నీళ్లు తాగితే దురుద మటుమాయం!

Update: 2019-08-07 10:35 GMT

చాలమంది జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. కొంత మందికి మాడు దురద పెట్టడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఆ సమస్యంలో జుట్టుని కత్తిరించేయాలి అన్న కోపం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సమస్యలతో బాధపడే వారు కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రొబయాటిక్స్‌ ఎక్కువగా తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా మాడు దురద సమస్య నుండి ఉపశమనం కలిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. రోజుకు ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగితే మాడు భాగం ఆరోగ్యంగా ఉంటుంది. వెంట్రుకలు కూడా బాగ పెరుగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

హెయిర్ స్టయిలింగ్‌ కోసం ఉపయోగించే క్రీమ్స్‌, కలర్స్‌.. జుట్టుకు తేమ అందకుండా చేస్తాయట. ఇలాంటి వాడటం వల్ల వెంట్రుకలకు హాని జరుగే అవకాశం ఉంది. కనుక క్రీమ్స్, కలర్స్ వాడకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. షాంపూ ఎక్కువగా వాడడం వల్ల వెంట్రుకల ఆరోగ్యానికి అవసరమైన నూనెలు తొలగిపోయి, మాడుభాగం మరింత పొడిబారే అవకాశం ఉంది. రోజూ తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుందట. అందుకే తక్కువ పీహెచ్‌, సోడియం, సల్ఫేట్స్‌ రహిత షాంపూను ఉపయోగించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేందుకు.. జట్టుకు చక్కగా నూనె రాసుకొని మర్ధన చేసుకోవాలంటున్నారు నిపుణులు. కొబ్బరి, ఆలివ్‌, నువ్వులు, ఆముదం, లావెండర్‌ నూనెలతో వెంట్రుకలకు మసాజ్‌ చేసుకుంటే హెయిర్‌కి మంచి లుక్ తో పాటు.. కురులు నిగనిగలాడుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Tags:    

Similar News