Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-03 02:38 GMT
Live Updates - Page 2
2020-10-03 07:16 GMT

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం


ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహిస్తున్న హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి లోకేష్ కుమార్


తెరాస నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్, కాంగ్రెస్ నుంచి మర్రి శశధర్ రెడ్డి, నిరంజన్, భాజపా నుంచి నాయకులు పొన్న వెంకట రమణ, పవన్ హాజరు


గ్రేటర్ పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, ఫోటో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పార్టీల సూచనలు, అభ్యంతరాలు తీసుకోనున్న అధికారులు


2020-10-03 07:16 GMT

కామారెడ్డి :


కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలిగా అరుణతార పదవీ బాధ్యతల స్వీకరణ.


అంతకుముందు గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార.


2020-10-03 07:15 GMT

నల్గొండ : దేశవ్యాప్తంగా పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఎప్ బి క్రియేట్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘరానా ముఠాను పట్టుకున్న నల్గొండ పోలీసులు...


దేశ వ్యాప్తంగా 350 మంది పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఎఫ్ బి అకౌంట్స్ ఓపెన్...


ఓఎల్ఎక్స్ ,ఫేస్ బుక్ అప్లికేషన్లు అడ్డగా ,ఆర్మీ పేరు తో నేరాలు...


రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ జిల్లా కేత్వాడ కు చెందిన‌ ముస్తఖీమ్ ఖాన్ ,మనీష్ ,షాహిద్ ,సద్దాం ఖాన్ ల అరెస్టు...


నిందితుల నుంచి లక్ష రూపాయల నగదు ,ఎనిమిది మొభైల్ ఫోన్లు ,ఒక లాప్ టాప్ ,30 సిమ్ కార్డులు ,నకిలీ ఆధార్ కార్డులతో పాటు డాక్యుమెంట్లు స్వాధీనం...


తెలంగాణ కు చెందిన 81 మంది పోలీసు అధికారుల పేరుతో డబ్బులు వసూళ్లకు పాల్పడిన‌ముఠా....


మీడియా సమావేశం లో నల్గొండ ఎస్పీ రంగనాధ్....


2020-10-03 07:14 GMT

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల అందోళన..

రాహుల్ గాందీ అరెస్టు నిరశిస్తూ అందోళన...

అందోళన చెస్తున్నా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

2020-10-03 07:14 GMT

హోంమంత్రి మహమూద్ ఆలి

ఐటిఐ కాలేజీ ఎప్పటి నుండో ఉంది జాబ్ త్వరగా రావాలంటే ఐటిఐ చేస్తే సరిపోతుంది అని మంచి అభిప్రాయం ఉంది..

ఇక్కడ 25 మంది స్టాఫ్ ఉన్నారు 772 మంది విద్యార్థులు ఉన్నారు...

ఇక్కడ నైపుణ్య శిక్షణ తీసుకోవడం వల్ల మంచి భవిష్యత్ ఉంది...

ఈ ఐటిఐ కేంద్ర ప్రభుత్వం మంచి సహకారం ఉంది..

దీని ద్వారా టెక్నికల్ గ త్వరగా నేర్చుకోవచ్చు..

మంత్రి మల్లారెడ్డి

మల్లేపల్లి ఐటిఐ కి ఒక చరిత్ర ఉంది 1954లో తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి ఐటిఐ..

2 కోట్ల నిధులు దీనికి కేటాయించము..

రాష్ట్రంలో ఐటిఐ లకు కేంద్రం మరో 70కోట్లు కేటాయిస్తున్నారు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని చదువుకుంటున్న విద్యార్థులు టెక్నాలజీలో ముందుకు వెళ్తున్నారు...

ఇది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రాజెక్ట్ 10కోట్ల రూపాయలతో నిర్మించారు...

భవిష్యత్ లో మంచి ప్రయోజకులను చేయ డానికి ఇది ఏర్పాటు చేసాం...

2020-10-03 07:13 GMT

కేంద్ర హంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి

మల్లేపల్లి ఐటిఐ నీ మోడల్ ఐటిఐ గా గుర్తించిన మొదటి అడుగు...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాం..

దేశంలో 29 రాష్ట్రాల్లో 29 ఐటిఐ లు కేంద్రం ఏర్పాటు చేసింది...

మారుతున్న కాలాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రారంభం చేసుకోవడం జరిగింది..

14790 ఐటిఐ లు ఉన్నాయి అందులో 14లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు...

మోడల్ ఐటిఐ లకు 300 లకొట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది..

కేంద్ర ప్రభుత్వం 7 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్లు మోడల్ ఐటిఐ లకు కేటాయించారు...

దీనిద్వారా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఇండియా తో ముందుకు వెళ్తున్నాం..

కరోనా తో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. అలా కాకుండా టెక్నికల్ గా ఒకేశ్నల్ కోర్సులు ప్రవేశ పెట్టబోతున్నం..

జర్మనీ ,జపాన్ లాంటి దేశాలు ఇలాంటి టెక్నికల్ కోర్సు తో ముందుకు వెళ్తున్నాయి..

ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశం మనది అలాంటిది వారికి అన్ని రంగాల్లో మంచి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది...

33 ఏళ్ల తరువాత నూతన విద్యా విధానం ప్రవేశపెట్టుకున్నం..

2020-10-03 07:12 GMT

కరీంనగర్ : కరీంనగర్ లో నేటి నుండి డ్రంకన్ డ్రైవ్ పునః ప్రారంభం

కరోనా నేపథ్యం లో గత కొన్ని రోజులుగా డ్రంకన్ డ్రైవ్ నిలిపేసిన పోలీస్ లు

నేటి నుండి డ్రంకన్ డ్రైవ్ ..,వాహన తనిఖీలు ప్రారంభం..

2020-10-03 07:12 GMT

కరీంనగర్ జిల్లా

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో లిక్విడ్ గ్యాస్ ఉత్పత్తి యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్...

మంత్రి గంగుల కామెంట్స్

ఒక్క రోజులో 2630 సిలిండర్ల ఉత్పత్తిని ఈ లిక్విడ్ గ్యాస్ యంత్రం తయారు చేస్తుంది...

హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రెండవ లిక్విడ్ గ్యాస్ యంత్రాన్ని కరీంనగర్ లో ప్రారంభించాం...

కోవిడ్ నియంత్రణలో కరీంనగర్ ఆదర్శంగా నిలిచింది...

కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రయివేట్ ఆసుపత్రుల కంటే ధీటుగా తయారుచేస్తున్నాం...

సిటీ స్కాన్ యంత్రం గత కొద్ది నెలలుగా పనిచేయలేదు...మరో నెల రోజుల్లో నూతన యంత్రాన్ని తీసుకోస్తాం...

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మందుల కొరత,,తదితర సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తాం...

ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం కలిగించేలా సిబ్బంది కృషి చేయాలి..

2020-10-03 07:12 GMT

మరి కొద్దిసేపట్లో ప్రగతి భవన్ లో ఉమ్మడి 6 జిల్లాల ఎమ్మెల్యే లతో సీఎం కేసీఆర్ సమావేశం..

ప్రగతి భవన్ కి చేరుకుంటున్న ఎమ్మెల్యేలు..

గ్రాడ్యుయేట్ ఎన్నికల పై ప్రత్యేక చర్చ...

నియోజకవర్గ అభివృద్ధి,ధరణి వెబ్ సైట్ తో పలు అంశాలపై ఎమ్మెల్యే లకు దిశ నిర్దేశం చేయనున్న సీఎం..

గ్రాడ్యుయేట్ లు అందరూ ఓటు హక్కు నమోదు చేసుకునే ప్రచారం నిర్వహణ..

మొదటగా మూడు జిల్లాల ఎమ్మెల్యేల తో సమావేశం..ఆ తరువాత ఇంకా మూడు జిల్లాల ఎమ్మెల్యే లతో సమావేశం..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పై క్లారిటీ వచ్చే అవకాశం....

ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారన్న అభిప్రాయాలను ఎమ్మెల్యే ల నుంచి తీసుకోనున్న సీఎం..


2020-10-03 07:11 GMT

మహబూబాబాద్ జిల్లా...

ఎల్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష, దీక్ష లో భారీగా పాల్గొన్న బీజేపీ శ్రేణులు.


Tags:    

Similar News