Live Updates: ఈరోజు (02 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-02 01:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 02 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పాడ్యమి: రా.03-02 వరకు తదుపరి విదియ | రేవతి నక్షత్రంపూర్తిగా | వర్జ్యం: సా.06-55 నుంచి రా.08-41వరకు | అమృత ఘడియలు: తె.05-32నుంచి 06-36 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ. 12-09 నుంచి 12.56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-02 13:00 GMT

-తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి మళ్ళీ పాజిటివ్

-జ్వరము, దగ్గు, ఒళ్లునొప్పులు, ఉండడంతో కరోనా పరీక్షా చేసుకోగా పాజిటివ్ అని నిర్దారణ

-సిటి స్కాన్ లో నార్మల్ గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు

-తనను కలిసిన వారు కరోనా పరీక్షా చేసుకోవలసిందిగా భూమన అభినయ్ అందరికి విజ్ఞప్తి

2020-10-02 12:57 GMT

అమరావతి..

కళా వెంకట్రావ్

పత్రికా ప్రకటన

-అశోక్ గజపతిరాజుపై కక్షతో మాన్సాస్ ట్రస్ట్ ను నిర్వీర్యం చేయడం హేయం

-పంచభూతాలను దోచుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైజం.

-పాదయాత్ర సమయంలోనే జగన్ రెడ్డి కన్ను మాన్సాస్ ట్రస్ట్ పై పడింది.

-మాన్సాస్ ట్రస్ట్ ను భ్రష్టుపట్టించడమే లక్ష్యంగా ఏ1, ఏ2 లు తెరవెనుక పావులు కదుపుతున్నారు.

-మాన్సాస్ ట్రస్ట్ లో ప్రభుత్వ అనవసర జోక్యంతో, అటు సామాజిక సేవా కార్యకలాపాలను దెబ్బతీయడంతోపాటు, ట్రస్ట్ సంస్థ ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం గర్హనీయం.

2020-10-02 12:57 GMT

అమరావతి..

కళా వెంకట్రావ్

పత్రికా ప్రకటన

-అశోక్ గజపతిరాజుపై కక్షతో మాన్సాస్ ట్రస్ట్ ను నిర్వీర్యం చేయడం హేయం

-పంచభూతాలను దోచుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైజం.

-పాదయాత్ర సమయంలోనే జగన్ రెడ్డి కన్ను మాన్సాస్ ట్రస్ట్ పై పడింది.

-మాన్సాస్ ట్రస్ట్ ను భ్రష్టుపట్టించడమే లక్ష్యంగా ఏ1, ఏ2 లు తెరవెనుక పావులు కదుపుతున్నారు.

-మాన్సాస్ ట్రస్ట్ లో ప్రభుత్వ అనవసర జోక్యంతో, అటు సామాజిక సేవా కార్యకలాపాలను దెబ్బతీయడంతోపాటు, ట్రస్ట్ సంస్థ ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం గర్హనీయం.

2020-10-02 12:54 GMT

తూర్పుగోదావరి :

-2019 అసెంబ్లీ ఎన్నికలలో తన ప్రత్యర్థిగా పోటీన చేసిన వ్యక్తి కి పింఛన్ అందించిన ఎమ్మెల్యే పర్వత ప్రసాద్..

-ప్రజాశాంతి పార్టీ తరపున టిడిపి ప్రోద్బలంతో పోటీ చేసిన పర్వత ప్రసాద్ అనే వ్యక్తి..

-అనారోగ్యం పాలవడంతో ఏలేశ్వరం లో అతడి ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్..

2020-10-02 12:52 GMT

కృష్ణాజిల్లా..

మంత్రి ఆదిమూలపు సురేష్..

-కంకిపాడు ఎంపీపీ పాఠశాలలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు

-సీఎం జగన్ చేతుల మీదగా విద్యాకానుక అక్టోబర్ 5 న ప్రారంభం

-విద్యార్థులకు కిట్ లో పుస్తకాలు, మూడు జతల యూనిఫామ్, బ్యాగ్, షూస్, బెల్ట్ అందజేస్తాం

-తోలి విడతలో 12,500 పాఠశాలలకు మహర్దశ

-నాడు-నేడు పథకం ద్వారా పది రకాల మౌలిక వసతుల కల్పన

-ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యా బోధన అందే విధంగా కృషి

-సెప్టెంబర్ 30 లోగా మొదటి విడత పనులు పూర్తి చేస్తాం

-నవంబర్ 2 నుండి పాఠశాలలు ప్రారంభం

2020-10-02 12:49 GMT

కృష్ణాజిల్లా..

-గన్నవరం మండలం కొండపావులూరులో ఆర్ఎస్ నెం.6 ఎన్.డి.ఆర్.ఎఫ్, NIDM కోసం భూములిచ్చిన రైతులు

-నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వలేదంటూ యన్.డి.ఆర్.ఎఫ్ ఎదుట ఆందోళనకు రైతులు

-ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదు

-ఎన్ డి ఆర్ ఎఫ్ భూసేకరణలో ఇచ్చే నష్టపరిహారంలో అనేక అవకతవకలు

-కొంతమంది అధికారులతో కుమ్మక్కై సర్వే నెంబర్లను మార్చి నష్టపరిహారం పొందుతున్నారు

-భూముల్లో ఫెన్సింగ్ ను రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రి పడేయడంతో తీవ్రంగా నష్టపోయాం

2020-10-02 12:45 GMT

అమరావతి..

-ట్విట్టర్ లో టిడిపి సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి...

-వృద్ధురాలి మెడలో గొలుసు కొట్టేసిన వాలంటీర్ కి సత్కారం చెయ్యాలా...?

-నాటు సారా కాసిన వాలంటీర్ ని అభినందించాలా...?

-అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన వాలంటీర్ కి సన్మానం చెయ్యాలా...?

-మహిళ పై హత్యాయత్నం చేసిన వాలంటీర్ కి కృతజ్ఞతలు తెలపాలా...?

-ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న వారికి చప్పట్లు కొట్టాలా..?, చెట్టుకి కట్టేసి కొట్టాలా...? సమాధానం చెప్పండి జగన్ గారు.

-ఏడాదిగా వాలంటీర్లు చేస్తున్న అరాచకాలకు సంబంధించిన వీడియోని ట్విట్టర్ లో రిలీజ్ చేసిన బండారు సత్యనారాయణ మూర్తి...

2020-10-02 12:35 GMT

అమరావతి..

-వైసీపీ ఎంఎల్సీ‌డొక్కా మాణిక్య వరప్రసాద్..

-1.38లక్షల గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఉద్యోగాలు కల్పించారు

-85వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సచివాలయ ఉద్యోగులు ఉన్నారు

-దళితులకు అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదు

-దళితుల మీద దాడిలో ఎస్సై, సీఐ స్ధాయి వ్యక్తులపై చర్యలు తీసుకున్నది జగన్ ప్రభుత్వం

-కొన్ని రాజకీయ పార్టీల అజెండాతో దళితులు మోసపోవద్దు

-జగన్ సంక్షేమ కార్యక్రమాలు చూస్తుంటే ఆర్ధిక శాస్త్రవేత్తలు అందరూ నివ్వెరపోతున్నారు

-కుల, మత విబేధాలు తేవడంపై జాగృతంగా ఉండాలని దళిత సంఘాలకు విజ్ఞప్తి

-దళితులు వాస్తవాలను గమనించాలి

2020-10-02 12:22 GMT

అమరావతి..

-కనక దుర్గమ్మ వారి ఆలయంలో ఆహ్వానించిన మూడు టెండర్లు కు నేటి వరకు నాలుగు రోజులైనా వెబ్ సైట్ లలో టెండర్ ఫారాలు లభ్యం కావడం లేదు.

-ఇందులో ఈవో సురేష్ బాబు మరల మంత్రి వెల్లంపల్లి అనుచరులకు బంధువులకు కట్టబెట్టే కుట్రకోణం ఉందనే అనుమానం కలుగుతుంది.

-ఈ విషయంలో పారదర్శకత లేకపోతే జనసేన భక్తుల తరపున పోరాటం చేస్తుంది.

-పోతిన వెంకట మహేష్ (జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్)

2020-10-02 12:17 GMT

అమరావతి...

-జడ్జి రామకృష్ణ, హైకోర్టు న్యాయవాది దేవన్ కుమార్ ను పోలీసులు నిర్బంధించడాన్ని ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

-ప్రశాంతంగా జరిగే చలో మదనపల్లి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం.

-దళితులపై దాడులకు అడ్డుకట్ట వేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది.

-తక్షణమే నిర్బంధించిన వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

Tags:    

Similar News