విటమిన్‌-డి వారికి తప్పనిసరి..

Update: 2019-08-12 15:23 GMT

ఇప్పుడు చాలా మందిలో విటమిన్‌-డి లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. వారిలో విటమిన్‌-డి లోపం పెద్ద సమస్యగా మారుతోంది. బయటకు వెళ్ళి ఆటలు ఆడటం తగ్గిపోయాక ఈ సమస్య మరింత పెరిగింది. పిల్లలు ఎక్కువ సమయం ఇంట్లో, తరగతి గదుల్లోనే ఉండడం, ఎండలో అనుకున్నంత సమయం ఉండకపోవడం వల్ల వారిలో డి- విటమిన్‌ లోపిస్తోంది. ఈ లోపం పభుత్వం వర్తాలో కూడా ఆందోళన కలిగిస్తోంది. దీన్ని అధిగమించడం కోసం ప్రభుత్వాలు ప్రణాళిక సిద్దం చేస్తున్నాయి.

ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ, మైదనంలో ఆటపాటలు పీరియడ్‌, అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఆరుబయటే నిర్వహించాలని పాఠశాలకు ఆదేశాలు జారీచేశారు. ప్రయోగత్మకంగా లక్నోలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్లాన్‌ను ముందుగా అమలు చేయాలని నిర్ణయించారు..విటమిన్‌ డి లోపం వల్ల ఎముకలు సున్నితంగా మారడం, ఎముకలు వంకర్లు పోవడం జరుగుతుంది. దాన్ని నివారించేందుకు ఎండలోనే అసెంబ్లీ, డ్రిల్‌ పీరియడ్‌ నిర్వహించాల్సిందిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది.

విటమిన్‌ డి అనేది మిగతా విటమిన్ల మాదిరిగా కూరగాయలు, పండ్లు, ఆహారంలో లభించదు. కేవలం సూర్యరశ్మి ద్వారానే ఈ విటమిన్‌ అందుతుంది. కాబట్టి పిల్లల్ని ఉదయం కొద్దిసేపు ఎండలో ఆడుకోనివ్వడం, సాయంత్రం వేళ విద్యార్థులు ఆటలు ఆడేలా చూడటం మంచిది. దీని ద్వారా పిల్లల్లో విటమిన్‌-డి సమస్య తలెత్తకుండా సమస్యను అధిగమించవచ్చు. సరిపడా విటమిన్‌ డి ఉంటే వారి ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతాయి.  

Tags:    

Similar News