Live Updates: ఈరోజు (06 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-06 01:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 06 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ ఉ.07-10 వరకు తదుపరి చవితి | భరణి నక్షత్రం మ.01-22 వరకు తదుపరి కృత్తిక | వర్జ్యం: రా.02-32 నుంచి 04-17 వరకు | అమృత ఘడియలు ఉ. 08-30 నుంచి 09-48 వరకు | దుర్ముహూర్తం: మ. 12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ.02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 0900 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-06 13:38 GMT

కృష్ణాజిల్లా..

-24 గంటల్లోనే ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

-పథకం ప్రకారం హత్యలకు పాల్పడి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసిన నిందితులు

-నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పి రవీంద్రబాబు

-రాష్ట్రంలో సంచలనంగా మారిన విస్సన్నపేట ట్రిపుల్ మర్డర్ కేసు

-దర్యాప్తు కోసం 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు

-రామస్వామి(40)తిరుపతమ్మ(35) మీనాక్షి (11) ని దారుణంగా చంపి నిందితులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు

-విచక్షణా రహితంగా కొట్టి చంపారు

-11 సంవత్సరాల‌ బాలికను మెడకు తాడు బిగించి హత్య చేసారు

-మృతురాలు తిరుపతమ్మను కూడా దారుణంగా హత్య చేసారు

-హత్యలను యాక్సిడెంటుగా చిత్రీకరించే ప్రయత్నం

-ఆటోను గుద్దించినపుడు, గుద్దించిన ఆటో హెడ్ లైటు, సైడ్ మిర్రర్ సంఘటన స్ధలంలో లభ్యం

-నిందితుడు, మృతురాలి కాల్ డేటా ఆధారంగా బయటపడిన అక్రమ‌ సంబంధం

2020-10-06 13:31 GMT

చిత్తూరు..

-సకాలంలో ఆక్సిజన్ అందించక పోవడం తో వ్యక్తి మృతి

-పీ ఈ ఎస్ వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

-ఎమర్జెన్సీ అని వచ్చినా సరే ఆస్పత్రి సిబ్బంది సుమారు గంటపాటు పట్టించుకోలేదని ఆరోపణ

-డాక్టర్లు పట్టించుకోకపోవడంతో అంబులెన్స్ సిబ్బందే వైద్యం అందించడానికి ప్రయత్నం

-పరిస్థితి విషమించడంతో శాంతుపురం కి చెందిన సుబ్రమణ్యం నాయుడు మృతి

-ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన

2020-10-06 13:27 GMT

అమరావతి..

-రేపు మధ్యాహ్నం 12.25 నిమిషాలకు చెన్నయ్ నుంచి హైదరాబాద్ అక్కడ నుండి గన్నవరం విమానాశ్రయం కు చేరుకుని జక్కుల నెక్కలం, గూడవల్లి సర్కిల్   దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నేరుగా రైతులను కలసి మాట్లాడతారు

-3.00 గంటలకు కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమంలో పాల్గొంటారు.

-4 గంటలకు ది వెన్యూ కన్వెన్షన్ హాల్ కు చేరుకొని బీజేపీ ఏర్పాటు చేసిన కార్యక్రమం " చట్టం చేయబడిన వ్యవసాయ బిల్లు పై రైతులు, వ్యవసాయరంగ   నిపుణులు తో చర్చా కార్యక్రమం" లో పాల్గొటారు.

2020-10-06 13:22 GMT

విశాఖ..

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కామెంట్స్...

-ఈ విషయంలో గత ప్రభుత్వం బాగా చొరవ చూపింది

-కేంద్రం 7 లక్ష ల పైగా ఇళ్లను ఏపీకి కేటాయించింది

-రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ..ఇల్లు నిర్మాణం ఆపేశారు..

-విశాఖలో గతంలో వచ్చిన ఇళ్ల దరఖాస్తులను రద్దు చేయడం దారుణం

-అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వేదికను కూల్చివేశారు..

-ఆయన కూలచడంలో అద్భుతమైన ప్రతిభ చూపారు

-ఇది రద్దుల ప్రభుత్వం.. కూల్చివేతల ప్రభుత్వం..

-వైసీపీ సర్కారు అనాలోచిత చర్యల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..ముఖ్యమంత్రి గమనించాలి

-రివర్స్ టెండరింగ్ లో లాభం లేదు..

-ఎన్ డి ఏ కూటమిలో వైసిపి చేరుతుందని అనుకోను

-మీరు రాజీనామా చేస్తే..మళ్ళి పోటీకి అన్ని సర్దుకావాలి

-ఎమ్మెల్యేలు రాజీనామా లు చేసి ఇతర పార్టీలోకి వెళ్తే..నాయకుల మీద గౌరవం ఉంటుంది

-ఏపీలో ఉన్న మందు బ్రాండ్లు.. ఇంకా ఎక్కడ కనబడవు

-వచ్చే ఎన్నికల్లో జనసేన బిజేపి కలసి పోటీ చేసి రాష్ట్రం అధికారంలోకి వస్తాం..

2020-10-06 13:05 GMT

తూర్పుగోదావరి.. కాకినాడ..

-కాకినాడ పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కామెంట్స్..

-నిరుపేదలకు అన్యాయం జరిగిందని అడిగినందుకు నాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు.

-అధికారులు. కాంట్రాక్టర్ల్ స్పందించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..

-అనంతరం తిరిగి తాను ఇంటికి వెళ్లిన తర్వాత తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నట్లు తెలిసింది..

-ఇటువంటి చర్యలకు తాను బయపడను..పేద ప్రజల కు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తమ పార్టీ తరపున ఉంటా...

2020-10-06 12:59 GMT

కర్నూల్..

-రి టెండెరింగ్ పై బీవీ ఫైర్

-టీడీపీ ప్రభుత్వం లో పనులు మంజూరు చేస్తే, రి టెండెరింగ్ పేరుతో వారు చేసినట్లు చెప్పుకోవడం సరికాదు.

-ఎమ్మిగనూరు పట్టణానికి శాశ్విత తాగునీటి పథకం ఏర్పాటుకు టీడీపీ శ్రీకారం చుడితే వైస్సార్ ప్రభుత్వం తాము చేసినట్లు రి టెండెరింగ్ నిర్వహించింది.

2020-10-06 12:55 GMT

అమరావతి..

కే.ఎస్.జవహర్ మాజీ మంత్రి..

-పోలీస్ రాజ్యం ఎక్కువకాలం సాగదని తెలుసుకోండి.

-రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని ఖాకీలు గుర్తుంచుకుంటే మంచిది.

-తప్పుడు కేసులు పెట్టి, తనను వేధించిన సీఐ, ఎస్సైలపై ప్రైవేట్ కేసు పెట్టి కోర్టుకి లాగుతా.

-తనపై కేసులు పెట్టిన పోలీసులు, జగన్ పై, బియ్యపు మదుసూధన్ రెడ్డి, రోజాలపై ఎందుకు పెట్టలేదు?

-డీజీపీ, కొవ్వూరుసీఐ మూర్తి, ఎస్సై వెంకటరమణ ల వైఖరి చూస్తుంటే, వైసీపీ తరుపున ఎన్నికల్లో పోటీచేసేలా ఉన్నారు.

-కృష్ణాజిల్లాలో మంత్రి అండదండలతో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది.

-కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు ఇసుకమాఫియాలో మునిగితేలుతున్నారు.

-కొన్ని మీడియాసంస్థలు జగన్ కు తొత్తులుగా మారి, వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి.

2020-10-06 12:44 GMT

అమరావతి...

-175నియోజకవర్గాల టిడిపి అభ్యర్ధులు, సీనియర్ నాయకులతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ జరిపారు.

-‘‘కరోనాపై ప్రజలను మరింత అప్రమత్తం చేయడం, చైతన్యపర్చడం, బాధితులకు కావాల్సిన సేవలు అందించడం లక్ష్యంగా టిడిపి తరఫున ‘‘ఏపి ఫైట్స్         కరోనా’’ -వెబ్ సైట్ ప్రారంభించాం.

-ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే దీని లక్ష్యం.

-ప్రజల్లో మనోధైర్యం పెంచే కృషి చేశాం.

-బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా విపత్తుల్లో బాధితులను ఆదుకోవడంలో టిడిపి ఎల్లప్పుడూ ముందు ఉంటుంది.

-పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో మరో శిరోముండనం-రూ 30వేలు అప్పు చెల్లించలేదని బిసి యువకుడికి శిరోముండనం చేయడం దారుణం.

-తూర్పుగోదావరి జిల్లాలో వర ప్రసాద్, విశాఖలో శ్రీకాంత్, జంగారెడ్డి గూడెంలో అభిలాష్ శిరోముండనం వైసిపి ప్రభుత్వానికి సిగ్గుచేటు.

-రాజమండ్రిలో ముస్లిం మైనారిటీ షేక్ సత్తార్ ఆత్మహత్యా యత్నం బాధాకరం.

-ప్రాణాలు కాపాడాల్సిన కార్యాలయం ఎదుటే పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం సభ్య సమాజానికే తలవంపులు.

-స్నానం చేసే ఆడబిడ్డలను వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం కన్నా నీచం మరొకటి లేదు.

-‘‘మేము చాలా పేదవాళ్లం, మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు.

-మాజీ మంత్రి జవహర్ పై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపే..

-ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే టిడిపి నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు.

2020-10-06 12:24 GMT

#అపెక్స్ కౌన్సిల్ లో తెలంగాణ ప్రభుత్వం చెప్పిన కొత్త ప్రతిపాదనను ఒప్పుకోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

#299 టీఎంసీలకు ఒప్పుకుంటు 2016లో ఒప్పందాలపై సంతకం చేసిన సీఎం కేసీఆర్.

#ఇప్పుడు మళ్లీ కొత్త ప్రతిపాదన తెలంగాణ పెట్టడం సరైనది కాదు. దానికి ఒప్పుకొము అని తన వాదనలో చెప్పిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.

#తెలంగాణలో 68 శాతం కృష్ణ పరివాహక ప్రాంతం ఉంది. ఈ లెక్కన 530 టీఎంసీల నీరు తెలంగాణ ప్రభుత్వం వాడుకోనే హక్కు.

#2016లో జరిగిన ఇరు రాష్ట్రల ఒప్పందంపై సీఎం కేసీఆర్ చేసిన సంతకం వల్ల నేడు రాష్ట్రానికి దక్కాల్సిన 530 టీఎంసీ ల వాటాను కోల్పోయమంటున్న నిపుణులు

#అప్పటి టీడీపీ ప్రభుత్వంతో సీఎం చంద్రబాబుతో ఒప్పందం జరిగింది.

#మీ సర్కారు నిర్ణయంతో చేసిన సంతకం చేసారు... దానికి మేము బాధ్యత తీసుకొము అంటూ తెగేసి చెప్పిన ఏపీ సీఎం జగన్.

2020-10-06 12:20 GMT

#రిజర్వాయర్ కి అవసరమైన భూసేకరణ దాదాపుగా పూర్తయింది

#రెండవ దశ అటవీశాఖ అనుమతులకు సంబంధించి వేగంగా కార్యక్రమాలు

#కేశవాపురం ప్రాజెక్టు పూర్తయితే 2050 వ సంవత్సరం వరకు హైదరాబాద్ కు తాగునీటి కొరత ఉండదు

#హైదరాబాద్ కి తాగునీటి కొరత ఉండరాదన్న ముఖ్యమంత్రి ఆలోచన ఆధారంగానే కేశవాపురం రిజర్వాయర్

#త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా రిజర్వాయర్ శంకుస్థాపన

#హైదరాబాద్ లో మరిన్ని ఎస్ టి పిల నిర్మాణానికి ప్రణాళికలు

#ప్రస్తుతం ఉన్న 770 ఎమ్మేల్డీలకు అదనంగా మరో పన్నెండు వందల MLD లకు ఎస్ టి పి లు

#వీటికి సంబంధించిన ప్రణాళికలు, వివరాలతో కూడిన నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించాలని జలమండలికి ఆదేశం

#జలమండలి కార్యక్రమాల పైన ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ సమీక్ష

Tags:    

Similar News