చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు

Update: 2019-08-12 15:48 GMT

ఉత్తమ పోషకాలు ఇచ్చే మంచి ఆహారంగా చేపలను చెప్పుకోవచ్చు. మంచి ఆరోగ్యానికి కావాల్సిన నాణ్యమైన మాంసకృత్తులు చేపలలో ఉంటాయి. అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉండే మాంసాహారం చేపలు మాత్రమే. చేపలను ఎలా చేసుకొని తిన్నా రుచిగానే ఉంటాయి. చేపల పులుసే కాదు, చేపల వేపుడు కూడా అద్భుతంగానే ఉంటుంది.ఏదో ఒక రూపంలో చేపలను వారంలో కనీసం 1 లేదా 2 సార్లు తీసుకుంటే అద్భుతమైన లాభాలు ఉన్నాయి.

వృద్యాప్యం మీద పడుతున్న కొద్ది సహజంగానే మతిమరుపు వస్తుంటుంది. ఇది తీవ్రతరమై అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. ఇలా ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. చేపలతో మెదడు తీరు కూడా మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చేపలను ఎక్కువగా తినడం ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ తెలిపింది. వాటిలోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. ఈ కారణంగా రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.

చేపలను తరచూ తినడం వల్ల డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు ఓత్తిడిని తగ్గిస్తాయి. ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించడంలో చేపలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది. చేపల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ఓ అధ్యయ వివరాలను ప్రచురించారు. స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉండాలన్నా.. తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News