Live Updates: ఈరోజు (07 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-07 01:15 GMT
Live Updates - Page 2
2020-10-07 09:49 GMT

Shabbir Ali: ఆరేండ్ల కేసీఆర్ పాల‌న‌లో 3 ల‌క్ష‌ల కోట్ల అప్పు: ష‌బ్బీర్ అలీ

మెదక్: షబ్బీర్ అలి కామెంట్స్....

👉ఎఫెక్స్ కమిటీలొ పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడని కేసీఆర్. కాలేశ్వరం గురించి గొప్పలు చెప్పుకుంటున్నడు..

👉 సిద్దిపేట పక్కనే ఉన్న దుబ్బాకను ఎనాడు పట్టించుకోకుండా, నేడు హరీష్ రావు నాకు దుబ్బాక సిద్దిపేట రెండు కండ్లు అని ప్రచారం చెస్తున్నారు..

👉ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలేదు.. సొనియాగాంది తెలంగాణ విద్యార్థుల ఆత్మబలిదానాలు అపడంకొసం అన్ని పార్టీ లను ఓప్పించి తెలంగాణ ప్రకటించారు..

👉 16 మంది ముఖ్యమంత్రులు పాలించి 60 కొట్లు అప్పుచేస్తే 6 సంవత్సరాల KCR పాలనలొ 3లక్షల కోట్ల అప్పు చెశాడు..

2020-10-07 09:44 GMT

Ponnala Lakshmaiah: రామ‌లింగా రెడ్డి ఏలాంటి అభివృద్ది చేయ‌లేదు: పోన్నాల‌

మెదక్: పొన్నాల లక్ష్మయ్య కామెంట్స్...

👉12  యేండ్లు  ఎమ్మెల్యేగా ఉండి రామలింగారెడ్డి దుబ్బాక లొ ఎలాంటి అబివృద్ది చెయలేదు..

👉భారతదేశంలొ వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్తాయికి తీసుకువెల్లింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే..

👉 చెతగాని మాటలు చేప్పి KCR అదికారంలొకి వచ్చాడు 30 శాతం మంది కౌలు రైతులకు ఎలాంటి లాబంలేదు

👉 రైతులకు రుణమాఫీ జరగలేదు kcr పాలనలొ రైతులకు పంటనష్టం డబ్బులు రాలేదు

👉 నియంత్రిత సాగు చేయించి మక్కజొన్న పత్తి రైతులకు అన్యాయం చెశారు..

👉తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలను కలవడు వారి బాగొగులు చూడడు

👉 దేశంలో పేద్ద అవినీతి పరుడు kcr. మిషన్ భగీరథ.. సాగునీటి ప్రాజెక్టుల అవినీతి లొ జైలు పాలు కాకతప్పదు

👉 దుబ్బాక ఉప ఎన్నికలలొ కాంగ్రెస్ గెలుపు ద్వారా kcr చెంపపేట్టు కావాలి

2020-10-07 09:39 GMT

CM KCR: కెసిఆర్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు: వి. హ‌నుమంత రావు

సిద్దిపేట: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు మీడియా సమావేశం.

హనుమంత రావు కామెంట్స్:

👉ప్రభుత్వ వైఫల్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి దుబ్బక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం..

👉ఉప పోరులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం సమిష్టిగా కృషి చేస్తాం.

👉ఎల్ ఆర్ ఎస్ పేరుతో పేదల డబ్బులను ప్రభుత్వం దోచుకుంటుంది..

👉సీఎం కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చ లేదు...

2020-10-07 09:33 GMT

MLA Harish Rao: చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డ హరీష్ రావు

మంత్రి హరీష్ రావు కామెంట్స్;

👉టికేట్ ఇస్తే జై కొట్టుడా..లేకుంటే నై అనుడా..టిఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి జరుగుతుంది..

👉కెసిఆర్ వచ్చిన తర్వాత వృద్ధులకు, వితంతువులకు , రెండు వేల పింఛన్ బీడీకార్మికులకు భృతి ఇస్తున్నాo. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడపిల్ల పెళ్ళికి లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నాం..

👉ఆసుపత్రికి పోతే కెసిఆర్ కి కిట్ ఇస్తున్నాం.. నిన్నటి వరకు కేసీఆర్ , హరీష్ రావు జై అని పాటలు పెట్టి తిరిగిండు..

👉 టికెట్ ఇవ్వకపోతే పార్టీలు మారడం ఇంత కంటే అన్యాయం ఉంటదా.. టికెట్ ఇస్తే మంచోళ్ళు.. టికెట్ ఇవ్వకపోతే చెడ్డ వాళ్ళమా...

👉ఓపిక పడితే మంచి స్థాయి కల్పిస్తామని చెప్పిన వినలేదు...

👉 గ్రామంలో ఖాళీ స్థలం ఉండేవాళ్ళకి త్వరలోనే ఇల్లు కట్టించే బాధ్యత మాదే..

👉 మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో లక్ష ఇళ్లకు బిల్లును ప్రవేశపెట్టినం..

👉కరోనా రావడం వల్ల ఆలస్యం జరిగింది త్వరలోనే అమలు చేస్తాం

👉 ఎవరైతే గ్రామంలో నిరుపేదలు ఉన్నారో వారికి కూడా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తాం..

👉కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు తప్ప ఏమి రాదు వారి పోరాటం డిపాజిట్ల కోసమే...

👉 టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాగానే గొల్లకుర్మలకు గొర్రెలను పంపిణి కార్యక్రమం. ముదిరాజులకు బెస్త వాళ్లకు మత్స్యకారులకు చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టినం..

2020-10-07 09:26 GMT

Laxmi barrage: లక్ష్మీ బ్యారేజ్ 23 గేట్లు ఎత్తిన అధికారులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

- లక్ష్మీ బ్యారేజ్

- పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

- ప్రస్తుత సామర్థ్యం 96.50 మీటర్లు

- ఇన్ ఫ్లో 46,400 క్యూసెక్కులు

- ఔట్ ఫ్లో 17,400 క్యూసెక్కులు

2020-10-07 09:21 GMT

Hemanth Murder Case: గచ్చిబౌలి హేమంత్ మర్డర్ కేసు అప్డేట్

 గచ్చిబౌలి హేమంత్ మర్డర్ కేసు అప్డేట్

- నేడు మరో ఏడు మందిని కస్టడీలోకి తీసుకొని విచారించనున్న గచ్చిబౌలి పోలీసులు....

- గత నేలలో జరిగిన హేమంత్ మర్డర్ కేసులో ఇప్పటి వరకు యుగందర్ రేడ్డి,లక్ష్మారెడ్డి లను కస్టడీ లోకి తీసుకుని విచారించిన గచ్చిబౌలి పోలీసులు....

2020-10-07 09:18 GMT

Nizamabad MP Dharmapuri Aravind: నా తండ్రి రాజకీయలతో నాకు సంబంధం లేదు: ఎంపీ అరవింద్

ధర్మపురి అర్వింద్... నిజమాబాద్ ఎంపీ.

- కేటీఆర్ ను కాపాడటానికి జైయేష్ రంజన్ కోర్టు ఆదేశాలను సైతం దిక్కరిస్తున్నారంటోన్న ఎంపీ ధర్మపురి అరవింద్

- కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సైతం జాయేష్ రంజన్ పట్టించుకోవటంలేదు‌‌

 - జైయేష్ రంజన్ కోసం సుప్రీంకోర్టు గడప తొక్కక తప్పటంలేదు

- జైయేష్ రంజన్ లాంటి హ్యాండ్సమ్ ఆఫీసర్ కు రూల్స్ తెలియదనుకోను

- కేటీఆర్ కు జైయేష్ రంజన్ దగ్గరగా పనిచేస్తారని విన్నాను

- 2001నుంచి మైహోం సంస్థ నల్లగొండ జిల్లాలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతోంది

- మోదీ ప్రభుత్వం అవినీతిని సహించదు.

- కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతోనే జైయేష్ రంజన్ మైహోం సంస్థకు దొంగ దారిలో అనుమతులిచ్చారు

- 2016లో కేసీఆర్, చంద్రబాబు సహకారంతో మైహోం సంస్థ అనుమతులు ట్రాన్సఫర్ చేసుకుంది

- ప్రస్తుత జగన్ సర్కార్ సైతం జై జ్యోతి సంస్థకు అనుమతులివ్వటం అనైతికం

- మై హోం‌ సంస్థకు గుంటూరులో వెయ్యి ఎకరాల అక్రమ మైనింగులున్నాయి

- పర్యావరణ అనుమతులు లేకుండానే అటవీ భూముల్లో మైహోం సంస్థ అక్రమ మైనింగ్ కు పాల్పడుతోంది

- క్రిమినల్స్ కు కాపాడవద్దని ఏపీ సీఎం జగన్ కు ఎంపీ ధర్మపురి అరవింద్ వినతి

- పెద్ద భవిష్యత్తు ఉన్న నాయకుడిగా.. జగన్ ప్రజల సొమ్మును రికవరీ చేయాలి

- మైహోం సంస్థ నుంచి వేల కోట్లు పెనాల్టీలు వసూలు చేసి భరతమాత రుణం తీర్చుకోవాలి

- ఐఏఎస్ లు శోభా, జైయేష్ రంజన్ లు చిత్తశుద్ధి కలగిన అధికారులైతే మైహోం సంస్థ కేసును సీబీఐకు అప్పగించాలి

- అక్టోబర్ 15లోపల కేసును సీబీఐకు అప్పగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

- తెలంగాణలో మైహోం సంస్థకు అమ్ముడుపోయి‌న ప్రభుత్వం ఉంది.

- రామేశ్వరం‌ నుంచి కనీసం వెయ్యి‌ కోట్లు నష్టపరిహారం కట్టిస్తాను

- నా జోలికి రావొద్దని మే నెలలో రామేశ్వరం మా ఇంటికొచ్చి మా నాన్నను కలిశాడు

-  సిద్దాంతం కోసం నా తండ్రి మాటను సైతం లెక్కచేయను.. రామేశ్వరంకు లొంగుతానా?

-  రామేశ్వరంతో మాకు 35ఏళ్ళ పరిచయం ఉన్న మాట వాస్తవం

-  రామేశ్వరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగించాలని కోరుకుంటున్నాను

-  బురద లాంటి కాంగ్రెస్ నుంచి మా నాన్న .. పెండ లాంటి టీఆర్ఎస్ లో పడ్డారు

2020-10-07 09:10 GMT

Nizamabad: ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌

నిజామాబాద్: జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రెస్ మీట్

- తొమ్మిదిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

- ఉదయం 9 నుంచి 5 వరకూ పోలింగ్

- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 824 మంది ఓటర్లు

- నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో 50 కేంద్రాలు ఏర్పాటు, బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు, రేపు పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ అందిస్తాం

- 12న కౌంటింగ్ ఉంటుంది..

- కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు

- ప్రతీ కేంద్రంలో 1+2 సిబ్బంది, 48 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తాం

- 14 సున్నితమైన కేంద్రాలు గుర్తించి వెబ్ కాస్టింగ్, వీడియో గ్రఫి పరంగా అన్ని ఏర్పాట్లు చేశాం ..

2020-10-07 09:05 GMT

Dubbaka by Elections: దుబ్బాక బీజేపి లో ముసలం.. రఘునందన్ రావుకు కమలాకర్ రెడ్డి సెగ

సిద్దిపేట జిల్లా: .... అభ్యర్థిగా రఘునందన్ రావు ను ఖరారు చేయడం పై స్థానిక బీజేపీ నాయకుడు, కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి ఆగ్రహం..

... మీడియా సమావేశం ఏర్పాటు చేసి రఘునందన్ పై మండిపాటు

.... పార్టీ ని వీడే యోచనలో తోట కమలాకర్ రెడ్డి?

2020-10-07 08:58 GMT

DUBBAKA: కాంగ్రెస్ నుంచి తెరాస‌లోకి వ‌చ్చిన‌‌ చెరుకు కొండల్ రెడ్డి

మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి టి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెరుకు కొండల్ రెడ్డి..

- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీశ్ రావు

Tags:    

Similar News