Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 01 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-01 00:44 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం, 01 సెప్టెంబర్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం చతుర్దశి (ఉ.8-47 వరకు) తదుపరి పూర్ణిమ, ధనిష్ఠ నక్షత్రం (సా. 4-55 వరకు) తదుపరి శతభిషం, అమృత ఘడియలు (ఉ.6-04 నుంచి 7-44 వరకు) వర్జ్యం (రా. 12-23 నుంచి 2-15 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా.10-51 నుంచి 11-37 వరకు) రాహుకాలం (సా. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-49; సూర్యాస్తమయం: సా.6-13

ఈరోజు తాజా వార్తలు 

Live Updates
2020-09-01 14:22 GMT

ఆదిలాబాద్ జిల్లా

- ఆదిలాబాద్ జిల్లాలో విజ్రుంబిస్తున్నా కరోనా..

- ఒక్కరోజులో 126 కేసులు నమోదు..

- బాదితులను చికిత్స కోసం అసుపత్రికి తరలింపు

2020-09-01 14:21 GMT

- తెలంగాణ ఎక్సైజ్ శాఖ పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం జీవో జారీ

- రాష్ట్రంలో కొత్తగా 14 ఎక్సైజ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన సర్కారు

- ఈ మేరకు 14 కొత్త ఎక్సైజ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- ఎక్సైజ్‌ శాఖలో 131 కొత్త పోస్టులు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

2020-09-01 14:20 GMT

- ఆదిలాబాద్ హెచ్ ఎంటీవీతో రిమ్స్ డైరెక్టర్ బానోతు బలరాం నాయక్..

- రిమ్స్ అసుపత్రికి పీజీ మెడికల్ సీట్లు రానున్నాయి..

- ఎనిమిది విబాగాలలో నలబై ఎనిమిది పీజీసీట్లు వస్తాయి..

- సీట్ల కోసం ఇరవై లక్షల రుపాయలు ఎంసీఐకి పీజులు కట్టాం..

- పీజీ సీట్లు సాదించిన వారికి అవసరమైన బోదన చేయడానికి నియమాకాలను పూర్తి చేశాం..

- త్వరలో ఎంసీఐ. తనిఖీలకు వచ్చేవకాశం ఉంది..

- ఎంసీఐ పరిశీలన తర్వాత పీజీ సీట్లకు అనుమతి ఇస్తుంది..

- వచ్చే విద్యాసంవత్సరంలో పీజీ సీట్లను కేటాయించేవకాశం ఉంది..

- రిమ్స్ కు పీజీ సీట్లు రావడం వల్ల వైద్య సేవలు మెరుగువుతాయి..

- పీజీ సీట్లతో రోగులకు అన్ని విబాగాలలో వైద్య సేవలు అందుతాయి..

- వైద్యం కోసం ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు

2020-09-01 14:19 GMT

ఏసీబీ ఈఎస్ఐ స్కామ్...

- ఈ ఎస్ ఐ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, ఫార్మా సిస్ట్ నాగలక్ష్మి అక్రమ ఆస్తులను సీజ్ చేసిన ఏసీబీ...

- సైబరాబాద్ లో కమర్షియల్ రెసిడెన్షియల్ స్థలం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం లో తమ కుటుంబసభ్యులు, బినామి ల పేరుతో పెట్టుబడులు పెట్టిన మాజీ ఈ ఎస్ ఐ డైరెక్టర్ దేవిక రాణీ, ఫార్మా సిస్టు నాగలక్ష్మి.

- నాగలక్ష్మి కి చెందిన 72 లక్షలు , దేవిక రాణీ కి చెందిన 3 .7 కోట్ల రూపాయలు సీజ్ చేసిన ఏసీబీ

- బినామీల పేరు మీద 22 లక్షలు పెట్టుబడి పెట్టిన దేవిక రాణీ

- 2 కోట్ల 29 లక్షల రూపాయలు చెక్కు ద్వారా చెల్లింపూ

- ఇప్పటికే ఇద్దరు నిందితులు బెయిల్ పై విడుదల.

2020-09-01 11:47 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా


సరస్వతి బ్యారేజ్


8 గేట్లు ఎత్తిన అధికారులు


పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు


ప్రస్తుత సామర్థ్యం 118.100 మీటర్లు


పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ


ప్రస్తుత సామర్థ్యం 8.77 టీఎంసీ


ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 10,600 క్యూసెక్కులు


2020-09-01 11:46 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా


లక్ష్మీ బ్యారేజ్


65 గేట్లు ఎత్తిన అధికారులు


పూర్తి సామర్థ్యం 100 మీటర్లు


ప్రస్తుత సామర్థ్యం 97.20 మీటర్లు


పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ


ప్రస్తుత సామర్థ్యం 8.494 టీఎంసీ


ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 8,60,700 క్యూసెక్కులు


2020-09-01 11:46 GMT

వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు లబ్దిదారులకు పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .


2020-09-01 11:46 GMT

ట్యాంక్ బండ్ మీద క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర


మరికొద్ది సేపట్లో నిమజ్జనం జరగనున్న గణనాథుడు


2020-09-01 10:33 GMT

ఖమ్మం


ఖమ్మం ఒకటో డివిజన్ లో ఉద్రిక్తత


ఆనంద్ అనే యువకుని మృతికి డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ కారణమని దాడి చేసేందుకు యత్నించిన కైకొండాయి గూడెం గ్రామస్థులు..


కారు ధ్వంసం చేసి నిప్పు పెట్టిన గ్రామస్థులు


గ్రామానికి చేరుకున్న పోలీసులు


కొనసాగుతున్న ఉద్రిక్తత...


2020-09-01 10:33 GMT

తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి...


రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తిచేసి ఐదు సంవత్సరాలు గడిచినా ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో 620 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు..


నత్తనడకన పూర్తి 42 వేల ఇళ్ల నిర్మాణాన్ని పేదలకు పంచకుండా పెండింగ్ లో పెట్టడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోంది...


పేదల ఇల్లు కూల్చివేసి ఇళ్ల నిర్మాణానికి స్థలాలు ఇస్తామని చెప్పి అనేక మంది ఇల్లు కూల్చివేశారు ప్రస్తుతం వీరు వీధిలోకి నెట్టపడ్డారు..


పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి 400 ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పినా ఇంతవరకు ఏ నియోజకవర్గానికి కూడా ఇళ్లను ఇవ్వలేదు..


రాష్ట్రంలో 2.60 లక్షల ఇళ్లకు గాను 1.90 లక్షల ఇళ్లకు మాత్రమే టెండర్లు పిలిచారు...


2020 మే నాటికి 41 వేల ఇళ్లు పూర్తయినట్లు నివేదికలు చెబుతున్నాయి...


1.10 లక్షల ఇళ్ళు 90 శాతం పూర్తయినట్లు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు..


18,600 కోట్ల అంచనతో చేపట్టిన ఈ పథకానికి రాష్ట్రం 705 కోట్లు ,కేంద్రం 1300 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది...


ఈ ఇళ్లకు గ్రామీణ ప్రాంతాలకు 5లక్షలు పట్టణ ప్రాంతాల్లో 5.3 లక్షలు అదనంగా వసతి సౌకర్యాలకు లక్ష ఇస్తామన్నారు...


తక్షణమే పూర్తయిన ఇళ్ల పంపిణీ చేయాలని టెండర్లు పిలిచి మేరకు ఇళ్ల నిర్మాణం రానున్న రెండు నెలల్లో పూర్తి చేయడంతోపాటు ఇల్లు లేనివారికి గ్రామ గ్రామాలలో పట్టణాలలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టాలని సీపీఎం కోరుతుంది...


Tags:    

Similar News