జుట్టు తెల్లబడుతోందా? అయితే ఇలా చేయండి..

Update: 2019-08-18 13:51 GMT

హెయిర్.. స్టయిల్‌గా ఉండాటానికి యూత్ తెగ ఆరాటపడుతుంటారు. జుట్టు నల్లగా ఉంటేనే అందం అని చాలమంది బావిస్తారు. జుట్టు తెల్లబడడం మొదలు పెడితే మానసికంగా కృంగిపోయే వారు ఉన్నారు. అయితే జుట్టు తెల్లబడటం అనేది ఈ రోజుల్లో అరుదైన సమస్య కాదు. చిన్న వయసులోనే చాలామందికి జుట్టు నెరవడం సాధారణమైపోయింది. అయితే జుట్టు తెల్ల పడటం వల్ల చిన్న వయసులోనే, వయసు మీద పడినట్టు కనపడేట్టు చేస్తుంది. దీనివల్ల చాలమంది ఇదో పెద్ద సమస్యగా బావిస్తుంటారు. దీంతో జుట్టుకి రంగులు వేయడం చేస్తూంటారు.

చిన్న వయసులో జుట్టు నెరవడాన్ని కెనాయిటిస్ అంటారు. 20 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారి జుట్టు తెల్లబడిపోతే.. వారిని కెనాయిటిస్ బాధితులుగా చెబుతారు డాక్టర్లు. హెయిర్ తెల్లగా మారటానికి చాల కారణాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు. కొందరికి జన్యు సంబంధమైన కారణంతో రావచ్చు. మరికొందరికి కొన్ని పోషకాల లోపం వల్ల రావచ్చు. హార్మోన్లలో అసమతుల్యత వల్ల, హిమోగ్లోబిన్ ప్రొటీన్ లోపంతో కూడా జుట్టు తెల్లబడే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. చిన్న వయసు నుంచే ఆహారంపైన దృష్టి పడితే ఈ సమస్యను చాలావరకూ నివారించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారంలో విటమిన్ బీ7 ఉండేలా చూసుకోవాలి అంటున్నారు. రసాయనాలతో నిండిన యాంటీ డ్యాండ్రఫ్ షాంపూలు వారంలో రెండు సార్లకు మించి వాడకపోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Tags:    

Similar News