Ayodhya Ram Mandir Bhumi Pujan Live Updates: అయోధ్య రామ మందిరం భూమి పూజ లైవ్ అప్ డేట్స్!

Ayodhya Ram Mandir Bhumi Pujan Live Updates: జగదానంద కారకుడికి మందిర నిర్మాణం. ఎన్నో ఏళ్ల కల.. ఆ కల సాకారానికి తొలిఅడుగు మరి కొద్దిగంటల్లో పడనుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఆ వేడుకకు సంబంధించి ఎప్పటికప్పుడు లైవ్ అప్ డేట్స్!

Update: 2020-08-05 02:35 GMT
శతకోటి భారతీయుల ఎన్నో ఏళ్ల కల! ఆదర్శ పురుషునికి ఆలయ నిర్మాణం. గుండెల్లో కొలువైన రాములోరికి ఇలలో గుడి కట్టాలనే సంకల్పం. ఎన్నో అవాంతరాలు.. మరెన్నో వివాదాలు..అన్నిటినీ దాటుకుంటూ వచ్చిన మధుర క్షణాలు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మరికొన్ని గంటల సమయంలో భూమి పూజ జరగబోతోంది. ఈ సందర్భంగా ఆ అపురూప ఘట్టానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమాచారాన్నీ ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తున్నాం!
Live Updates
2020-08-05 07:20 GMT

రామమందిర నిర్మాణానికి అభిజిత్ ముహూర్తంలో శంకుస్థాపన జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం 12.44 నిమిషాలకు వెండి ఇటుకను ప్రధాని నరేంద్ర మోదీతో అక్కడి పండితులు ప్రతిష్ఠ చేయించారు.



 


2020-08-05 06:48 GMT

- ప్రధాని మోడీ కొద్ది సేపటి క్రితం రామందిర భూమిపూజా వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ పండితులు ఆయనతో పూజా కార్యక్రమాన్ని ప్రారంభింప చేశారు. పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.



 





2020-08-05 06:21 GMT

హనుమాన్ ఘడి ఆలయం నుంచి భూమి పూజ జరిగే సభాస్థలికి బయలు దేరిన ప్రధాని మోడి

2020-08-05 06:20 GMT

- 10 వ శతాబ్దం నాటి పురాతన హనుమాన్ ఆలయంలో పూజలు

- హనుమాన్ ఘడి ఆలయంలో ప్రధాని మోడికి తలపాగాతో కూడిన వెండి కిరీటం బహుకరించిన ఆలయ పూజారులు

2020-08-05 06:04 GMT

అయోధ్య చేరుకున్న ప్రధాని మోడి

స్వాగతం పలికిన సీఎం యోగి ఆధిత్యనాథ్

2020-08-05 04:57 GMT

- అయోధ్య లో భూమిపూజ జరిగే ప్రాంగణానికి చేరుకున్న యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్

- మరికొద్ది సేపట్లో లక్నో చేరుకోనున్న ప్రధాని మోడి

2020-08-05 04:57 GMT

- అయోధ్య లో రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది.

- రంగు రంగుల పూల దండలు, కాషాయ తోరణాల అలంకరణలతో అయోధ్య శోభయమానంగా మారింది.

- అయోధ్యకు వెళ్లే రహదారులకు ఇరువైపులా రామ మందిర నమూనా చిత్రాలను, రామ్‌లల్లా చిత్రాలను అలంకరించారు

2020-08-05 04:15 GMT

అయోధ్య భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావడానికి లక్నో బయలుదేరిన ప్రధాని మోడి

2020-08-05 04:08 GMT

జాతీయం

అయోధ్య భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావడానికి లక్నో బయలుదేరిన ప్రధాని మోడి



 


2020-08-05 04:03 GMT

- అయోధ్య‌లో రామమందిరం నిర్మాణం కోసం కొద్ది గంటల్లో  భూమిపూజ జ‌రుగ‌నుంది.

- ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతోపాటు ప‌లువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

- ప్రధాని ఈరోజు ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక జెట్‌లో ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరతారు.

- 10.40కి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బ‌య‌లుదేరి 11.30కి అయోధ్య‌కు చేరుకుంటారు.

- 11:40కి హ‌నుమాన్‌గ‌ర్హి ఆలయంలో పూజలు చేస్తారు.

- 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ప్రధాని సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన పురోహితుడు మ‌హంతి రాజుదాస్ స‌హా ప‌లువురు అర్చ‌కులు దేశంలో క‌రోనా తొల‌గిపోవాలంటూ వేద‌మంత్రాలు చ‌దువ‌నున్నారు. 

- మధ్యాహ్నం 12 గంటలకు రామజన్మభూమి ప్రాంతానికి ప్రధాని చేరుకోనున్నారు.

- మధ్యాహ్నం 12:30 నుంచి 12:40 వరకు భూమి పూజ జరుగనుంది.

- మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది.

- 2:15 గంటలకు ప్ర‌ధాని తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

- కాగా, భూమిపూజకు ఆహ్వానం అందిన‌వారే అయోధ్యకు రావాలని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్‌ విజ్ఞప్తి చేశారు.

- మొత్తం 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం పంపిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

- భూమిపూజ కార్యక్రమంలో రెండు వేల ప్రాంతాల నుంచి సేక‌రించిన‌ పవిత్రమైన మట్టి, 100 నదుల నుంచి తెచ్చిన‌ నీరును వినియోగించనున్నారు. 

Tags:    

Similar News