిరంజన్ రెడ్డి...

# హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో విద్యార్థిగా పివి చురుగ్గా పాల్గోన్నారు

# ముల్కి నిబంధనలను స్వాగతిస్తే పివిని సీఎం పదవి నుంచి దించిన ఘనత ఆనాటి రాజకీయలది...ఆ పార్టీది

# జైళ్ల శాఖలో సంస్కరణలు తీసుకువచ్చారు పివి ...ఓపెన్ జైల్ సిస్టమ్ ను పివి తీసుకువచ్చారు

# నవోదయ విద్యాలయాలను తీసుకువచ్చారు పివి

# పివికి భారత రత్న ఇవ్వడం సముచితం

# భారత దేశ కాలం సృష్టించిన నాయకుడు పివి

2020-09-08 11:29 GMT

-ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర మంత్రి..

-మా నాన్నగారి రాజకీయంగా ఎదిగేందుకు ఆయన ఎంతో ప్రోత్సహించారు..

-ఆయనను ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను..

-ఆయన ప్రోద్బలంతో నేను ఈ స్థాయికి ఎదిగాను

-పివి తీసుకోచిన్న సంస్కరణల వల్ల మా సొంత భూములు కూడా పేదలకు పంచినము..

-పరిపాలన వ్యవహారంలోకి కుటుంబ సభ్యులను దూరంగా పెట్టేవాడు

-పీవీకి భారతరత్న ఇవ్వాలి..

-పివి బాటలోనే కెసిఆర్ నడుస్తున్నాడు

2020-09-08 10:51 GMT

టీఎస్ హైకోర్టు.....

-ఉస్మానియా ఆసుపత్రి గూగుల్ మ్యాప్, ప్లాట్ లే అవుట్ కాపీలను కోర్టుకు సమర్పించిన అడ్వొకేట్ జనరల్...

-పిటీషనర్ల కు మాత్రం ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్ లను ఇవ్వలేదని కోర్టుకు తెలిపిన పిటీషనర్లు...

-ఉస్మానియా ఆసుపత్రి ని హెరిటేజ్ భవనం దానిని కూల్చివేయెద్దని కోర్టుకు తెలిపిన పిటీషనర్లు..

-పురాతన కట్టడం కనుక పక్కన ఉన్న స్థలంలో కట్టుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసిన హైకోర్టు..

-గూగుల్ మ్యాప్, ప్లాట్ లే అవుట్ ను పరీశీలించి వాదనలు వినిపిసస్తామన్న పిటీషనర్లు..

-తదుపరి విచారణను ఈ నెల 24 కు వాయిదా వేసిన హైకోర్టు.

-శాసనమండలి రేపు ఉదయం 10 గంటలకు వాయిదా.

2020-09-08 10:48 GMT

నర్సిరెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీ

-ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు పేదలకు అందట్లేదు

-అమెరికా ఎత్తుగడలను అంచనా వేయడంలో విఫలం ఎక్కడో పొరపాటు జరిగింది

-ఇప్పటి వరకు భారతరత్న వచ్చిన వ్యక్తులు తో పోల్చుకుంటే పీవీకి ఎప్పుడో భారతరత్న రావాలి

-పీవీకి భారతరత్న కేంద్రమే గుర్తించి ఇవ్వాలి మనం ఈరోజు ఇలా అడగాల్సి రావడం బాధాకరం.

-పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానానికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా.

Tags:    

Similar News