Noni Juice: సెలబ్రిటీలు తాగుతున్న ఈ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో
Noni Juice: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా నోని ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారు. ఎక్కువ మంది సెలబ్రిటీలే ఈ జ్యూస్ తాగుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ నోని పండ్ల గురించి ఎక్కువగా వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. నోని అని పిలిచే ఈ పండ్లను ఆసియాలోని కొన్నిదేశాలు, ఆస్ట్రేలియాలో అధికంగా పండిస్తున్నారు. మన దేశంలోనూ ఈ పండ్ల వినియోగం ఎక్కువగా పెరుగుతుంది. ఈ పండ్లను మన దగ్గర కూడా పండిస్తున్నారు. ఈ పండ్లను సూపర్ మార్కెట్లోనూ కొనుగోలు చేయవచ్చు. ఈ పండ్లను నేరుగా తినడం కంటే జ్యూస్ లా చేసి తాగితే మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. నోని పండ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
నోని పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, ఏలతోపాటు బీటా కెరోటిన్, ఐరిడాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకోవచ్చు. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. నోటిపండ్లను తినడం వల్ల ఇమ్యూనిటి పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పండ్లలో స్కోపోలెటిన్ , క్వర్సెటిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఈ నోని పండ్లను తింటున్నా లేదా వాటి జ్యూసులను తాగుతున్నా ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాపులు కూడా తగ్గుతాయి.
నోని పండ్లు పెయిన్ కిల్లర్ గా పనిచేస్తాయి. అధ్యయనాలు చెబుతున్న విధంగా ఈ పండ్ల జ్యూస్ ను తాగడం వల్ల కీళ్ల నొప్పులు, మెడ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పండ్లను తింటే కండరాలుప్రశాంతంగా మారుతాయి. కండరాల నొప్పులు తగ్గుతాయి. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారు ఈ పండ్లను తింటున్నా లేదా వీటి జ్యూసులను తాగుతున్నా కండరాల నొప్పి నుంచి బయటపడవచ్చు. నోని పండ్లు బీపీని కూడా తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. పొగతాగేవారు ఈ పండ్లను తింటుంటే గుండెపోటు రాకుండా చూడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
అంతేకాదు ఈ పండ్లు తినడం వల్ల షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్ ను మరింత సమర్థవంతంగా ఉపయోగిస్తుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అధికంగా బరువు ఉన్నవారు రోజూ నోని జ్యూస్ ను తాగుతుంటే ఫలితం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చు అవుతాయి. కొవ్వుకూడా కరుగుతుంది. బరువు తగ్గుతారు. ఆకలి కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ నోని జ్యూస్ తాగడం వల్ల ఇలా అనేక లాభాలను పొందవచ్చు.